• తాజా వార్తలు
  •  

ఫిబ్రబరి నెలలో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్ లు మీకోసం

2018 సంవత్సర ఆరంభం తో పాటే జనవరి నెలలో అనేక రకాల స్మార్ట్ ఫోన్ లు కూడా లాంచ్ అవడం జరిగింది. ఆయా ఫోన్ ల గురించి మన వెబ్ సైట్ లో సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి నెలలో మరిన్ని అధునాతన స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోనికి విడుదల కానున్నాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కూడా ఇదే నెలలో జరగనున్న నేపథ్యం లో ఈ నెలలో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్ ల పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో ఏ ఏ ఫోన్ లు ప్రముఖంగా లాంచ్ అవనున్నాయో మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం.

సామ్సంగ్ గాలక్సీ S9 & S9 ప్లస్             

సామ్సంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేసింది. సామ్సంగ్ తన గాలక్సీ S9 సిరీస్ ను ఇక్కడ లాంచ్ చేయనుంది. ఇది తన ముందు వెర్షన్ అయిన గాలక్సీ S8 కంటే ఎంతో అప్ గ్రేడ్ చేయబడి ఉంటుంది. కానీ ఫ్రంట్ డిజైన్ లో మాత్రం స్వల్పం గానే మార్పులు ఉండనున్నాయి. ఇది 18:9 వైడ్ స్క్రీన్ డిస్ప్లే, లేటెస్ట్ చిప్ సెట్  మరియు ఇంప్రూవ్డ్ కెమెరా లతో రానుంది.

షియోమీ రెడ్ మీ నోట్ 5

షియోమీ రెడ్ మీ 5 ప్లస్ ను రెడ్ మీ నోట్ 5 గా ఇండియా లో లాంచ్ చేయనుంది. ఇండియా లో ఇది లాంచ్ చేయనున్న ఫోన్ ల గురించి ఇంతవరకూ చెప్పనప్పటికీ వచ్చే నెలలో ఖచ్చితంగా కొన్ని లాంచ్ లు ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఇప్పటికే చైనా లో రెడ్ మీ 5 ప్లస్ ను లాంచ్ చేసింది. ఇక నోట్ 5 మాత్రమే మిగిలి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం  ఇండియా లో లాంచ్ అవనున్న రెడ్ మీ నోట్ 5 లో 5.99 ఇంచ్ ఫుల్ HD+ 18:9  డిస్ప్లే , 12 MP రేర్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 625 లు ఉండనున్నాయి. ఇది 3 GB RAM ,32 GB మెమరీ అలాగే 4 GB RAM 64 GB మెమరీ ఇలా రెండు వేరియంట్ లలో లభించనుంది. రెండింటి లోనూ 4000mAh బ్యాటరీ ఉండనుంది.

మోటో ఎక్స్ 4 ( 6 GB )    

మోటోరోలా తన సరికొత్త ఫోన్ అయిన మోటో ఎక్స్ 4 ను ఈ నెలలో లాంచ్ చేయనుంది. ఇది 6 GB RAM, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం తో రానుంది. దీని ధర సుమారుగా రూ 25,000/- ల వరకూ ఉండవచ్చు. ఇది గత నవంబర్ నెలలోనే లాంచ్ అయినప్పటికీ అది 5.2 HD డిస్ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 630 చిప్ సెట్ మరియు 3000 mAh బ్యాటరీ తో ఉన్నది. అయితే ఇప్పుడు వచ్చే ఫోన్ లో మాత్రం అంతకంటే అప్ డేట్ అయిన ఫీచర్ లు ఉండనున్నాయి. ముఖ్యంగా ప్రాసెసర్ విషయం లో 630 Soc ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.

మోటో G6 సిరీస్

మోటోరోలా యొక్క జి సిరీస్ ఫోన్ లు విజయవంతం అవడం తో అదే ఉత్సాహం తో ప్రీమియం డిజైన్, ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్ లతో కూడిన మధ్య తరగతి ఫోన్ లను మరిన్నింటిని విడుదల చేసే ఉద్దేశం లో ఉన్నది. మనకు ఉన్న సమాచారం ప్రకారం మోటో జి 6 లో మెటల్ డిజైన్ ,18:9 వైడ్ స్క్రీన్ డిస్ప్లే మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఉండనున్నాయి.వేగవంతమైన ప్రాసెసర్, బెటర్ కెమెరా ను కూడా మనం ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ జి 6 సిరీస్ ఫోన్ ల లాంచ్  కు సంబందించిన  ప్రకటన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది మార్చి నెలాఖరు లో మార్కెట్ లోనికి రావచ్చు.

హువాయి P11      

హువాయి కూడా తన తర్వాతి ఫ్లాగ్ షిప్ మొబైల్ ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో లాంచ్ చేయనుంది. ఇది తన ప్రస్తుత ఫ్లాగ్ షిప్ మొబైల్ అయిన P10 యొక్క తర్వాతి వెర్షన్ గా చెప్పుకోవచ్చు. దీనిధర ఇండియా లో రూ 42,000/- ల నుండీ రూ 45,000/- ల వరకూ ఉండవచ్చు.ఇది 10 nm కిరిన్ 970 చిప్ సెట్ తో రానుంది. దీని ముందు మోడల్ తో పోలిస్తే ఇది CPU పెర్ఫార్మన్స్ లో 25 రెట్లు, ఎనర్జీ సామర్థ్యం లో 50 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది 6 ఇంచ్ 18:9 వైడ్ స్క్రీన్ డిస్ప్లే, మూడు కెమెరా లతో లభిస్తుంది. ఇక్కడే హువాయి తన P11, P11 ప్లస్ మరియు P20 ల ను కూడా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

సోనీ ఎక్స్ పీరియా XZ1 ప్రీమియం

సోనీ యొక్క ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయిన ఎక్స్ పీరియా XZ1 ప్రీమియం స్మార్ట్ ఫోన్ కూడా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లోనే లాంచ్ అవనుంది. ఇక్కడే XZ1S కూడా లాంచ్ అవ్వవచ్చు. ఇది 4K డిస్ప్లే, 18:9 వైడ్ స్క్రీన్ డిజైన్ లో ఉండనుంది. 4 GB RAM, 64GB మెమరీ మరియు 6 GB RAM, 128 GB మెమరీ ఇలా రెండు వేరియంట్ లలో ఇది లభించనుంది.

నోకియా 9

ఒకప్పటి మొబైల్ రారాజు అయిన నోకియా అందరూ ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ ను ఈ సంవత్సరం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే నోకియా 9. ఇది 13 MP రేర్ కెమెరా లు, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ను కలిగి ఉండనుంది. 5.5 OLED 18:9 వైడ్ స్క్రీన్ బెజెల్ లెస్ డిస్ప్లే ను కలిగి ఉండి స్నాప్ డ్రాగన్ 835 తో రన్ చేయబడుతూ 3250 mAh బ్యాటరీ ని కలిగి ఉండనుంది. ఇక్కడే నోకియా తన నోకియా 1, నోకియా 6 మరియు నోకియా 7 ప్లస్ లను కూడా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

 

జన రంజకమైన వార్తలు