• తాజా వార్తలు
  •  

మ‌నం త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన ఆరు చాట్‌బోట్ స‌క్సెస్ స్టోరీలు

సాంకేతిక ప‌రిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంత‌లు తొక్కుతోంది.  దీనిలో భాగంగా  చాట్‌బోట్‌లు రంగ‌ప్ర‌వేశం చేశాయి.  మ‌నుషుల‌కు బ‌దులు బోట్స్ వాడ‌కం ముఖ్యంగా సోష‌ల్ వెబ్‌సైట్ల‌లో బాగా పెరుగుతోంది. 2016లో చాట్‌బోట్లు వీటిలో ప్ర‌వేశించాయి. ఈ ఏడాది వాటి వినియోగం భారీగా పెరిగింది. 2020 నాటికి దాదాపు 80% బిజినెస్ ఆర్గ‌నైజేష‌న్లు చాట్‌బోట్ల‌ను వినియోగించుకుంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాంటి చాట్‌బోట్ల స‌క్సెస్ స్టోరీలు ఇవిగో..
ఫేస్‌బుక్ ఎం 
ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ వాడేవారందరికీ ఇంచుమించుగా దీని గురించి తెలిసే ఉంటుంది. మీరు మెసెంజ‌ర్లో టెక్స్ట్ బాక్స్ఓపెన్ చేయ‌గానే  చిన్న M లోగో క‌నిపిస్తుంది. అదే చాట్‌బోట్‌.  Facebook Mకి దాదాపు 12 ల‌క్ష‌ల మంది యూజర్లున్నారు. మీరు క‌న్వ‌ర్సేష‌న్ స్టార్ట్ చేయ‌గానే ఈ చాట్‌బోట్ మీకు స‌జెష‌న్స్ చూపిస్తుంది. మీరు హ‌లో అని టైప్ చేయ‌గానే చాట్‌బోట్ మీకు కొన్ని స్టిక్క‌ర్లు లేదా జిఫ్ ఇమేజ్‌లు చూపిస్తుంది.  వీటిని అవ‌త‌లి వ్య‌క్తికి సెండ్ చేయొచ్చు. మీరు వెకేష‌న్ ప్లాన్ గురించి చాట్ చేస్తుంటే ర‌క‌ర‌కాల టూరిస్ట్ స్పాట్స్‌, వాటి ప‌రిస‌రాల్లోని హోట‌ల్స్ గురించి చూపిస్తుంది. వీటిని చాట్‌బోట్ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు. క్యాబ్‌ను కూడా దీని నుంచి బుక్ చేయవ‌చ్చు.
నికీ 
ఇది   ఫేస్‌బుక్ గ్లోబ‌ల్ మెసెంజ‌ర్ యూజ‌ర్ల‌కు హెల్ప్ చేసే చాట్‌బోట్ . ఇది మీకు ఓ వ‌ర్చ్యువ‌ల్ ఫ్రెండ్‌లా ప‌ని చేస్తుంది. క్యాబ్స్‌, హోట‌ల్ రూమ్స్‌, మూవీ టికెట్స్ బుక్ చేయ‌డానికి, బిల్స్ పే చేయ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. దీంతో ఫుడ్ ఆర్డ‌ర్ చేయొచ్చు.  షాపింగ్ కూడా చేయొచ్చు. అంటే వీటన్నింటికి మ‌ల్టిపుల్ యాప్స్ బుక్ చేయ‌కుండా  Niki ఉంటే ఈ ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టుకోవ‌చ్చు. 75వేల మంది యూజ‌ర్లున్న ఈ చాట్‌బోట్ మంత్లీ 30వేల యాక్టివ్ విజిట్స్‌ను రికార్డ్ చేస్తోంది.  
హెట్స‌న్ 
స్కైప్‌లో ఫుడ్ ఇన్‌స్పైర్డ్ చాట్‌బోట్ హెట్స‌న్‌.  ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌తోపాటు విండోస్‌, మ్యాక్ వంటి వెబ్‌ఫ్లాట్‌ఫామ్స్‌ల్లో కూడా అందుబాటులో ఉంది.  మైక్రోసాఫ్ట్‌,  చెఫ్ హెట్స‌న్ బ్లూ మెంథాల్ క‌లిసి దీన్ని రూపొంఇంచారు.  ఫుడ్‌కు సంబంధించిన ఎలాంటి క్వ‌శ్చ‌నయినా ఈ చాట్‌బోట్ ఆన్స‌ర్ ఇస్తుంది. కుకింగ్ టిప్స్‌, కొత్త వంట‌లు, మెనూ స‌జెష‌న్స్‌, ఫ్లేవ‌ర్ పెయింరింగ్స్ వంటివ‌న్నీ హెట్స‌న్ చాట్‌బోట్ ద్వారా పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి ఫుడ్ ల‌వ‌ర్స్‌, కుక్‌ల ఫేవ‌రెట్ చాట్‌బోట్‌గా హెట్స‌న్ మారింది.  
సెఫోరా 
కాస్మోటిక్ ప్రొడ‌క్ట్స్ త‌యారీలో పెద్ద కంపెనీ సెఫోరా కిక్‌లో లాంచ్ చేసిన చాట్‌బోట్ సెఫోరా. అలంక‌ర‌ణ‌కు సంబంధించిన స‌జెష‌న్లు ఇవ్వ‌డం, కాస్మోటిక్ ప్రొడ‌క్ట్స్ గురించి ఇన్ఫ‌ర్మేష‌న్‌తో బ్యూటీ అంటే  ఇష్ట‌ప‌డేవారికి బాగా ద‌గ్గ‌రైంది.  దీని యూజ‌ర్లు యావరేజిన రోజుకు 10 మెసేజ్‌లు రిసీవ్ చేసుకుంటున్నారు.  Sephora Virtual Artist అని ఫేస్‌బుక్‌లో మ‌రో చాట్ బోట్ ఉంది. మీరు సెల్ఫీ తీసి దీనిలో అప్‌లోడ్ చేస్తే  డిఫ‌రెంట్ లిప్ క‌ల‌ర్స్‌తో ఎక్స్‌పెరిమెంట్స్ చేసి మీకు చూపిస్తుంది. దీని మొబైల్ యాప్‌కు ఇప్ప‌టివ‌ర‌కు 40 ల‌క్షల విజిట్స్ వ‌చ్చాయ‌ని కంపెనీ చెబుతోంది.  
డోమ ద పిజ్జా 
రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు కూడా చాట్‌బోట్స్‌ను యూజ్ చేస్తున్నాయ‌న‌డానికి ఉదాహ‌ర‌ణ ఇది. డోమినోస్  Dom The Pizza పేరుతో 2016లో చాట్‌బోట్‌ను తీసుకొచ్చింది.  మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోన‌క్క‌ర్లేకుండా ఈ చాట్‌బోట్‌ల  పిజా ఎమోజీని క్లిక్ చేస్తే చాలు మీ పేరు అడ్ర‌స్‌, ఆర్డ‌ర్ క‌న్ఫ‌ర్మేష‌న్ తీసుకుని పిజాను మీ ఇంటికి డెలివ‌ర్ చేస్తంది. 
ఇన్‌స్టాలొకేట్
ఇన్‌స్టాలొకేట్ అనేది  ప‌ర్స‌న‌ల్ ట్రావెల్ అసిస్టెంట్‌లా  పని చేసే చాట్‌బోట్‌. ఫ్లైట్ ట్రాకింగ్ చాట్‌బోట్స్‌లో ఇది చాలా పాపుల‌ర్‌. ఫ్లైట్స్ స్టేట‌స్‌, లొకేష‌న్‌, ఎక్స్‌పెక్టెడ్ డిలే, ల్యాండింగ్ టైం లాంటి స‌మ‌స్త స‌మాచారాన్ని యూజ‌ర్‌కు చేరవేస్తుందీ చాట్‌బోట్‌.  ఫ్లైట్  ఎబ్‌నార్మ‌ల్ డిలే అయితే ఎయిర్‌లైన్స్ నుంచి కాంపెన్సేష‌న్ డిమాండ్ చేయ‌మ‌ని కూడా మ‌న‌ల్ని అల‌ర్ట్ చేస్తుంది.  

జన రంజకమైన వార్తలు