• తాజా వార్తలు
  •  

మీ  ఆన్‌లైన్ స్టేట‌స్ అంద‌రికి తెలిసిపోయే లోపం వాట్స‌ప్‌లో ఉంది తెలుసా?

ఉద‌యం లేవ‌గానే అద్దంలో ముఖం చూసుకుంటామో లేదో తెలియ‌దు కానీ  ప‌క్కా వాట్స‌ప్ చూసుకుంటాం. అంత‌గా ఈ సోష‌ల్ మీడియా  మాధ్య‌మానికి  అల‌వాటు ప‌డిపోయాం.  అయితే వాట్స‌ప్ వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో అంత‌కంటే ఎక్కువ‌గా న‌ష్టాలు కూడా ఉన్నాయి.  వాటిలో   ముఖ్య‌మైంది స్టేట‌స్ కూడా ఒక‌టి. మ‌న‌కు ప‌రిచ‌యం లేనివాళ్లు కూడా మ‌న  స్టేట‌స్‌ని ఫాలో అయ్యే ప్రమాదం  దీంతో  ఉంది.  అదే మీరు  ఎంత‌సేపు   ఆన్‌లైన్‌కు వ‌చ్చారు.. ఎంత‌సేపు ఉన్నారో కూడా ఇప్పుడు తెలిసిపోతుంది. దీనివ‌ల్ల వాట్స‌ప్‌ను ఎంత‌సేపు వాడుతున్నారు... ఎప్పుడు నిద్ర‌పోతున్నారు.. ఎప్పుడు లేస్తున్నారు లాంటి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా వాట్స‌ప్ ద్వారా తెలిసిపోతున్నాయి. మ‌రి వీటిని నివారించ‌లేమా?

లాస్ట్ సీన్‌, ఆన్‌లైన్‌
లాస్ట్‌సీన్‌..చాలామందికి (ముఖ్యంగా ల‌వ‌ర్స్‌)కు గొడ‌వ‌లు పెట్టేది ఇదే. లాస్ట్ సీన్ చూసి నువ్వు ఆన్‌లైన్‌లో ఉన్నా నాకు  మెసేజ్ చేయ‌లేదు. నీ లాస్ట్‌సీన్ ఇప్పుడు ఉంది...అప్పుడు ఉంది అనే  గొడ‌వ‌లు స్నేహితుల మధ్య స‌ర్వ‌సాధారణం.  ఒక‌ర‌కంగా రిలేష‌న్స్ మ‌ధ్య చిచ్చు కూడా పెడుతుంది ఈ ఆప్ష‌న్.  ఇక ఆన్‌లైన్ ఆప్ష‌న్ కూడా అంతే. మీరు ఆన్‌లైన్‌లో  ఉండి మీకు కావాల్సిన వారికి మెసేజ్ చేయ‌క‌పోతే ఇక ఆ బాధ మాములుగా ఉండ‌దు. ఈ రెండు ఫీచ‌ర్లు అంద‌రికి  మీ గురించి చెప్పేస్తాయి.  ఎప్ప‌డూ ఆన్‌లైన్‌లో ఉంటే వాట్స‌ప్  మీరు   బాగా వాడేస్తున్న‌ట్లే లెక్క‌. లాస్ట్ సీన్‌ను బ‌ట్టి  మీ మాన‌సిక స్థితిని కూడా చెప్పేస్తున్నారిప్పుడు. ఒక‌రకంగా ఇది వాట్స‌ప్ డిజైన్ ఫ్లోలో లోప‌మే. 

మీ కాంటాక్ట్‌లో లేనివారు కూడా... 
 మీ స్నేహితులో లేదా బంధువులో మీ గురించి తెలుసుకుంటే ఫ‌ర్వాలేదు కానీ అప‌రిచితులు  మ‌న గురించి ఫాలో అయితే చాలా ఇబ్బంది. మీరెవ‌రో తెలుసుకోవాలంటే మీ నంబ‌ర్  సేవ్ చేసుకుని వాట్స‌ప్‌లోకి వెళితే  చాలు... మీ ఫొటో, మీ  స్టేట‌స్‌, లాస్ట్‌సీన్‌, ఆన్‌లైన్  ఇలా అన్నిఅంద‌రికి అందుబాటులోకి వ‌స్తాయి.  ఇది వాట్స‌ప్‌లో ఉన్న సెక్యూరిటీ లోప‌మే.  మ‌న లాస్ట్‌సీన్‌ను  హైడ్ చేసే అవ‌కాశం  ఉంది. అయితే దీనివ‌ల్ల  కూడా మీరు స్నేహితుల‌కు దూరం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.  ఈ లోపాల‌ను  స‌రిదిద్ద‌క‌పోతే యూజ‌ర్ల‌కు  ఇబ్బందులు త‌ప్ప‌వు. ముఖ్యంగా  మీ ఆన్‌లైన్ స్టేట‌స్ అప‌రిచితుల‌కు అందకుండా  చేయ‌డం చాలా ముఖ్యం.

జన రంజకమైన వార్తలు