• తాజా వార్తలు

వైఫై తో ఎన్నెనో పనులు చేయడానికి 7 యాప్స్

నలో చాలామంది వైఫై ని ఎందుకు ఉపయోగిస్తారు? ఏముంది, కేవలం మన ఫోన్ లకు గానీ, టాబ్లెట్ లకు గానీ, లాప్ టాప్ లకు గానీ ఇంటర్ నెట్ కనెక్షన్ కోసమే కదా! అయితే కేవలం ఇంటర్ నెట్ మాత్రమే కాకుండా ఈ వైఫై ని ఉపయోగించి మనం అంతకుమించి చాలా చేయవచ్చు. అలా వైఫై ని ఉపయోగించి కొన్ని పనులు చేయడానికి ఒక 7 యాప్ ల వివరాలను అందిస్తున్నాం. కేవలం కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం.

గ్రూప్ ప్లే

మొట్టమొదటగా ఈ గ్రూప్ ప్లే అనే యాప్ సామ్సంగ్ మొబైల్స్ దాని ఫోన్ లలోనూ, టాబ్లెట్ ల లోనూ ప్రారంభించింది. ఈ గ్రూప్ ప్లే ని ఉపయోగించి మీ సమీపం లో ఉన్న పరికరాలతో మ్యూజిక్ షేరింగ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ప్లే చేయవచ్చు. కాకపోతే అన్ని పరికరాలు అదే నెట్ వర్క్ కు కనెక్ట్ అయిఉండాలి. ముందుగా మీరు దీని యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత దానిని మిగతా పరికరాలతో కనెక్ట్ చేయాలి. ఇక వేరే డివైస్ లనుండి ఎంచక్కా మ్యూజిక్ వినేయవచ్చు. దీనికోసం ఉచిత యాప్ లు అయిన కోరస్, సింక్ సాంగ్, సౌండ్ సీడర్, మ్యూజిక్ పూల్ లాంటివాటిని కూడా ట్రై చేయవచ్చు. అన్నీ ఒకే రకంగా పనిచేస్తాయి.

ఎయిర్ వీడియో

iOS డివైస్ లన్నీ లిమిటెడ్ స్టోరేజ్ ని కలిగిఉంటాయనే సంగతి మనందరికీ తెలిసినదే. మీ డివైస్ లో వీడియో లు చూడాలి అనుకునే వారికి ఇది ఒక సమస్య గా ఉంటుంది. అయితే మీ వైఫై  నెట్ వర్క్ ను ఉపయోగించి ఎయిర్ వీడియో HD అనే యాప్ ద్వారా ఈ సమస్యకు స్వస్తి చెప్పవచ్చు. మొదటగా మీరు మీ కంప్యూటర్ లో సర్వర్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఈ సర్వర్ రన్ అవడం స్టార్ట్ అయిన తర్వాతా మీ వీడియో లన్నీ ఫోల్డర్ ల లోనికి యాడ్ చేసుకోవాలి.

ఇంక మీరు చేయవలసింది ఏమిటంటే మీ iOS పరికరాన్ని వైఫై కి మరియు ఎయిర్ వీడియో కి కనెక్ట్ చేయడమే. అది మీకు వెంటనే ఫోల్డర్ లలో ఉంచబడిన వీడియోలను చూపిస్తుంది. ఇక అక్కడ మీకు కావలసిన వీడియోను చూడడమే తరువాయి. ఒకవేళ ఫైల్ ఫార్మాట్ దానికి సపోర్ట్ చేయకపోతే దానిని ఆన్ ది ఫ్లై గా మారుస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్ లు కూడా VLC డైరెక్ట్ యాప్ లేదా ఎయిర్ స్ట్రీమ్ లాంటి వాటితో ఇదే రకమైన సేవలను పొందవచ్చు.

ప్లెక్స్

ఇది ఒక క్రాస్ ప్లాట్ ఫాం, మీడియా ప్లేయర్/సర్వర్. ఇది విండోస్, మాక్, మరియు లైనక్స్ లలో అందుబాటులో ఉంటుంది. వీడియోలు చూడడానికీ, ఆడియో లు వినడానికీ, మీ కంప్యూటర్ లో స్టోర్ అయిన ఫోటో లను చూడడానికీ దీనిని ఉపయోగించవచ్చు. మీ ఆండ్రాయిడ్, iOS లేదా విండోస్ లలో ఉన్న ఫ్రీ ప్లెక్స్ యాప్ తో దీనిని కనెక్ట్ చేయడం ద్వారా మీ మల్టీమీడియా కలెక్షన్ మొత్తం ఈ పోర్టబుల్ పరికరాల నుండే స్ట్రీమ్ చేయవచ్చు.

ఎయిర్ డిస్ ప్లే 2

మల్టిపుల్ డివైస్ లు అనేవి సాధారణంగా ప్రొడక్టివిటీ ని పెంచుతాయి. ఎయిర్ డిస్ప్లే 2 ద్వారా మీ ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ పరికరాన్ని మీ కంప్యూటర్ కు రెండవ స్క్రీన్ గా ఉపయోగించవచ్చు. దీని ధర సుమారుగా రూ 636/- లు ఉంటుంది. రెండు డివైస్ లూ ఒకే వైఫై నెట్ వర్క్ కు కనెక్ట్ అయిఉండాలి. మరియు మీ విండోస్ లేదా మాక్ కంప్యూటర్ లో అదనపు సర్వర్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ప్రస్తుతం ఇది విండోస్ 10 ని సపోర్ట్ చేయడం లేదు. దీనిని పోర్ట్ రైట్ మరియు ల్యాండ్ స్కేప్ మోడ్ లలో ఉపయోగించవచ్చు.

ఎయిర్ డ్రాయిడ్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను ఫైల్ ట్రాన్స్ ఫర్ కోసం తరచుగా మీ కంప్యూటర్ కు కనెక్ట్ చేస్తున్నారా? అయితే ఇక మీ పని సులభతరం కానుంది. ఎయిర్ డ్రాయిడ్ అనే యాప్ ద్వారా ఈ పనిని మరింత సింపుల్ గా చేయవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మీ ఆండ్రాయిడ్ ఫోన్ కూ మరియు మీ కంప్యూటర్ కూ మధ్య వైర్ లెస్ కనెక్షన్ ను ఇది కల్పిస్తుంది. ఇది వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి పనిచేస్తుంది కావున దీనికోసం మీ కంప్యూటర్ లో అదనపు సాఫ్ట్ వేర్ ను ఇన్స్టాల్ చేసుకోవలసిన అవసరం లేదు.

http://web.airdroid.com in ద్వారా మీ PC లో ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయవచ్చు. సెక్యూర్ కనెక్షన్ ను పొందడానికి మీ కంప్యూటర్ స్క్రీన్ పై ఉండే QR కోడ్ ను స్కాన్ చేయవలసి ఉంటుంది.  ఈ బ్రౌజర్ యొక్క ఇంటర్ పేస్ ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటుంది. మీ ఫోన్ కోసం బ్యాక్ అప్ కూడా తీసుకోవచ్చు, ఫోన్ నోటిఫికేషన్ లను చూడవచ్చు, మీ ఫోన్ స్టోరేజ్ కి సంబందించిన వివరాలను చూడవచ్చు.

మొబైల్ ఎయిర్ మౌస్

వైఫై ద్వారా మీ స్మార్ట్ ఫోన్ ను మీ కంప్యూటర్ కు రిమోట్ కంట్రోల్ లాగా మార్చుకోవచ్చు. దీనికోసం మీరు మీ కంప్యూటర్ దగ్గర ఉండవలసిన అవసరం లేదు వేరే గదిలో కూర్చుని కూడా మీ కంప్యూటర్ ని రిమోట్ లాగా పనిచేయించవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్ లైతే మొబైల్ మౌస్ లైట్, i OS యూజర్ లైతే మొబైల్ మౌస్ రిమోట్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇవి పెయిడ్ యాప్ లు. ఆ తర్వాత ఫ్రీ సర్వర్ సాఫ్ట్ వేర్ ను మీ PC లో ఇన్ స్టాల్ చేసుకోవాలి.

వైఫై IP కెమెరా

మీ దగ్గర పాత ఆండ్రాయిడ్ ఫోన్ లేదా iOS పరికరం ఉన్నట్లయితే దానిని మీరు వైర్ లెస్ కెమెరా లాగా మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూఅజ్ర్ లు ఫ్రీ IP వెబ్ క్యాం యాప్ ను, iOS యూజర్ లు మెనీ థింగ్ హోమ్ సెక్యూరిటీ కెమెరా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రెండూ కూడా ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటాయి.ఈ యాప్ ను మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని మీ ఏరియా మొత్తం ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రదేశం లో కొంత కోణం లో మీ ఫోన్ ను ఉంచి దానిని వెబ్ క్యాం లా ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్ లు వెబ్ బ్రౌజర్ ద్వారా VLC ప్లేయర్ ని కూడా స్ట్రీమింగ్ చేయవచ్చు.

 

జన రంజకమైన వార్తలు