• తాజా వార్తలు
  •  

రూ.7000లోపు ధ‌ర‌ల్లో ఉత్త‌మ వీవోఎల్ఈటీ ఫోన్లు ఇవే..

ఒక‌ప్పుడు మంచి ఫోన్ కొనాలంటే క‌చ్చితంగా రూ.10 వేలు పెట్టాల్సిందే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మ‌న బడ్జెట్‌కు స‌రిపోయే రేంజ్‌లోనే మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.  సెల్‌ఫోన్ విప్ల‌వం పెరిగిన త‌ర్వాత, మార్కెట్లో పోటీ ఎక్కువైన త‌ర్వాత అన్ని ప్ర‌ధాన ఫోన్ మెకింగ్ కంపెనీల‌న్నీ త‌మ ఫోన్ల‌ను ప్ర‌త్య‌ర్థి కంటే త‌క్కువ ధ‌రకే ఇవ్వాల‌ని చూస్తున్నాయి. దీని వ‌ల్ల పోటీని త‌ట్టుకొని నిల‌దొక్కుకోవ‌చ్చ‌నేది వాటి ప్ర‌య‌త్నం. అయితే ధ‌ర  త‌గ్గిస్తే స‌రిపోదు. ఆ ఫోన్ 4జీ నెట్‌వ‌ర్క్‌కు స‌పోర్ట్ చేయాలి.  మ‌రి  ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రూ.7000 లోపు వీవోఎల్ఈటీ ఫోన్లు ఏమిటో చూద్దామా?

షియోమి రెడ్‌మి 4

భార‌త్‌లో ఎక్కువ‌గా అమ్ముడుపోతున్న వీవోఎల్‌టీ ఫోన్ల‌లో రెడ్‌మి ఒక‌టి. ఈ బ్రాండ్ ద్వారా వ‌చ్చిన దాదాపు అన్ని ఫోన్లు వినియోగ‌దారుల్లో మంచ పేరు సంపాదించుకున్న ఆ కోవ‌కు చెందిందే షియోమి రెడ్‌మి 4.  ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఉత్త‌మమైంద‌ని విమ‌ర్శ‌కుల ప్ర‌శంసంలు అందుకున్న రెడ్‌మి  ఫోన్ ఇప్పుడు మార్కెట్లో హాట్ కేక్‌. 5 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌తో పాటు 2జీబీ ర్ఆమ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ దీని ప్ర‌త్యేక‌త‌. ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వ‌ర‌కు మెమరీని ఎక్స్‌టెండ్ చేసుకోవ‌చ్చు.  13 ఎంపీ రేర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో బ్యాట‌రీ 4100 ఎంఏహెచ్‌గా ఉంది.

మోట‌రోలా మోటో సీ ప్ల‌స్

మార్కెట్లో షియోమి, మోట‌రోలాకు నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. అయితే షియోమితో పోలిస్తే మోట‌రోలా ఫోన్లు ధ‌ర ఎక్కువ కావ‌డంతో  జ‌నాద‌ర‌ణ విష‌యంలో మాత్రం షియోమిదే అగ్ర‌స్థానం.  అయితే రెడ్‌మి 4తో మోట‌రోలా మోటో సి ప్ల‌స్‌ను పోల్చ‌లేం. దీని ప్ర‌త్యేక‌తే వేరు. 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్ ధ‌ర రూ.6999. దీనిలో 2జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. 8 ఎంపీ కెమెరా,  2 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆప్ష‌న్లు ఈ ఫోన్లోల ఉన్నాయి. డ్యుయ‌ల్ సిమ్ ఉంది.

ఐవోమి మీ 3ఎస్‌

ఇటీవ‌లే మార్కెట్లోకి వ‌చ్చిన ఐవోమి మీ 3ఎస్ కూడా దూసుకుపోతోంది. త‌న ల‌క్ష్యాన్ని మించి ఇది ముందుకు వెళుతోంది. ఆన్‌బ్రేక్‌బుల్ డిస్ల్‌పేతో త‌యారైన ఈ చైనా ఫోన్ ధ‌ర రూ.6499. మీడియా టెక్‌6737 చిప్ సెట్‌, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో పాటు  5.2 అంగుళాల డిస్‌ప్లే దీని సొంతం .అంతేకాక‌.13 ఎంపీ రేర్‌,8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు కూడా ఉన్నాయి.  దీనిలో ఉన్న మ‌రో ఆప్ష‌న్ 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ. ఆండ్రాయిడ్ న‌గౌట్ ఓఎస్‌తో త‌యారైంది ఈ ఫోన్‌.

షియోమి రెడ్‌మి 4

రెడ్‌మి శ్రేణి నుంచి వ‌చ్చిన ఈ ఫోన్ కూడా వినియోగ‌దారుల నేస్తంగా మారిపోయింది. ఎక్కువ‌మంది ఈ ఫోన్‌నే ప్రిఫ‌ర్ చేస్తున్నారు. దీనికి కార‌ణం  ఎక్కువ ధ‌ర లేక‌పోవ‌డం, మంచి ఫీచ‌ర్లు ఉండ‌డం.  ర ఊ.5999 ధ‌ర ఉన్న ఈ ఫోన్లో  5 అంగుళాల కెమెరా, స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 13 ఎంపీ రేర్‌, 5ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.  దీని బ్యాట‌రీ సామ‌ర్థ్యం 3120 ఎంఏహెచ్‌.

యు యునిక్ 2

భార‌త కంపెనీ మైక్రోమాక్స్ సాయంతో బ‌రిలో దిగిన స్మార్ట్‌ఫోన్ యు యునిక్ 2. 2015లో లాంచ్ అయిన ఫోన్ ఇటీవ‌లే పుంజుకుంది దీని ధ‌ర రూ.5999గా  ఉంది.  2 జీబీ ర్యామ్ దీని ప్ర‌త్యేక‌త‌.  5 అంగుళాల  హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు 13 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీని సొంతం . ఆండ్రాయిడ్ నౌగ‌ట్ ఓఎస్ ఓడారు. దీని బ్యాట‌రీ సైజు 2500 ఎంఏహెచ్‌.

                                  

జన రంజకమైన వార్తలు