• తాజా వార్తలు
  •  

ఇండియ‌న్ల వాట్సాప్ వీడియో కాలింగ్‌.. రోజుకు 5 కోట్ల నిముషాలు

వాట్సాప్.. ఇండియ‌న్ మొబైల్ యూజ‌ర్ల‌కు అతి త‌క్కువ కాలంలో చేరువైన మెస్సేజింగ్ యాప్ .ఫొటోలు, వీడియోలు కూడా మెసేజ్ రూపంలో పంపించుకునే అవ‌కాశం ఉండ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. దీనికితోడు వాట్సాప్ ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన వీడియో కాలింగ్ ఫీచ‌ర్ అయితే సూప‌ర్ హిట్ అయింది. ఎంతలా అంటే ప్ర‌పంచంలో అత్యధికంగా వాట్సాప్ వీడియోకాల్స్ వినియోగించుకునేది ఇండియ‌న్లేన‌ట‌.
20 కోట్ల మంది యూజ‌ర్లు
వాట్సాప్ త‌న వీడియో కాలింగ్ ఆప్ష‌న్‌ను గ‌త న‌వంబ‌రులో ఇంట్ర‌డ్యూస్ చేసింది. అప్ప‌టి నుంచి కొన్ని కోట్ల మంది యూజ‌ర్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. వాట్సాప్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 120 కోట్ల మంది యాక్టివ్ యూజ‌ర్లున్నారు. ఇందులో ఆరో వంతు మంది అంటే 20 కోట్ల మంది ఇండియ‌న్సే. వాట్సాప్ వీడియో కాలింగ్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న యూజ‌ర్లు రోజూ 34 కోట్ల నిముషాలు వాడుతున్న‌ట్లు సంస్థ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. దీనిలో 5 కోట్ల నిముషాలు మ‌న‌వాళ్లే వాడేస్తున్నార‌ని తేల్చింది. అంతేకాదు వ‌ర‌ల్డ్ వైడ్‌గా వాట్సాప్ వీడియో కాలింగ్‌ను అత్య‌ధికంగా వినియోగించుకుంటున్న‌ది భార‌తీయులేన‌ని ప్ర‌క‌టించింది.
లేట్‌గా వ‌చ్చినా లేటెస్ట్‌గా..
మిగ‌తా కాంపిటీట‌ర్స్ కంటే వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచ‌ర్‌ను లేట్‌గానే ప్రారంభించింది. అయితే 120 కోట్ల మంది యూజ‌ర్ల అండ ఉండ‌డంతో ఆరు నెల‌ల్లోనే టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది. ఇక ఇండియాలో ఇంత హిట్ట‌వ‌డానికి కార‌ణం జియో రావ‌డం వ‌ల్ల‌నే అని చెప్పాలి. జియో ఆరు నెల‌లు ఫ్రీ డేటా ఇవ్వ‌డంతో చాలామంది వాట్సాప్ వీడియో కాలింగ్‌కు బాగా అల‌వాటుప‌డ్డారు. ఇప్పుడు మిగిలిన కంపెనీలు కూడా డేటా రేట్లు త‌గ్గించ‌డంతో ఎక్కువ మంది దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్‌గా వాట్సాప్.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల కోసం డెడికేటింగ్ వీడియో కాలింగ్ బ‌ట‌న్‌ను తీసుకురావ‌డంతో యూజ‌ర్లు దీన్ని మ‌రింత సులువుగా వాడ‌గలుగుతున్నారు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు