• తాజా వార్తలు
  •  

వాట్సప్ ఫర్ బిజినెస్.. ప్ర‌స్తుత ఎస్ఎంఎస్ విధానాన్ని ఎలా మారుస్తుందో తెలుసా!

ఒక‌ప్పుడు ఫోన్ ద్వారా క‌మ్యునికేష‌న్ చేయాలంటే కాల్ కాకుండా మెసేజ్ మాత్ర‌మే ఆప్ష‌న్‌గా ఉండేది. ఏళ్ల పాటు ఈ మెసేజింగ్ ఆప్ష‌న్‌ను చాలా గొప్ప‌గా వాడుకున్నారు వినియోగ‌దారులు. చాలా విష‌యాల‌కు కాల్ చేయ‌కుండా మెసేజ్‌లు చేసే విధానం బాగా అల‌వాటైపోయింది. అయితే ఎప్పుడైతే స్మార్ట్‌ఫోన్ విప్ల‌వం మొద‌లైందో అప్పుడో ఎస్ఎంఎస్‌ల జోరుకు అడ్డుక‌ట్ట ప‌డింది. వాట్స‌ప్‌, హైక్ లాంటి మెసెంజ‌ర్ యాప్‌లు వ‌చ్చేయ‌డంతో జ‌నం అంతా అటువైపు షిప్ట్ అయిపోయారు. మామూలు మెసేజ్‌లు చేసే వారి సంఖ్య అరుదైపోయింది. ఏదైనా అవ‌స‌ర‌మైతే త‌ప్ప మెసేజ్‌ల జోలికి ఎవరూ వెళ్ల‌ట్లేదు. ముఖ్యంగా వాట్స‌ప్‌కు అంతా ఎడిక్ట్ అయిపోయారు. ఈ నేప‌థ్యంలో ఈ మెసేజింగ్ సంస్థ వాట్స‌ప్ ఫ‌ర్ బిజినెస్ అనే కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఏంటి వాట్స‌ప్ ఫ‌ర్ బిజినెస్‌
సాధార‌ణంగా ట్విట‌ర్‌, ఫేస్‌బుక్‌ల‌లో అఫీషియ‌ల్ అకౌంట్ల‌కు మాత్ర‌మే గుర్తింపునిస్తూ బ్లూ మార్క్ ఐకాన్ ఉంటుంది. దీని వ‌ల్ల యూజ‌ర్లు సెల‌బ్రెటీల అకౌంట్ల‌ను చూడ‌టానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.  అలాగే వాట్స‌ప్‌ను బిజినెస్ సంస్థ‌ల‌తో మ‌మేకం చేయ‌డానికి ఆ సంస్థ సంక‌ల్పించుకుంది. అంటే ఒక మెసేజింగ్ యాప్‌లా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు బుక్ మై షోలో టిక్కెట్ బుక్ చేసుకుంటే మెసేజ్ వ‌స్తుంది. ఇప్పుడు వాట్స‌ప్ ఆ మెసేజ్‌ను మీకు అందిస్తుంది. అంటే సాధార‌ణ మెసేజ్‌లాగే ఇది కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకోసం పెద్ద బిజినెస్ సంస్థ‌ల‌తో వాట్స‌ప్ ఒప్పందం చేసుకుంటుంది. అధికారిక బిజినెస్ సంస్థ‌ల‌కు గ్రీన్ టిక్ ఇస్తుంది. 

ట్రెడిషిన‌ల్ మెసేంజ‌ర్‌ను రిప్లేస్ చేస్తుందా?
ఐదేళ్ల క్రితం వ‌ర‌కు మెసేంజ‌ర్‌తోనే అంద‌రికి ప‌ని. కానీ ఇప్పుడు దాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో వాట్స‌ప్ కొత్త ఫీచ‌ర్లు తేవ‌డం కూడా  ఆస‌క్తిని పెంచుతోంది. గ‌తేడాది 1.4 బిలియ‌న్ మెసేజ్‌లు వాట్సప్ ద్వారా వినియోగ‌దారులు పంచుకున్నార‌ని.. ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపింది. భార‌త్‌లో మాత్రం ట్రెడిషిన‌ల్ ఎస్ఎంఎస్‌ల‌కు ఇంకా స్థానం ఉంది. ఏం ప‌ర్చేజ్ చేసినా మొబైల్ నంబ‌ర్ అడుగుతారు.. ఓపీటీ అడుగుతారు... వీట‌న్నిటికి ఎంఎంఎస్ కావాలి. అయితే ఇప్పుడు వాట్స‌ప్ ఈ అవ‌స‌రాన్ని తీర్చే ప‌నిలో ఉంది. మ‌న‌కు మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చే మెసేజ్‌లు వాట్స‌ప్‌కు వ‌స్తాయి. అది కూడా గుర్తింపు పొందిన సంస్థ‌ల మెసేజ్‌లు మాత్ర‌మే వ‌స్తాయి. దీని వ‌ల్ల మ‌నం ఫేక్ మెసేజ్‌ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.  పేటీఎం కూడా ఈ ఏడాది చివ‌రికి ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న‌లో ఉంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు