• తాజా వార్తలు

ఇన్ బిల్ట్ భీమ్ యాప్ తో రూ.5,290కే కార్బ‌న్ కే9 క‌వ‌చ్

ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కార్బ‌న్ మ‌రో ఎంట్రీ లెవ‌ల్ ఫోన్ తో మార్కెట్లోకి వ‌చ్చింది. పేరుకు ఇది ఎంట్రీ లెవ‌ల్ ఫోన్ అయినా ఇందులో ఫీచ‌ర్లు మాత్రం బాగున్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా 4జీతో పాటు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ను కూడా  క ఏవ‌లం రూ.5,290 ధ‌ర‌కే అందిస్తుండ‌డంతో దీనిపై అంద‌రిలోనూ ఆస‌క్తి ఏర్పడుతోంది. 
కె9 కవచ్ 4జీ పేరిట కార్బన్ తీసుకొస్తున్న ఈ మొబైల్ లో భీమ్ యాప్ ఇన్ బిల్ట్ గా ఉండ‌డం మ‌రో విశేషం.


డిజిట‌ల్ ఇండియా క‌ల‌లు నెర‌వేర్చ‌డానికేనా...
ముఖ్యంగా ఈ యాప్ మోడీ క‌ల‌లు క‌న్న డిజిట‌ల్ ఇండియా క‌ల‌లు నెర‌వేర్చ‌డానికా అన్న‌ట్లుగా ఉంది. డిజిట‌ల్ ఇండియాలో భాగమైన డిజిట‌ల్ ట్రాంజాక్ష‌న్ల‌కు వీలుగా ఇందులో చాలా ఆప్ష‌న్లున్నాయి. భీమ్ యాప్ తో పాటుఈ-కేవైసీ , ఆధార్ అథెంటిఫికేష‌న్, డిజి లాక‌ర్ వంటివ‌న‌వ్నీ ఉన్నాయి. అంతేకాదు.. ప‌లు ఈ-గ‌వ‌ర్నెన్స్ స‌ర్వీసుల‌కు కూడా దీన్నుంచి యాక్సెస్ ఉంటుంది. వారం రోజుల్లో ఇది ఆఫ్ లైన్ స్టోర్ల‌లో అందుబాటులోకి రానుంది.


కార్బన్ కె9 కవచ్ 4జీ స్పెసిఫికేష‌న్లు

* 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.

జన రంజకమైన వార్తలు