• తాజా వార్తలు
  •  

వాట్స‌ప్ స్టేట‌స్ ఫీచ‌ర్ సూప‌ర్ హిట్‌

సోష‌ల్ మెసేజింగ్ యాప్ వాట్స‌ప్ ఇటీవ‌లే ఇంట్ర‌డ్యూస్ చేసిన వాట్స‌ప్ స్టేట‌స్ ఫీచ‌ర్ సూప‌ర్ హిట్ అయింది. రోజూ 17 కోట్ల 50 ల‌క్షల మంది యూజ‌ర్లు దీన్ని వినియోగిస్తున్నారు. దీంతో స్నాప్‌చాట్‌ను బీట్ చేసి వాట్స‌ప్ స్టేట‌స్ ఫీచ‌ర్ ముందుకెళ్లింది.
స్నాప్‌చాట్‌ను బీట్ చేసిoది
స్నాప్‌చాట్ -లైక్ స్టోరీస్ తో స్నాప్‌చాట్ దూసుకెళుతుండ‌డంతో ఫేస్‌బుక్ గ్రూప్ త‌న మెసేజింగ్ యాప్ వాట్స‌ప్‌లో స్టేట‌స్ ఫీచ‌ర్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. దీనిలో యూజ‌ర్ ఫొటోస్‌, వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చు. ఒక‌టి కంటే ఎక్కువ ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసుకోగ‌ల‌గ‌డం దీనిలో మ‌రో స్పెషాలిటీ. అంతేకాదు మీ ఫ్రెండ్స్‌, రిలేటివ్స్ వాట్స‌ప్ స్టేట‌స్‌ను చూసి మీరు దాన్ని లైక్ లేదా కామెంట్ చేమొచ్చు. ఎంత‌మంది మీ వాట్స‌ప్ స్టేట‌స్ చూశారో కూడా ఫిగ‌ర్ చేసి చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే స్టేట‌స్ ఫీచ‌ర్‌ను చూసింది ఎవ‌రో కూడా తెలుస్తుంది. దీంతో ఈ ఫీచ‌ర్ బాగా పాపుల‌ర‌యింది.
ఇన్‌స్టాగ్రామ్ త‌ర్వాత సెకండ్ ప్లేస్
ఫేస్‌బుక్ అనుబంధ ఇన్‌స్టాగ్రామ్ లో ఇలాంటి స్టోరీస్‌ను బాగా పాపుల‌ర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రోజూ 20 కోట్ల మంది వీటిని వీక్షిస్తున్నారు. త‌ర్వాత స్థానంలో స్నాప్‌చాట్ లైక్ స్టోరీస్ 16 కోట్ల 50 ల‌క్ష‌ల మంది హిట్ల‌తో ఉండేది. అయితే లేటెస్ట్‌గా వాట్స‌ప్ స్టేట‌స్ ఫీచ‌ర్‌కు రోజుకు 17.50 కోట్ల హిట్లు రావ‌డంతో స్నాప్‌చాట్ ను వెన‌క్కినెట్టి సెకండ్ ప్లేస్‌లోకి వ‌చ్చింద‌ని ఫేస్‌బుక్ త‌న లేటెస్ట్ రిపోర్ట్‌లో చెప్పింది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు