• తాజా వార్తలు
  •  

2017 లో వచ్చిన స్లిమ్మెస్ట్ ల్యాప్ ట్యాప్ లు, కన్వర్టబుల్స్ లో బెస్ట్ మీకోసం

చాలామంది ప్రొఫెషనల్ లకు పెద్ద సైజు లో ఉండే లాప్ ట్యాప్ లను వాడాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానిని వాడడంలోనూ ఎక్కడికైనా క్యారీ చేయడం లోనూ కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. స్లిమ్ ల్యాప్ ట్యాప్ కానీ లేదా కన్వర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ గానీ అయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా మామూలు ల్యాప్ ట్యాప్ ల కంటే స్లిమ్ ల్యాప్ ట్యాప్ లే ఉత్తమమైనవి. ఇక ఈ సంవత్సరం చూసుకుంటే ఇప్పటివరకూ మనం ఇంటెల్ యొక్క 8 వ జనరేషన్ కేబీ లేక్ చిప్ సెట్ లనూ మరియు అనేక రకాల స్లిమ్మర్ మరియు కన్వర్టబుల్ PC లనూ చూసియున్నాము. వాటిలో అత్యుత్తమమైన వాటి వివరాలను ఈ ఆర్టికల్ లో మీ కోసం అందిస్తున్నాం.

ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో 13

ఇప్పటివరకూ లైట్ వెయిట్ మ్యాక్ బుక్ లకూ మరియు మ్యాక్ బుక్ ప్రో సిరీస్ లకూ ఉన్న తేడాను ఈ ప్రో నోట్ బుక్ ల ద్వారా తగ్గించే ప్రయత్నం ఆపిల్ చేసింది. ఇది దీనిముందు వెర్షన్ కంటే 23% సన్నగానూ 1.37 kg బరువు తోనూ ఉంటుంది. దీనిని మరింత యూజర్ ఫ్రెండ్లీ గాచేసేందుకు ఆపిల్ దీనికి షార్ట్ కట్ లతో కూడిన టచ్ బార్ ఫీచర్ ను యాడ్ చేసింది. ట్రాక్ ప్యాడ్ సైజు ను సుమారు 46% వరకూ పెంచింది. అల్యూమినియం బాడీ మరియు గ్రే కలర్ లలో ఇది ప్రీమియం లుక్  లో కనిపిస్తుంది.13.3 ఇంచ్ రెటినా డిస్ప్లే, 7 వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 GB RAM మరియు 256 GB SSD లు దీని విశిష్టతలు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఇది 12 గంటల వరకూ వస్తుంది. దీని ధర రూ 1,55,990 /-

HP స్పెక్ట్రా x 360

దీనిధర రూ 1,57,590/- లు ఉంటుంది.అల్ట్రా థిన్ నోట్ బుక్ కన్వర్టబుల్స్ విభాగం లో ఇది ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు.అల్యూమినియం బాడీ తో ఇది కూడా ప్రీమియం లుక్ లో కనిపిస్తుంది. 13.3 ఇంచ్ డిస్ప్లే మరియు 1.3kg బరువును కలిగిఉంటుంది. ఇది చాలా ఫ్లెక్సిబుల్ డిజైన్ ను కలిగిఉంటుంది. ఇది యాక్టివ్ పెన్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఇంటెల్ కోర్ i 7 -7500 U ప్రాసెసర్ తో రన్ అవుతూ 16 GB RAM మరియు 512 GB SSD ని కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ తో ఆరుగంటల వరకూ పనిచేస్తుంది.

డెల్ XPS 13

దీనిధర రూ 84,590/- లు ఉంటుంది. దీనుముందు వెర్షన్ లో పెద్ద సైజు లో ఉండే బెజల్ లు ఉండేవి. అయితే ఇందులో కేవలం 5.2 మందం తో ఉండే బెజల్ లు ఉండడం వలన ఇది 13.3 ఇంచ్ స్క్రీను ఎడ్జ్ టు ఎడ్జ్ ఫీల్ ను అందిస్తుంది. ఇంత తక్కువ సైజు లో ఉండే బెజల్స్ ఉండడం వలన ఇది చాలా చిన్నగా కనపడుతూ ఉంటుంది.. దీనిబరువు 1.2 kg మాత్రమే ఉంటుంది.ఇంటెల్ 8 వ జనరేషన్ కోర్ ఐ5 ప్రాసెసర్ పై రన్ అవుతూ 8 GB RAM మరియు 256 SSD గొరిల్లా గ్లాస్  తో కూడిన డిస్ప్లే ను కలిగిఉంటుంది.

ఆసుస్ వివో బుక్ S15

దీని ధర రూ 79,990/- లు ఉంటుంది. ఇది బిగ్ స్క్రీన్ నోట్ బుక్స్ లకు చెందినదైనా చూడడానికి అల్ట్రా బుక్ లా కనిపిస్తుంది. 15.6 ఇంచ్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బిగ్ స్క్రీన్ నోట్ బుక్ లో అత్యంత స్లిమ్ గా ఉండే నోట్ బుక్ ఇది. ఇది కూడా అల్యూమినియం బాడీ తో ప్రీమియం లుక్ ను కలిగిఉంటుంది. ఇంటెల్ 8 వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో రన్ అవుతూ 16 GB RAM, 18 GBSSD, Nvidia GeForce MX150 గ్రాఫిక్స్ ను కలిగిఉంటుంది.

ఏసర్ స్విఫ్ట్ 3 SF 314 – 51

స్టాండర్డ్ స్క్రీన్ సైజు మరియు పవర్ ఫుల్ విండోస్ 10 నోట్ బుక్స్ తో ఉంటూ రూ 80,000/- లకంటే తక్కువ ధర లో ఉండే నోట్ బుక్స్ ల కోసం చూసే వారికి ఇది ఒక చక్కని ఎంపిక కాగలదు.  ఇంటెల్ 7 వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో రన్ అవుతూ 8 GB RAM మరియు 256GB SSD ని కలిగి ఉంటుంది.ఒక్కసారి ఛార్జింగ్ తో 8 గంటల నుండీ 10 గంటల వరకూ పని చేస్తుంది. దీని ధర రూ 75,990/- లవరకూ ఉంటుంది.

 

 

జన రంజకమైన వార్తలు