• తాజా వార్తలు
  •  

  వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌.. ఫొటో బండ్లింగ్‌

ప్ర‌పంచంలో అత్యంత ఫేమ‌స్ అయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ రోజుకో కొత్త ఫీచ‌ర్‌తో యూజ‌ర్ల మ‌న‌సు దోచుకుంటోంది.  ఎలాంటి ఫైల్‌న‌యినా సెండ్ చేసుకునే ఆప్ష‌న్‌ను  ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టింది. ఇప్పుడు తాజాగా ఫోట్ బండ్లింగ్ అనే ఫీచ‌ర్‌ను తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. బేటా యూజ‌ర్ల‌కు ఆల్రెడీ ఈ ఫీచ‌ర్‌ను ఇచ్చింది. దీంతోపాటు  కాలింగ్ స్క్రీన్‌ను కూడా రిఫ్రెష్ చేసి తీసుకొచ్చింది. 
ఫొటో బండ్లింగ్ అంటే..  
ప్ర‌స్తుతం వాట్సాప్ లో ఎవ‌రికైనా ఎక్కువ ఫొటోలు పంపాలంటే మ‌నం ఒకేసారి సెండ్ చేసినా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టే వాళ్ల‌కు సెండ్ అవుతున్నాయి.  ఫొటో బండ్లింగ్ ఫీచ‌ర్ ద్వారా ఎక్కువ ఫొటోల‌ను ఒక ప‌ర్స‌న్‌కు పంపిస్తే అది ఫొటో ఆల్బ‌మ్ మాదిరిగా వాళ్ల‌కు చేరుతుంది. వాళ్లు అలా రిసీవ్ చేసుకున్న ఆల్బ‌మ్‌ను ఓపెన్ చేస్తే  ఫోటోల‌న్నీ సింగిల్ పేజీలోనే క‌నిపిస్తాయి.  ఐఫోన్ యూజ‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్ గ‌త నెల‌లోనే అందుబాటులోకి వ‌చ్చింది. ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు త్వ‌ర‌లో రానుంది.  
  పైకి స్వైప్ చేస్తేనే కాల్ ఆన్స‌ర్  
అలాగే వాట్సాప్‌లో కాలింగ్ స్క్రీన్‌లో కూడా మార్పులు చేసింది. ఇంత‌కుముందు కాల్ ఆన్స‌ర్ చేయాలంటే సైడ్‌కు స్వైపింగ్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు  పైకి స్వైప్ చేయాల్సి ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు