• తాజా వార్తలు
  •  

ఇప్పుడు కొత్త ఫోన్ లతో పాటు ఇవీ తప్పనిసరి అయిపోయాయి.

కొత్త స్మార్ట్ ఫోన్ కొనడం అనేది ఎవరికైనా ఉత్సుకత గానే ఉంటుంది. అయితే ఏదైనా కొత్త మొబైల్ ను కొనేటపుడు మనం అనేక రకాలుగా ఆలోచిస్తాము కదా! ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది? అది ఆండ్రాయిడ్ నా ? లేక ఆపిల్ నా ఆండ్రాయిడ్ అయితే ఏ వెర్షన్ తీసుకోవాలి? ఏ ఫోన్ కి బ్యాటరీ పిక్ అప్ ఎక్కువ ఉంటుంది? డేటా ఉపయోగానికి ఏది బాగుంటుంది? 4 జి సపోర్ట్ చేస్తుందా లేదా? ఇలా అనేక ప్రశ్నలు వేసుకుని అనేక రకాలుగా అలోచించి ఫోన్ కొంటాము కదా! అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేస్తున వినియోగదారులు వీటితో పాటు మరిన్ని విషయాలను కూడా దృష్టి లో పెట్టుకుని ఫోన్ లను కొనుగోలు చేస్తున్నారు.
ఈ నేపథ్యం లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లను కొనేటపుడు వినియోగదారులు తప్పనిసరిగా ఉండాలి అనుకుంటున్న వాటి గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.

అదనంగా ఉండే ఫిజికల్ భాగాలు


మొబైల్ కేసు : అవును. చాలా మంది ఫోన్ లను ఎలా పడితే అలా వాడేస్తూ ఉతారు కాబట్టి దానిపై ఎలాంటి గీతలు పడకుండా ఉండడానికి మొబైల్ కేసు లు ఇప్పుడు తప్పనిసరి అయ్యాయి. ఈ మొబైల్ కేసు లు అనేక రకాల రంగుల్లో, సైజు లలో, మరియు స్టైల్ లలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ అభిరుచికి తగ్గట్లు ఎదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు.
స్క్రీన్ ప్రోటేక్టర్ : ఇది మరొక ముఖ్యమైన అంశం .ప్రస్తుతం లభిస్తున్న మొబైల్ స్క్రీన్ ప్రోటేక్టర్ లు టెంపర్ద్ గ్లాస్ ల దగ్గరనుండి దృఢమైన ప్లాస్టిక్ షీట్ ల వరకూ లభిస్తున్నాయి. మీ అవసరానికి మరియు బడ్జెట్ కు తగ్గట్లు వీటిని సెలెక్ట్ చేసుకుని మీ స్క్రీన్ కు రక్షణ కల్పించవచ్చు.
మొబైల్ ఫోన్ ఇన్సూరెన్స్ : ఇది ఒక్కోసారి అవసరం మరొక సారి అనవసరం అనిపిస్తుంది. ఎక్కువ ఖర్చు పెడుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. కాబట్టి మీ అవసరం మీకు తెలుసు కాబట్టి బాగా అవసరం అనుకుంటే మొబైల్ ఇన్సూరెన్స్ చేసుకోవడం లో తప్పు లేదు.
పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ : మన ఫోన్ లోని బ్యాటరీ తొందరగా డ్రెయిన్ అవుతూ ఉంటె ఎంతో చికాకుగా ఉంటుంది కదా! అ సమయం లో ఫోన్ ను ఉపయోగించి చేయవలసిన ముఖ్యమైన పని ఏదైనా ఉంటె ఇక అంతే సంగతులు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ లను ఉపయోగించడం తాపులేదు. వీటిని ఉపయోగించి మీ మొబైల్ లకు మరియు టాబ్లెట్ లకు ఇలా ఏ గ్యాడ్జేట్ లకైనా ఎన్ని సార్లైనా ఛార్జింగ్ పెట్టవచ్చు. అయితే వీటిలో మంచి వాటిని సెలెక్ట్ చేయవలసిన అవసరం ఉంది.
మై ఫై : దీనిద్వారా మిమ్మల్ని మీరు ఒక పోర్టబుల్ వైఫై గా తాయారు చేసుకోవచ్చు. ఒక చిన్న హార్డ్ డ్రైవ్ లాంటి మెటీరియల్ లాంటిది ఇది. ఇవి వైర్ లెస్ గా కనెక్ట్ అయ్యే రూటర్ లు. దీనిని మీరు అనేక డివైస్ లకు కనెక్ట్ చేసి ఇంటర్ నెట్ యాక్సెస్ ను పొందవచ్చు.

అవసరమైన యాప్ లు

ఒక్కసారి మీరు మీ మొబైల్ తో పాటు ఈ గ్యాడ్జేట్ లన్నీ కొనుగోలు చేసిన తర్వాత మీ పని ఏమిటో తెలుసా? ఏముంది, అవసరమైన యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవడమే. ఖచ్చితంగా అవును. అందరికీ అవసరమైన యాప్ లు ఏవో ఇప్పుడు చూద్దాం
సిటీ మ్యాపర్ : gps ద్వారా మీరు ఉన్న ప్రదేశం మీరు ఎక్కడికి వెల్లవల్సినదీ తదితర విషయాలన్నీ ఇలాంటి యాప్ ల ద్వారా తెలుసుకోవచ్చు. దీనికోసం ప్రస్తుతం అనేకరకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి.
మొబైల్ బ్యాంకింగ్ : ఇది ప్రస్తుతం చాలా మందికి అవసరమైన యాప్ గా మారిపోయింది. మన దేశం లో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యం లో ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ల యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉంది. దాదాపు ప్రతీ బ్యాంకు కూడా తన యొక్క మొబైల్ బ్యాంకింగ్ యాప్ ను కలిగి ఉంది.
ఉబెర్ : మీ ఏరియా లో ఉబెర్ సర్వీస్ లు ఉన్నట్లయితే వెంటనే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఈ యాప్ మీ ఫోన్ లో ఉండడం వలన నష్టం ఏమీ లేదు.
సోషల్ మీడియా : సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో అందరికీ ఒక సరదాగా మారిపోయింది. కాబట్టి మీకు ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లకు సంబందించిన యాప్ లు డౌన్ లోడ్ చేసుకోండి.
ఫిట్ నెస్ ట్రాకర్ : ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది. ప్రొద్దునే లేచి వ్యాయామం చేసేవారు తమ ఫోన్ లలో తప్పనిసరిగా వీటిని ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. మీరు అలా చేస్తారా? అయితే మరెందుకు లాస్యం వెంటనే ఈ ఫిట్ నెస్ ట్రాకర్ యాప్ లను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి.

జన రంజకమైన వార్తలు