• తాజా వార్తలు
  •  

వాట్సాప్ లో లేనివి వాట్స‌ప్ బిజినెస్‌లో ఉన్నవి ఏమిటి ?

వాట్స‌ప్ బిజినెస్‌.. బిజినెస్ చేసే వాళ్ల కోసం  వ‌చ్చిన కొత్తగా వ‌చ్చిన మంచి ప్ర‌త్యామ్నాయం. అయితే రెగ్యుల‌ర్ వాట్స‌ప్ కంటే బిజినెస్ వాట్స‌ప్ భిన్న‌మైంది. ఉప‌యోగ‌క‌ర‌మైంది. త‌మ క‌స్ట‌మ‌ర్ల‌తో క‌మ్యునికేష‌న్ చేయ‌డం కోసం బిజినెస్ పీపుల్‌కి  ఈ బిజినెస్ వాట్స‌ప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఈ రెండు వాట్స‌ప్‌ల మ‌నం ఒకేసారి వాడ‌డం కుద‌ర‌దు. ఎందుకంటే ఒకే నంబ‌ర్ మీద రెండు వాట్స‌ప్‌ల‌ను వాడ‌లేం. ఒక‌వేళ వాడాల‌ని అనుకుంటే క‌చ్చితంగా డ్యుయ‌ల్ సిమ్ ఉప‌యోగించాల్సిందే. మ‌రి వాట్స‌ప్ బిజినెస్‌కు వాట్స‌ప్‌కు ఉన్న తేడా ఏమిటి? ...బిజినెస్ వాట్స‌ప్‌లో ఉన్న కొత్త ఫీచ‌ర్లు ఏమిటి? 

ల్యాండ్‌లైన్ నంబ‌ర్ యాడ్ చేసుకోవ‌చ్చు
వాట్స‌ప్ అంటే కేవ‌లం మొబైల్ నంబ‌ర్ యాడ్ చేసుకోవ‌డ‌మే మ‌న‌కు తెలుసు. కానీ  ల్యాండ్ లైన్ నంబ‌ర్‌ను యాడ్ చేసుకునే ఫీచ‌ర్‌ని కలిపిస్తోంది బిజినెస్ వాట్స‌ప్‌. దీని వ‌ల్ల బిజినెస్ పీపుల్‌కు ఇది చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ‌మంది త‌మ షాప్‌ల‌లో, కంపెనీల్లో ల్యాండ్ లైన్ నంబ‌ర్ల‌నే ఉప‌యోగిస్తారు.

ఆటో రిప్లేలు సెట్ చేసుకోవ‌చ్చు
వాట్స‌ప్ బిజినెస్‌లో ఉన్న మ‌రో ఫీచ‌ర్ ఆటో రిప్లేస్‌. అంటే మీరు అందుబాటులో లేని స‌మ‌యంలో లేదా ఏదైనా బిజిగా ఉండే అవ‌త‌లి వారికి స‌మాధానం ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఆటో రిప్లే ఆప్ష‌న్ పెట్టుకుంటే స‌రిపోతుంది. దీని వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. ఆ ఆటో రిప్లేల‌ను కొన్ని గంట‌లు, రోజులు, లేదా ఫ‌లానా స‌మ‌యానికి మ‌నం సెట్ చేసుకోవ‌చ్చు. 

మెసేజ్ స్టాటిస్టిక్స్‌
సాధార‌ణంగా మామూలు వాట్ప‌ప్‌లో ఎన్ని మెసేజ్‌లు పంపామో.. ఎన్ని రిసీవ్ చేసుకున్నామో మ‌న‌కు తెలియ‌దు. కానీ బిజినెస్ వాట్స‌ప్‌లో మ‌నం పంపిన మెసేజ్‌లు, మ‌న‌కు వ‌చ్చిన మెసేస్‌లు ఇలా స‌మ‌స్త  స‌మాచారం స్టాటిస్టిక్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది.   

బిజినెస్ టైప్‌, గ్రీన్ టిక్
మ‌న‌కు సంబంధించి బిజినెస్‌ను బ‌ట్టి కాంటాక్ట్‌ల‌ను సెట్ చేసుకోవ‌చ్చు.  దీని వ‌ల్ల మ‌న క‌స్ట‌మ‌ర్ల‌కు  మనం సుల‌భంగా దొరికే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌స్తుతం ఇచ్చిన కేట‌గిరిలో మీ బిజినెస్ లేక‌పోతే అద‌ర్స్ మీద క్లిక్ చేయ‌చ్చు. ఇక వాట్స‌ప్‌లో ఎవ‌రైనా మ‌న మెసేజ్ చదివితే బ్లూటిక్‌లు వ‌స్తాయి. కానీ వాట్స‌ప్ బిజినెస్ యాప్‌లో మాత్రం గ్రీన్ టిక్‌లు వ‌స్తాయి. ఇదే కాక బిజినెస్ వాట్స‌ప్ లోగో కూడా భిన్నంగా ఉంటుంది. దీనికి బి అనే లోగో ఉంటుంది. 
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు