• తాజా వార్తలు
  •  

బడ్జెట్ ఫోన్ లలో రానున్న 9 హై ఎండ్ ఫీచర్ లు

ఇంతకాలం హై ఎండ్ స్మార్ట్ ఫోన్ లకే పరిమితం అయిన హై క్వాలిటీ కెమెరా లు, పవర్ ఫుల్ బ్యాటరీ లు మరియు ప్రాసెసర్ లు లాంటి మరెన్నో అద్భుతమైన హై ఎండ్ ఫీచర్ లు ఇకపై బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లలో కూడా లభించనున్నాయి. ఇప్పటికే అమ్మకాల విషయం లో మంచి స్వింగ్ లో ఉన్న ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లు ఈ ఫెచార్ ల చేరికతో మరింత వృద్ది చెందగల అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఆ ఫీచర్ లు ఏమిటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

18:9 రేషియో         

ఇప్పటివరకూ బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లంటే 16:9 రేషియో ఉండే డిస్ప్లే లో లభించేవి. అయితే ఇకపై ఇవి కూడా హై ఎండ్ ఫీచర్ అయిన 18:9 రేషియో లో లభించనున్నాయి. ఈ ఫీచర్ ను మొట్టమొదటగా LG తన LG G6 స్మార్ట్ ఫోన్ తో పరిచయం చేయగా ప్రస్తుతం దాదాపుగా అన్ని ఫోన్ లూ ఇదే బాటలో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ లు అయిన ఆనర్, షియోమీ, వివో ఇలా అన్ని కంపెనీలూ తమ రూ 20,000/- ల లోపు ఉండే ఫోన్ లలో ఈ ఫీచర్ ను యాడ్ చేసాయి.

పవర్ ఫుల్ ప్రాసెసర్ లు

ఇప్పటివరకూ ప్రాసెసర్ అంటే స్నాప్ డ్రాగన్ 835 గా మాత్రమే చెప్పుకునే వాళ్ళం. అయితే గత డిసెంబర్ లో క్వాల్ కాం తన స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ ను అనౌన్స్ చేసాక ప్రముఖ బ్రాండ్ లన్నీ తమ బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లలో కూడా ఈ పవర్ ఫుల్ ప్రాసెసర్ నే ఉపయోగించడo మొదలు పెట్టాయి. రూ 30,000/- లోపు ఉండే స్మార్ట్ ఫోన్ లలో ఈ పవర్ ఫుల్ ప్రాసెసర్ లు ఉండనున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్

ఇంతవరకూ హై ఎండ్ ఫోన్ లకే పరిమితం అయిన ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ ఇకపై బడ్జెట్ ఫోన్ లలో కూడా లభించనుంది. ఆనర్ ఇప్పటికే తన AI పవర్డ్ స్మార్ట్ ఫోన్ అయిన వ్యూ 10 ను లాంచ్ చేసింది. 2022 వ సంవత్సరానికల్లా 80 శాతం స్మార్ట్ ఫోన్ లు AI సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నాయని ఒక సర్వే చెబుతుంది. ప్రస్తుతం  ఇది 10 శాతం గా ఉండగా ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ ఓరియో

ఈ సంవత్సరం లాంచ్ అవనున్న ఆండ్రాయిడ్ ఫోన్ లు అన్నీ లేటెస్ట్ వెర్షన్ అయిన ఓరియో తో రానున్నాయి.  సోనీ ఎక్స్ పీరియా , ఆనర్ వ్యూ 10, నోకియా మరియు వన్ ప్లస్ లాంటి డివైస్ లు ఇప్పటికే ఓరియో ఆపరేటింగ్ సిస్టం తో లభించనున్నాయి.

ఫేస్ రికగ్నిషన్

2013 లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ప్రవేశపెట్టిన ఆపిల్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ లో కూడా ముందుంది. ప్రస్తుతం లభిస్తున్న స్మార్ట్ ఫోన్ ఫీచర్ లలో ఈ ఫేస్ రికగ్నిషన్ కూడా ఒకటి కావడం అందరికీ తెలిసిందే.ఇన్ఫినిక్స్ మరియు ఒప్పో లు ఇప్పటికే తమ బడ్జెట్ ఫోన్ లలో దీనిని ప్రవేశపెట్టగా వన్ ప్లస్ లాంటి బ్రాండ్ లు ఈ దిశగా ఇప్పటికే అడుగులు ప్రారంభించాయి. అతి త్వరలోనే రూ 20,000/- లలోపు ఉండే ఫోన్ లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్థానాన్ని ఫేస్ రికగ్నిషన్ పూర్తిగా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత స్మార్ట్ గా తయారు అవనున్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ లు

పేస్ రికగ్నిషన్ ఫీచర్ వచ్చాక ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవుట్ డేటెడ్ అవుతుంది కదా అనే వాదన కూడా ఉంది. అయితే దేని అభిమానులు దానికి ఉంటారు కదా! అందుకే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లు కూడా మరింత స్మార్ట్ గా మారనున్నాయి. వివో ఇప్పటికే అండర్ ది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను గురించి అనౌన్స్ చేసింది. 2018 లో సామ్సంగ్ ఫ్లాగ్ షిప్ మొబైల్ లు కూడా ఇదే ఫీచర్ ను అనుసరించనున్నాయి.

డ్యూయల్ కెమెరా లు         

రేర్ మరియు ఫ్రంట్ కెమెరా లు రెండూ డ్యూయల్ కెమెరా లతో రానున్నాయి. అవును. ఇప్పటికే కొన్ని స్మార్ట్ ఫోన్ లు రేర్ డ్యూయల్ కెమెరా లతో వచ్చి ఉన్నాయి. అయితే ఫ్రంట్ కెమెరా లలో మాత్రం ఈ ఫీచర్ ఇంకా అన్ని ఫోన్ లలో అందుబాటులో లేదు. అయితే 2018 లో మాత్రం ఈ డ్యూయల్ కెమెరా ల హడావిడి బాగానే ఉండనుంది. అంటే ఈ సంవత్సరం వచ్చే దాదాపు అన్ని బడ్జెట్ ఫోన్ లు డ్యూయల్ కెమెరా లతో అలరించనున్నాయి.

పొడవుగా ఉండే హెడ్ ఫోన్ జాక్

హెడ్ ఫోన్ జాక్ యొక్క పొడవు కూడా పెరగనుంది. ఇప్పటికే వన్ ప్లస్, ఆనర్, మోటోరోలా లాంటి బ్రాండ్ లు 3.5 mm ఉండే హెడ్ ఫోన్ జాక్ లను అందిస్తుండగా మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. ప్రస్తుతం కొన్ని కంపెనీలు స్మార్ట్ ఫోన్ బాక్స్ లో ఇయర్ ఫోన్స్ ను ఇవ్వనప్పటికీ ఈ హెడ్ ఫోన్ లు ఈ సంవత్సరం ఒక ట్రెండ్ గా నిలవనున్నాయి.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు టైపు – C పోర్ట్

రూ 20,000/- లు పై ధరలో లభించే స్మార్ట్ ఫోన్ లలో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉండడం ఇప్పటికే మనం చూసియున్నాము. బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లలో బ్యాటరీ లైఫ్ తొందరగా అయిపోవడం, అలాగే ఎక్కువసేపు ఛార్జింగ్ అవుతున్న నేపథ్యం లో ఇవి కూడా క్విక్ ఛార్జింగ్ ఫీచర్ తో రానున్నాయి.

  

 

జన రంజకమైన వార్తలు