• తాజా వార్తలు
  •  

వాట్సాప్ కలర్ చేంజి లింకును అస్సలు క్లిక్ చేయొద్దు


150 దేశాల్లో వేలాది కంప్యూటర్లను కుళ్లబొడిచేసిన ర్యాన్సమ్‌వేర్ వైరస్ అక్కడితో ఆగడం లేదు. వాట్సాప్ యూజర్లకూ దీని ద్వారా ముప్పు పొంచి ఉంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ప్లాట్‌ఫాంలపై వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లకు ఇప్పుడు ఓ మెసేజ్ వైరల్‌లా వస్తోంది.
''వాట్సాప్ సాధారణంగా గ్రీన్ కలర్ స్కిన్‌తో ఉంటుంది, అయితే ఆ కలర్ కాకుండా ఇంకా ఎరుపు, నీలం, పసుపు వంటి రంగుల్లోనూ వాట్సాప్ వచ్చింది, కావాలంటే దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అందుకు ఓ లింక్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది...'' అని ఆ మెసేజ్‌లో ఉంటుంది. దీనికి తోడు ఓ మాల్‌వేర్ లింక్ కూడా ఆ మెసేజ్‌లో దర్శనమిస్తోంది.

ఈ క్రమంలో సహజంగానే ఆ ఫీచర్ పట్ల ఆకర్షితులైన యూజర్లు ఆ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. అలా లింక్ క్లిక్ చేయగానే ఆ యూజర్ ఉన్న వాట్సాప్ గ్రూప్‌లు అన్నింటిలోనూ ఆ మెసేజ్ యూజర్‌కు తెలియకుండానే పోస్ట్ అవుతోంది. దీంతో చాలా మందికి ఆ మెసేజ్ వైరల్‌లా చేరుతుంది. ఆ తరువాత పనికి రాని యాడ్‌వేర్ యాప్స్ అన్నీ ఫోన్‌లలో వాటంతట అవే ఇన్‌స్టాల్ అవుతున్నాయి. దీంతో వైరస్ ఫోన్లలో విస్తరించి డివైస్‌లను పనికిరాకుండా చేస్తోంది. అచ్చం వాన్నక్రై వైరస్‌ను పోలి ఉండడంతో ఇది అదేనా..? లేక వేరే ఎవరైనా కొత్తగా వైరస్‌ను సృష్టించారా..? అన్న సందేహాలు సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ నిపుణులకు కలుగుతున్నాయి.

రెడిట్ అనే ఓ సోషల్ సైట్‌లో ఓ యూజర్ తొలుత ఈ తరహా వాట్సప్ మెసేజ్‌ను గుర్తించాడు. అనంతరం దీని గురించి అందరినీ అప్రమత్తం చేయడంతో వాట్సాప్ లో వస్తున్న ఈ యాడ్ వేర్ మెసేజ్ గురించి తెలిసింది. అయితే ఆ ఫేక్ మెసేజ్‌లో ఉండే వెబ్‌సైట్ లింక్ కూడా అచ్చం వాట్సాప్ లింక్‌ను పోలి ఉంటోంది. http://шһатѕарр.com పేరిట ఆ లింక్ ఉంటోంది. దీంతో సహజంగానే అది ఒరిజినల్ వాట్సాప్ లింక్ అనుకుని చాలా మంది ఆ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. అయితే నిజానికి ఈ సైట్ నకిలీది. ఈ లింక్‌లో ఉండే ш అనే సింబల్ ఇంగ్లిష్ అక్షరం W ను పోలి ఉంటుంది. కనుకనే దానికి తేడా గుర్తించలేక చాలా మంది వాట్సాప్ యూజర్లు ఈ నకిలీ సైట్ బారిన పడినట్టు తెలిసింది. సో... ఇలాంటి లింక్ వస్తే అస్సలు క్లిక్ చేయొద్దు.

ఈ సంగతి గుర్తుంచుకోండి* వాట్సాప్ ఎప్పుడూ తన అప్ డేట్స్ గురించి ఇలా లింకుల రూపంలో మెసేజెస్ సెండ్ చేయదు.
* ఒకవేళ ఇలాంటి లింకు మీకు ఎక్కడినుంచైనా వచ్చినా దాన్ని తెరవొద్దు, ఎవరికీ సెండ్ చేయొద్దు
* మంచి యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ వేసుకుని మీ మొబైల్ ను డాటా లాస్ నుంచి కాపాడుకోండి.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు