• తాజా వార్తలు
  •  

వాట్సాప్‌లో లేటెస్ట్ ఫీచ‌ర్స్ అంద‌రికంటే ముందే పొందడం ఎలా?

వాట్సాప్ అంద‌రి ఫోన్ల‌లోనూ ఉంటుంది. మీ ఫోన్‌లోనూ ఉంది. ఇంక మీ గొప్పేంటి? ల‌క్ష రూపాయ‌ల ఐ ఫోన్‌లో అయినా,  5వేల రూపాయ‌ల రెడ్‌మీ ఫోన్‌లో అయినా వాట్సాప్‌లో సేమ్ ఫీచ‌ర్లు అవే. మ‌రి మీరు స్పెష‌ల్‌గా క‌నిపించాలంటే?  వాట్సాప్‌లో ఎప్ప‌టికప్పుడు వచ్చే లేటెస్ట్ ఫీచ‌ర్ల‌ను అంద‌రికంటే ముందు మీరే వాడ‌గ‌లిగితే.. మీరు ప్ర‌త్యేకంగా క‌న‌ప‌డ‌డం ఖాయం. అందుకు మీరు చేయాల్సింది ఏమీ లేదు. జ‌స్ట్ బీటా టెస్ట‌ర్‌గా మార‌డ‌మే.
బీటా టెస్ట‌ర్‌గా మారాలంటే..
1.బ్రౌజ‌ర్‌లో వాట్సాప్ బీటా టెస్ట్  (WhatsApp beta test) పేజీని ఓపెన్ చేయండి.   https://play.google.com/apps/testing/com.whatsapp లింక్‌ను లేదా whatsapp.com/android/  అని బ్రౌజ‌ర్‌లో ఎంట‌ర్‌చేసి క్లిక్‌చేయండి. 
2.  మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి         
3. లాగిన్ పూర్త‌య్యాక   Become A Tester  అని క‌నిపించే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి .    ఇప్ప‌టికే వాట్సాప్ ఉన్న చాలా ఫోన్ల‌లో  ఈ లాగిన్ ప్రాసెస్ లేకుండానే నేరుగా యాప్ ఓపెన్ అవుతుంది.
4. మీరు బీటా టెస్ట‌ర్ అయిపోయినట్లే. వాట్సాప్ కొత్త‌గా ట్రై చేయాల‌నుకునే  ఏ ఫీచ‌ర్ అయినా ముందుగా మీలాంటి బీటా టెస్ట‌ర్ల‌కే పంపిస్తుంది. 
5. అంటే కోట్లాది మంది సాధార‌ణ యూజ‌ర్ల కంటే ముందుగా మీరే వాట్సాప్‌లో వ‌చ్చే కొత్త ఫీచ‌ర్ల‌ను వాడుకోగ‌లుగుతారు.
అన్నీ రాక‌పోవ‌చ్చు
మీకు వ‌చ్చిన కొత్త అప్‌డేట్స్ అన్నీ మిగిలిన యూజ‌ర్ల‌కు త‌ర్వాత కూడా రాక‌పోవ‌చ్చు.  ఎందుకంటే  టెస్ట్ చేసిన ఫీచ‌ర్ల‌న్నీ అంత స‌క్సెస్ కావు.  ఎర్ర‌ర్ ఫ్రీగా, యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఉన్న ఫీచ‌ర్ల‌నే వాట్సాప్ అంద‌రు యూజ‌ర్ల‌కూ అందుబాటులోకి తెస్తుంది.
 

జన రంజకమైన వార్తలు