• తాజా వార్తలు
  •  

భార‌త్‌లో త్వ‌ర‌లో లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే !

రోజుకో ఫోన్ రంగంలో దిగుతున్న త‌రుణ‌మిది. చిన్న చిన్న మార్పులతోనే పెద్ద కంపెనీలు భిన్న‌మైన ఫోన్ల‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. దాదాపు ఫీచ‌ర్ల‌న్ని ఒక‌టే అయినా ఏదో కెమెరాలో పిక్స‌ల్స్‌లో తేడా అంటూ మ‌రో కొత్త ఫోన్ తెర మీద‌కు వ‌స్తోంది. ముఖ్యంగా భార‌త్‌లో లాంటి ర్యాపిడ్ గ్రోత్ ఉన్న మార్కెట్లో ఈ ఏడాది కుప్ప‌లు తెప్ప‌లుగా ఫోన్లు వ‌చ్చి ప‌డ్డాయి. మ‌రిన్ని ఫోన్లు రావ‌డానికి కూడా రంగం సిద్ధ‌మైంది. మ‌రి మ‌న దేశంలో త్వ‌ర‌లో రాబోతున్న అలాంటి ఫోన్ల‌లో ముఖ్య‌మైన వాటిని చూద్దామా?

యాపిల్ ఐఫోన్ ఎక్స్‌
యాపిల్ కంపెనీ భార‌త్‌లో బాగానే ఫోన్ల‌ను సేల్ చేస్తోంది. యాపిల్ ఐఫోన్ 7కు ల‌భించిన ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. రేటు ఎక్కువైనా స‌రే ఈఎంఐలు పెట్టి మ‌రీ ఈ ఫోన్‌ను ద‌క్కించుకుంటున్నారు. తాజాగా ఆ సంస్థ ఐఫోన్ ఎక్స్‌ను కూడా రంగంలోకి తీసుకు రానుంది. 64 జీబీ సామ‌ర్థ్యం ఉన్న ఈ ఫోన్ ధ‌ర రూ.89 వేల వ‌ర‌కు ఉండొచ్చు.  రూ.256 జీబీ ఉన్న ఫోన్ ధ‌ర రూ.1,02,000గా నిర్ణ‌యించారు. 5.8 అంగుళాల డిస్‌ప్లే, ఫింగ‌ర్‌ప్రింట్, ఫేసియ‌ల్ రిక‌గ‌నైజేష‌న్ లాంటి సెక్యూరిటీ ఆప్ష‌న్లు ఉన్నాయి. 

గూగుల్ పిక్స‌ల్ 2, పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్ 
గూగుల్ కంపెనీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తేబోతున్న గూగుల్ పిక్స‌ల్ 2, పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్ త్వ‌ర‌లోనే భార‌త్‌లో అడుగుపెట్ట‌నున్నాయి. వీటి ధ‌ర రూ.61 వేలు, రూ.77,000గా నిర్ణ‌యించిన‌ట్లు ఆ కంపెనీ తెలిపింది. 5 అంగుళాల డిస్‌ప్లే, 3 డీ  కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌తో పాటు 64 జీబీ, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది., ఈ రెండు ఫోన్ల‌లో 2700 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. 

వ‌న్‌ప్ల‌స్ 5టీ
వ‌న్‌ప్ల‌స్ నుంచి రాబోతున్న మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మోడ‌ల్ వ‌న్‌ప్ల‌స్ 5టీ. 6 అంగుళాల డిస్‌ప్లే, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు మ‌రెన్నో అదిరే ఫీచ‌ర్లు ఈ ఫోన్ సొంతం. అయితే దీని గురించి పూర్తి వివ‌రాలు ఇంకా అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంది. అంటే భార‌త్‌లో ధ‌ర ఎంత ఉంటుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌నే విష‌యాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి అవుతాయి. 

హెచ్‌టీసీ యూ11 ప్ల‌స్‌
హెచ్‌టీసీ నుంచి వ‌చ్చిన మ‌రో మోడ‌ల్ యూ11 ప్ల‌స్‌, దీంతో పాటు యూ11 లైఫ్ కూడా త్వ‌ర‌లోనే మ‌నం దేశంలో రంగ ప్ర‌వేశం చేయ‌నున‌నాయి. 3830 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఈ ఫోన్ల సొంతం. 5.5 అంగుళాల డిస్‌ప్లే, 4, 6 జీబీ ర్యామ్ సామ‌ర్థ్యం కూడా ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఈ ఫోన్ల‌లో ఉన్న స్పెషాలిటీ. 

నోకియా 7
నోకియా 6 మోడ‌ల్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించడంతో నోకియా 7ను విడుద‌ల చేయ‌డానికి ఆ కంపెనీ స‌న్నాహ‌కాలు ప్రారంభించింది. నోకియా  6లో చేసిన పొర‌పాట్ల‌ను దిద్దుకుని నోకియా 7ను మ‌రింత ఉన్న‌తంగా తేవాల‌నేది ఆ సంస్థ సంక‌ల్పం. 52 అంగుళాల డిస్‌ప్లే, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్‌, ఆక్టా కోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌,  64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌లు. 16 మెగా పిక్స‌ల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్స‌ల్   ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ సొంతం.    

జన రంజకమైన వార్తలు