• తాజా వార్తలు
  •  

మ‌న మోడీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో నెంబ‌ర్ 1

మ‌న ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ వెబ్‌సైట్ల‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌.. ఇలా ఏ ప్లాట్‌ఫారం ను వ‌ద‌ల‌కుండా అన్నింట్లోనూ మోడీకి అకౌంట్లు ఉన్నాయి. సామాన్య ప్ర‌జ‌ల నుంచి అమెరికా అధ్య‌క్షుడి వ‌ర‌కూ అంద‌రితోనూ నిత్యం ట‌చ్‌లో ఉండ‌డానికి ఆయ‌న సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌నే ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకుంటారు. ముఖ్యంగా మెసేజ్ షేరింగ్ యాప్ ట్విట్ట‌ర్‌, ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ల్లో ఆయ‌న సూప‌ర్ యాక్టివ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన లీడ‌ర్‌గా మోడీ ఫ‌స్ట్‌ప్లేస్‌లో నిలిచారు. ఈ విషయంలో ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నూ అధిగమించారు. 69 ల‌క్షల మంది ఫాలోయ‌ర్లు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ షేక్ హ‌సీనాతో కార్ జ‌ర్నీ, న‌యా రాయ్‌పూర్‌లో పులిని ఫొటో తీయ‌డం, అమృత్‌స‌ర్ గోల్డెన్ టెంపుల్‌లో భ‌క్తుల‌కు అన్న‌దానం చేయ‌డం, త‌ల్లి ద‌గ్గ‌ర ఆశీర్వాదం, స్కూల్ పిల్ల‌ల‌తో ముచ్చ‌ట్లు, ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్‌.. ఇలా ఏ సంద‌ర్భాన్న‌యినా మోడీ త‌న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేస్తారు. వివిధ దేశాధినేత‌లు, క్రీడాకారులు, సినిమా స్టార్‌లు.. ఇలా పలువురితో తాను దిగిన ఫొటోలు, కొన్ని ప‌ర్స‌న‌ల్ ఫొటోల‌నూ కూడా షేర్ చేసుకుంటారు. ఇలా గ‌తేడాది మొత్తం ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లో 101 పోస్టులు పెట్టారు. వీటికి కామెంట్లు, లైక్‌ల‌తో నెటిజన్లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేశారు. వీటిని బేస్ చేసుకుని చూస్తే మ‌న పీఎంకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 69 లక్షల మంది ఫాలోయ‌ర్లు ఉన్నార‌ని ఇన్‌స్టాగ్రామ్ లెక్క‌గ‌ట్టింది. అలా ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లో నెంబ‌ర్ వ‌న్ అయిపోయారు. 63 లక్షల మంది ఫాలోయ‌ర్స్‌తో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌, 37 ల‌క్ష‌ల మంది ఫాలోయ‌ర్ల‌తో పోప్ ఫ్రాన్సిస్ సెకండ్‌, థ‌ర్డ్ ప్లేస్‌ల్లో నిలిచారు. సంవ‌త్స‌ర కాలంగా వ‌ర‌ల్డ్ టాప్‌లీడ‌ర్లు, అధ్య‌క్షులు, ఫారిన్ అఫైర్స్ మినిస్ట‌ర్ల‌కు చెందిన 325 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పరిశీలించి ఆ సంస్థ ఈ ర్యాంకులు ప్ర‌క‌టించింది. Narendra modi @narendramodi. instagram లోకి వెళితే మోడీ షేర్ చేసే ఫొటోలు, వీడియోలు చూడొచ్చు. లైక్‌లు, కామెంట్లు కూడా ఇవ్వ‌చ్చు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు