• తాజా వార్తలు
  •  

వాట్స్ అప్ అల్ టైం టాప్ ట్రిక్స్ - పార్ట్ 1

ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ ల రాకతో ఒకప్పుడు మెసేజింగ్ రంగాన్ని ఏలిన టెక్స్ట్ మెసేజింగ్ దాదాపు కనుమరుగయ్యే స్థితి కి వచ్చింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్ లు మెజారిటీ శాతం మంది మెసేజింగ్ కు కోసం ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ లానే వాడుతున్నారనేది నిర్వివాదాంశం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ సర్వీస్ లు మెసేజింగ్ ను ఉచితంగా ఇవ్వడం కేవలం టెక్స్ట్ మాత్రమే గాక ఇంకా అనేక రకాల అదునాతన ఫీచర్ లు వీటిలో అందుబాటులో ఉండడం లాంటివి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ లలో వాట్స్ అప్ ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం 1 బిలియన్ మంది యూజర్ లను కలిగిఉండి, ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ను అందిస్తుంది. కర్ణాటక, తెలంగాణా మరియు బీహార్ లాంటి కొన్ని భారతీయ రాష్ట్రాలు ప్రజల దగ్గరనుండి ఫిర్యాదులను స్వీకరించడానికి ఈ వాట్స్ అప్ ను హాట్ లైన్ సర్వీస్ గా వాడుతున్నారంటే దీనియొక్క విస్తృతి ఏ విధంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ వాట్స్ అప్ ను ఇంతమంది వాడుతున్నప్పటికీ ఇందులో ఉండే ఫీచర్ లు ఏమిటి? దీనిని సమర్థవంతంగా ఎలా వాడుకోవాలి? ఇందులో దాగి ఉన్న ఫీచర్ లు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయం మనలో చాలా మందికి తెలియదు. అయితే అలంటి వారికోసమే ఆల్ టైం వాట్స్ అప్ ట్రిక్ లను రెండు భాగాలుగా మన కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల ముందుకు తీసుకువస్తుంది. ఇందులో మొదటి భాగం ఈ రోజు .
కొంతమందిని నేను ఇగ్నోర్ చేస్తున్నాను, నేను వారి మెసేజ్ లను చదివినప్పటికీ దానిని దాచి ఉంచడం ఎలా?
మనం కొన్ని సార్లు కొంత మంది మెసేజ్ లను చూడడానికి అంతగా ఇష్టపడము, వారిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము, అయితే ఒకవేళ మనం వారి మెసేజ్ లను చదివితే రెండు బ్లూ టిక్ ల ద్వారా మనం చదివినట్లు వారికి తెలిసిపోతుంది. అది కూడా వారికీ తెలియకూడదు అనుకుంటే ఒక ట్రిక్ పాటిస్తే తెలిపిపోతుంది. సెట్టింగ్స్ >ఎకౌంటు> ప్రైవసీ > రీడ్ రిసిప్ట్స్ ద్వారా మీరు ఈ పని చేయవచ్చు. నేను ఇది కూడా చేయను అంటారా ఇంకొక ట్రిక్ ఉంది.
మీరు మీ వాట్స్ అప్ ను ఓపెన్ చేసే ముందు మీ హ్యాండ్ సెట్ ను ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచి ఇప్పుడు చాట్ ఓపెన్ చేసి మెసేజ్ లను చూడవచ్చు. తద్వారా మీరు చదివనట్లు వారికి తెలియదు. ఇక ఆ తర్వాత మళ్ళీ దానిని ఓపెన్ చేయకూడదు, చేస్తే బ్లూ టిక్స్ వస్తాయి.
మీ లాస్ట్ సీన్ స్టేటస్ ను దాచి ఉంచడం ఎలా?
చాలా కాలం క్రితం వాయస్ అప్ ను ఓపెన్ చేసిఉంటారు. మీ స్టేటస్ లో సమయం చూపిస్తుంటే కొంతమంది గిల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు . ఇక పై అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ట్రిక్ పాటించండి చాలు. సెట్టింగ్స్ లోనికి వెళ్లి ఆప్షన్స్ మెనూ పై ట్యాప్ చేయాలి. ఒక లిస్టు ఓపెన్ అవుతుంది.ఎకౌంటు పై ట్యాప్ చేయాలి. కొత్త విండో లో ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో ఉండే మొదటి ఆప్షన్ లాస్ట్ సీన్ దానిపై ట్యాప్ చేస్తే ఒక పాప్ అప్ మెనూ ఓపెన్ అవుతుంది. అక్కడ నో బడీ అనే దానిని సెలెక్ట్ చేస్తే చాలు, మీ స్టేటస్ ను దాచివేసినట్లే.
డిలీట్ చేసిన మెసేజ్ ను రీ స్టోర్ చేసుకోవడం ఎలా
సెట్టింగ్ లలో కి వెళ్లి ఆప్షన్ మెనూ పై ట్యాప్ చేయాలి. చాట్ ఆప్షన్ లోనిక్ వెళ్ళాలి., ఇక్కడ మీకు చాట్ బ్యాక్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేస్తే మీకు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. దానిపై ఒక సారి ప్రెస్ చేస్తే మీ రీసెంట్ మెసేజ్ లన్నింటినీ మీ డివైస్ బ్యాక్ అప్ తీస్తుంది.ఇది గూగుల్ ఎకౌంటు కి కనెక్ట్ అయ్యి మీ మెసేజ్ లను గూగుల్ డ్రైవ్ కి స్టోర్ చేస్తుంది., మీరు మీ బ్యాక్ అప్ ను డైలీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు.
చూశారు కదా! మరిన్ని అధ్బుతమైన ట్రిక్ లను రేపటి ఆర్టికల్ లో చదువుకుందాం

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు