• తాజా వార్తలు
  •  

ప్ర‌తి కాంటాక్ట్‌కు వాట్స‌ప్ నోటిఫికేష‌న్స్ ఎలా క‌స్ట‌మైజ్ చేసుకోవాలో తెలుసా?

ఈ టెక్ యుగంలో ఎక్కుమంది ఉప‌యోగించే టెక్నాల‌జీలో వాట్స‌ప్ ఒక‌టి. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఈ యాప్‌ను త‌మ ఫోన్‌లో ఉంచుకుంటారు. వాట్స‌ప్ మీద గంట‌లు గంట‌లు గ‌డిపేవాళ్లేంద‌రో. ఐతే వాట్స‌ప్‌లో రోజు రోజుకు కొత్త కొత్త ఫీచ‌ర్లు వ‌స్తున్నాయి. అప్‌డేట్ చేసేకొద్దీ న‌యా ఫీచ‌ర్లు యూజ‌ర్ల‌ను ప‌ల‌క‌రిస్తుంటాయి. ఐతే ఎన్ని ఫీచ‌ర్లు వ‌చ్చినా కొన్నింటిని మాత్ర‌మే యూజ‌ర్లు ఉప‌యోగిస్తుంటారు. మెసేజింగ్‌, వీడియో షేర్ చేయ‌డం వ‌ర‌కే చాలా మంది ప‌రిమితం అవుతారు. ఇంకొంద‌రు వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఆప్ష‌న్ల‌ను కూడా ఉప‌యోగించుకుంటారు. కానీ వాట్స‌ప్‌లో ఇవే కావు ఎన్నో ఆప్ష‌న్లు ఉన్నాయి. మన ఫోన్‌లో ఉన్న ప్రతి కాంటాక్ట్‌కు వాట్స‌ప్ నోటిఫికేష‌న్స్ క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు. అది ఎలా చేయాలో చూద్దాం...

కొన్నిప్రత్యేక ట్యూన్ల‌తో..
మ‌న వాట్స‌ప్‌లో విడివిడిగా కాంటాక్ట్‌లు ఉంటాయి. కొన్ని ప్రత్యేక గ్రూప్‌లు కూడా ఉంటాయి. అయితే గ్రూప్‌ల‌తోనే పెద్ద ఇబ్బంది.. ఎందుకంటే కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చిప‌డుతున్న మెసేజ్‌ల‌ను మ‌నం చ‌ద‌వ‌లేం. వీడియోల‌ను చూడ‌లేం. దీంతో అవ‌స‌ర‌మైన‌, కీల‌మైన మెసేజ్‌ల‌ను కూడా మ‌నం మిస్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అందులోనూ వ్య‌క్తిగ‌త కాంటాక్ట్‌ల మెసేజ్‌ల‌ను కూడా మ‌నం చూసే అవ‌కాశాలు కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. దీని వ‌ల్ల మ‌నం ఇబ్బందుల్లో ప‌డొచ్చు. దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి కొన్ని మార్గాలున్నాయి. మ‌న‌కు అవ‌స‌ర‌మైన కాంటాక్ట్‌కు ప్ర‌త్యేక‌మైన మెసేజ్ టోన్‌ను పెట్టుకోవాలి. దీని వ‌ల్ల ఎంత‌మంది మ‌న‌కు మెసేజ్‌లు పంపినా కీల‌క‌మైన మెసేజ్‌ను మ‌నం మిస్ అయ్యే అవ‌కాశం లేదు. అన్ని కాంటాక్ట్‌ల‌కు ఈ ట్యూన్ల‌ను పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. దీనికి ప్ర‌త్యేక‌తంగా నోటిఫికేష‌న్ క‌ల‌ర్‌, లేక‌పోతే వైబ్రేష‌న్ సెట్టింగ్ చేసుకుంటే మ‌రింత మంచిది.

క‌స్ట‌మైజ్ టోన్‌, వైబ్రేష‌న్ ఎలా..
మీకు ముఖ్య‌మైన కాంటాక్ట్‌కు క‌స్ట‌మైజ్ టోన్‌, వైబ్రేష‌న్ పెట్టుకోవాలంటే ముందుగా ఆ కాంటాక్ట్ ప్రొఫైల్ పేజ్‌లోకి వెళ్లాలి. అందులో మీకు క‌స్ట‌మ్‌ నోటిఫికేష‌న్ ఆప్ష‌న్ క‌నిపిస్తుది. దానికింద మ్యూట్ టొగెల్ బ‌ట‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయ‌గానే యూజ్ క‌స్ట‌మ్ నోటిఫికేస‌న్స్ అనే విండో ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి యూజ‌ర్లు టోన్‌, వైబ్రేష‌న్‌, పాప‌ప్ నోటిఫికేష‌న్‌ల‌ను సెట్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు