• తాజా వార్తలు
  •  

ఇలాంటి స్మార్ట్‌ఫోన్ యాక్స‌స‌రీస్‌ ఉన్నాయని మీకు తెలుసా ?

స్మార్ట్‌ఫోన్... ఇది రావ‌డంతో పాటు ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌ల‌ను కూడా మోసుకొచ్చింది. రోజులు మారుతున్న కొద్దీ ర‌క‌ర‌కాల ఉప‌క‌ర‌ణాలు మార్కెట్లోకి అందుబాటులోకి వ‌స్తున్నాయి. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు..మ‌న‌కు అన్ని విధాలా ఉప‌యోగ‌ప‌డేలా ఈ యాక్స‌స‌రీస్ ఉంటున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్స్‌తో పాటు ఇవి కూడా మారిపోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ యాక్స‌స‌రీస్‌లో అలా వ‌చ్చిన ఐదు విధ్వంసక ఆవిష్క‌ర‌ణ‌లేంటో చూద్దామా..

వోల్ట‌ర్ స్మార్ట్ వాలెట్‌
స్మార్ట్‌ఫోన్‌కు వాలెట్స్‌కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఇప్పుడంతా స్మార్ట్ అయిపోయింది. ప్ర‌తి వ‌స్తువు మ‌న స్మార్ట్‌ఫోన్‌కు రిలేట్ అయిపోతోంది. మ‌న ఫోన్‌ను జేబులో పెట్టుకుంటాం.. అలాగే వాలెట్‌ను కూడా జేబులోనే ఉంచుకుంటాం. కానీ  ఇప్పుడు అటు ఫోన్‌తో పాటు వాలెట్‌ను కూడా ఒకే అమ్ముల‌పొదిలో ఇముడ్చుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. వోల‌ర్ స్మార్ట్ వాలెట్ అదే కోవ‌కు చెందింది. దీంతో అటు స్మార్ట్‌ఫోన్‌ను దాచుకోవ‌డ‌మే కాదు మ‌నీ,   క్రెడిట్‌, డెబిట్ కార్డులు భ‌ద్రం చేసుకునే అవ‌కాశం ఉంది. మీ వాలెట్ పోయినా కూడా దాన్ని ఫోన్ ద్వారా ట్రాక్ చేసుకునే  అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు ఈ వాలెట్‌ల ద్వారా ఛార్జింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది. యూఎస్‌బీ కేబుల్‌గా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.

జెడ్ఇ టైమ్ హైబ్రీడ్ స్మార్ట్‌వాచ్ 
యాపిల్ స్మార్ట్‌వాచ్‌ను మించిన ఫీచ‌ర్లు జెడ్ఇ టైమ్ హైబ్రీడ్ స్మార్ట్‌వాచ్‌లో ఉన్నాయి. ఇది డిజిటిల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,  మెకానిక‌ల్ వాచ్‌ల‌తో కూడిన డిస్‌ప్లే. యాపిల్ స్మార్ట్‌వాచ్ కూడా జెడ్ఇ వాచ్‌ల స్ఫూర్తిగా రూపుదిద్దుకున్న‌దే. దీనిలో హార్ట్‌రేట్ మానిట‌ర్ ఉంది.  మీ ఫోన్‌తో దీన్ని క‌నెక్ట్ చేసుకుంటే చాలు మ‌నం ఎక్క‌డికి వెళుతున్నామో..  ఏం చేస్తున్నామో  కూడా మ‌న స‌న్నిహితుల‌కు తెలిపోతుంది. దీని ద్వారా ఛార్జింగ్ ఆప్ష‌న్ కూడా ఉంది.  దీనిలో ఉన్న మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే ఒక‌సారి ఛార్జ్ చేస్తే 30 రోజులు వాడుకోవ‌చ్చు

సెల్ఫీ ఫ్ల‌యింగ్ కెమెరా
స్మార్ట్‌ఫోన్ల కోసం వ‌చ్చిన  యాక్స‌స‌రీస్‌లో ఇదో అద్భుత‌మైన ఆవిష్క‌ర‌ణ‌. డ్రోన్ టెక్నాల‌జీతో ఎగురుతూ పిక్చ‌ర్లు తీయ‌డం దీని స్పెషాలిటీ. 12,000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం ఉన్న ఈ ఈ సెల్ఫీ ఫ్ల‌యింగ్ కెమెరా పిక్చ‌ర్ల‌ను, వీడియోల‌ను  గొప్ప‌గా కాప్చ‌ర్ చేస్తుంది.  ఏ ఫోన్‌కైనా  ఈ టెక్నాల‌జీని వాడొచ్చ‌ని.. స్క్రీన్ సైజు 4 నుంచి 6 అంగుళాల మ‌ధ్య ఉండాల‌ని ఈ టెక్నాల‌జీ రూప‌క‌ర్త‌లు అంటున్నారు .

వీయ‌ర‌బుల్ ప‌వ‌ర్‌బ్యాంకు, యూఎస్‌బీ కేబుల్‌
ప‌వ‌ర్ బ్యాంకు,యూఎస్‌బీ కేబుల్  ఈ రెండు ఎలా ప‌ని చేస్తాయి? ఇదేం ప్ర‌శ్న అనుకుంటున్నారా? .. సాధార‌ణంగా ప‌వ‌ర్‌బ్యాంకు, యూఎస్‌బీ కేబులను డివైజ్‌కు క‌నెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇలా క‌నెక్ట్ చేయ‌కుండానే నేరుగా వాడే అవకాశం ఉన్న వీయ‌ర్‌బుల్ ప‌వ‌ర్‌బ్యాంకు, యూఎస్‌బీ కేబుల్ వ‌చ్చాయి. నిఫ్ట్‌క్స్ వీటిని త‌యారు చేసింది. వీటిని చేతికి ధ‌రిస్తే చాలు. మ‌నం స్మార్ట్‌ఫోన్‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.        

నోప్ వెబ్ కామ్ క‌వ‌ర్‌, సౌండ్ బ్లాక‌ర్‌
హ్యాకర్ల నుంచి మ‌న డివైజ్‌ల నుంచి కాపాడుకోవ‌డానికి వెబ్‌కామ్ క‌వ‌ర్‌, సౌండ్ బ్లాక‌ర్ అనే ఆవిష్క‌ర‌ణ‌లు వ‌చ్చాయి. స్నీకీ స్టాల్క‌ర్స్ నుంచి  త‌ప్పించుకోవ‌డానికి ఇవి గొప్ప‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.  మీ ఫొటోలు తీయ‌డం పూర్త‌యిన త‌ర్వాత వెబ్‌కామ్ క‌వ‌ర్ షెట్ట‌ర్‌లా ఉప‌యోగ‌ప‌డుతుంది

జన రంజకమైన వార్తలు