• తాజా వార్తలు
  •  

వాట్స్ యాప్ మెసేజ్ పొరపాటున సెండ్ చేశారా.. నో ప్రాబ్లెం

వాట్స్ యాప్ లో అదిరిపోయే ఫీచర్ తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు టెక్ ఇండస్ర్టీలో టాక్. అదేంటో తెలిస్తే ఆశ్చర్యం, అంతకుమించి ఆనందం కలగక మానవు. ఒక్కోసారి పొరపాటునో, గ్రహపాటునో పంపించకూడని మెసేజో, ఫొటోయే యాక్సిడెంటల్లీ సెండ్ అవుతాయి. ఒక గ్రూప్ లో పోస్ట్ చేయాల్సినది సంబంధం లేని ఇంకో గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. అలాంటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి సెండ్ అని నొక్కిన తరువాత క్యాన్సిల్ చేయడమన్నది అస్సలు వీలు కాదు. అయితే.... వాట్స్ యాప్ వినియోగదారులు పడుతున్న ఈ ఇబ్బందిని గుర్తించిన ఆ సంస్థ ఈ విషయంలో గట్టి ప్రయత్నాలే చేస్తోందట. సెండ్ తో పాటు అన్ సెండ్ ఆప్షన్ కూడా ఇవ్వాలని ట్రై చేస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఫేస్ బుక్ మాదిరిగానే..
వాట్స్ యాప్ ని కలిగి ఉన్న సోషల్ మీడియా సైట్ ఫేస్ బుక్ లో లైక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనం దేనికైనా లైక్ కొట్టాక మనసు మారితే మళ్లీ అన్ లైక్ చేసే వీలుంది అందులో. అలాగే... ఏదైనా మనం షేర్ చేసినా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని రిమూవ్ చేయడమో.. మన టైం లైన్లో కనిపించకుండా హైడ్ చేయడమో చేసేందుకు అన్ని ఛాన్సులూ ఉన్నాయి. ఎటొచ్చీ వాట్సాప్ లోనూ ఒకసారి సెండ్ కొడితే మళ్లీ వెనక్కు తీసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి. ఇప్పుడు టెస్ట్ చేస్తున్న ఈ ‘అన్ సెండ్’ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తే మాత్రం యూజర్లకు హ్యాపీనే.
5 నిమిషాల తరువాత..
అలాగే ఇంకో ఫీచర్ పైనా వాట్స్ యాప్ ట్రయల్స్ వేస్తోంది. యూజర్ పంపే మెసేజ్‌లు 5 నిమిషాల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. అయితే దీన్ని యూజర్ కావాలనుకుంటేనే ఉపయోగించుకునే విధంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను వాట్సాప్ ఎప్పటికప్పుడు ప్రవేశ పెడుతుండగా త్వరలో రానున్న ఈ ఫీచర్ యూజర్లను ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి..! అయితే యూజర్ పంపే మెసేజ్ 5 నిమిషాలు ఆగాక డిలీట్ అవుతుందా, లేదంటే అవతలి యూజర్ చదివిన 5 నిమిషాలకు డిలీట్ అవుతుందా అనే దానిపై స్పష్టత లేదు. ఈ క్రమంలో వాట్సప్ ఈ కొత్త ఫీచర్‌ను అంతర్గతంగా పరీక్షిస్తున్నట్టు తెలిసింది. త్వరలో దీన్ని బీటా వెర్షన్‌లో అందించి, ఆపై మరిన్ని మార్పులు, చేర్పులు చేసి ఫైనల్ వెర్షన్ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సప్ డెవలపర్లు సిద్ధమవుతున్నారు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు