• తాజా వార్తలు

వృద్ధుల కోసం ఉప‌యోగ‌ప‌డే 8 అద్భుత‌మైన గ్యాడ్జెట్లు ఇవీ..

వృద్ధాప్యంలో ఒంట‌రిగా ఉండ‌డం చాలా క‌ష్టం. ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌క అలా ఒంట‌రిగా ఉండే వృద్ధుల‌కు ఎన్నో స‌మ‌స్య‌లు. మ‌తిమ‌రుపు, త‌మ ప‌ని చేసుకోలేక‌పోవ‌డం, ఇల్లు శుభ్రం చేసుకోవ‌డం, చిన్న‌చిన్న ప‌నుల‌కు కూడా శ‌రీరం స‌హ‌క‌రించ‌క‌పోవడం జ‌రుగుతుంటాయి. అయితే టెక్నాల‌జీ మ‌న జీవితాల్లో బాగా పెనిట్రేట్ అయ్యాక ఇలా వృద్ధుల అవ‌స‌రాల‌ను తీర్చే బోలెడు గ్యాడ్జెట్లు అందుబాటులోకి వ‌చ్చేశాయి. అందులో కొన్నింటి గురించి  చూడండి.

 

1. లిఫ్ట్‌వేర్ (Liftware)

వ‌య‌సు మీద ప‌డిన‌వారికి, కొన్ని ర‌కాల రుగ్మ‌త‌లు ఉన్న‌వారికి చేతులు, కాళ్లు వ‌ణుకుతాయి. ఏ వ‌స్తువునూ గట్టిగా ప‌ట్టుకోలేరు. అలాంటివారికోసం Liftware రేంజ్ ప్రొడ‌క్ట్స్ అయిన స్పూన్స్‌, ఫోర్కులు, చాకులు వంటివి బాగా ఉప‌యోగ‌ప‌డతాయి. వీటిని  యూజ్ చేయ‌డానికి 20% శ‌క్తి మ‌నం ఉప‌యోగిస్తే మిగిలిన 80% ఎన‌ర్జీని అవే ఉపయోగిస్తాయి.  మోష‌న్ సెన్స‌ర్ల ఆధారంగా ఇవి ప‌ని చేస్తాయి.

2. యూఎస్‌బీ డాల్ఫిన్ సూప‌ర్‌నోవా మాగ్నిఫైయ‌ర్  (USB Dolphin SuperNova Magnifier)

ఇది ఒక యూఎస్‌బీ స్టిక్‌. దీని ద్వారా  మొబైల్ లేదా కంప్యూట‌ర్ స్క్రీన్‌మీద ఉన్న టెక్స్ట్‌ను 64 రెట్లు మాగ్నిఫై చేయొచ్చు. అంటే మీ కంప్యూట‌ర్ స్క్రీన్ మొత్తం మీద మూడు లైన్లు మాత్ర‌మే ప‌ట్టేంత పెద్ద‌వ‌వుతాయి. దృష్టి లోపం బాగా ఉన్న పెద్ద‌వాళ్ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. పెన్‌డ్రైవ్‌లా ఉండ‌డంతో క్యారీ చేయ‌డం కూడా ఈజీ.

3. క్లారిస్ కంపేనియ‌న్ (Claris Companion)

క్లారిస్ కంపేనియ‌న్ అనేది ఒక డివైస్‌. దీన్ని ట్యాబ్లెట్‌లా, కంప్యూట‌ర్‌లా, మొబైల్ ఫోన్‌లా ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసి వాడుకోవ‌చ్చు. ఏమీ లేద‌నుకుంటే మొత్తం మ‌డ‌త‌ల‌న్నీ విప్పి ఫొటో ప్రేమ్‌లా కూడా వాడుకోవ‌చ్చు.  దీనిద్వారా వెబ్ బ్రౌజ్‌ చేసుకోవ‌చ్చు. వీడియోస్ చూడొచ్చు. వీడియో చాట్ యాప్ ద్వారా దీనితో వీడియో కాల్స్  చేసుకోవ‌చ్చు.  అంతేకాదు ఏ టైంలో మందులు వేసుకోవాలో మెడికేష‌న్ రిమైండ‌ర్స్ కూడా సెట్ చేసుకునే సౌక‌ర్యం ఉండ‌డం వృద్ధుల‌కు బాగా ఉప‌యోగం.

4. రూంబా (Roomba)

ఇల్లు తుడుచుకోవ‌డం వృద్ధుల‌కు అతి క‌ష్ట‌మైన ప‌ని.  ఇల్లు తుడిచి త‌డిగుడ్డ‌తో తుడ‌వ‌డానికి స‌రిప‌డా శ‌క్తిలేని వృద్ధుల కోసం రూంబా బాగా ప‌నికొస్తుంది.  ఇది రోబోలా ప‌ని చేస్తుంది.  మొబైల్ యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మూడు స్టేజ్‌ల్లో క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఇల్లు తుండం, ఎల‌ర్జిటిక్ వాటిని ఫిల్ట‌ర్ చేయ‌డం, అతి సూక్ష్మ‌మైన దుమ్మును కూడా క్లీన్ చేస్తుంది.  ఎంట్రీ లెవెల్ రూంబా 690 ధ‌ర 24వేల వ‌ర‌కు ఉంటుంది.

5. రింగ్ వీడియో డోర్‌బెల్ ప్రో (Ring Video Doorbell Pro)

వినికిడి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉన్న వృద్ధుల కోసం రింగ్ వీడియో డోర్‌బెల్ ప్రో చాలా బాగా ప‌నికొస్తుంది. ఇది స్మార్ట్ డివైస్‌. ఎవ‌రైనా వ‌చ్చి బెల్ కొట్ట‌గానే వృద్ధుల‌కు విన‌ప‌డ‌క‌పోయినా  వాళ్‌ల మొబైల్‌ఫోన్‌కు నోటిఫికేష‌న్ వ‌స్తుంది. వీడియో ఫీడ్‌ను కూడా పంపిస్తుంది. అంతేకాదు వ‌చ్చిన వ్య‌క్తితో మొబైల్ నుంచే నేరుగా రియ‌ల్‌టైంలో మాట్లాడే ఫెసిలిటీ కూడా ఉంది.  ధ‌ర 16వేల వ‌ర‌కు ఉంటుంది.

6. రిమైండ‌ర్ రోజీ (Reminder Rosie)

ఇది ఒక స్మార్ట్ క్లాక్‌. దీనిలో 25 డిఫ‌రెంట్ మెసేజ్‌ల‌ను స్టోర్ చేసి యూజ‌ర్‌కు రిమైండ్ చేయొచ్చు. టైంకి మందులు వేసుకోమ‌ని, భోజ‌నం చేయ‌మ‌ని, డోర్ లాక్ చేసుకోమ‌ని  ఇలాంటి రిమైండ‌ర్ల‌న్నీ స్టోర్ చేసి పెద్ద‌వాళ్ల‌కు మనం ద‌గ్గ‌ర‌లేకపోయినా గుర్తు చేయ‌వ‌చ్చు. వృద్ధుల కోసం కాబ‌ట్టి 100 అడుగుల దూరంలో ఉన్నా కూడా చాలా పెద్ద సౌండ్‌తో రిమైండ‌ర్ వినిపిస్తుంది.  అమెజాన్లో 6500కు కొనుక్కోవ‌చ్చు.

7. బెడ్ అండ్ ఛైర్ ఫాల్‌గార్డ్  (Bed and Chair Fallguard)

వృద్ధులు మంచం మీద నుంచి లేదా కుర్చీలోంచి లేచేట‌ప్పుడు స‌డెన్‌గా ప‌ట్టు త‌ప్పి ప‌డిపోతుంటారు. ఆ వ‌య‌సులో వారు ప‌డిపోతే చాలా క‌ష్టం. అందుకే ఈ బెడ్ అండ్ ఛైర్ ఫాల్‌గార్డ్‌ను దగ్గ‌ర పెట్టుకుంటే అలాంటి ప‌రిస్థితుల్లో ప‌క్క‌నున్న‌వారిని అల‌ర్ట్ చేస్తుంది.

8. అమెజాన్ అలెక్సా  (Amazon Alexa)

అమెరికాలో ఉండేవారికి ఉప‌యోగ‌ప‌డే డివైస్ ఇది. న్యూస్‌ను గట్టిగా చ‌దివి వినిపిస్తుంది. ఇంట్లో స‌ర‌కులు అయిపోతే ఆర్డ‌ర్ ఇచ్చి తెప్పిస్తుంది. వాతావ‌ర‌ణం ఎలా ఉందో చెబుతుంది. మ్యూజిక్ వినిపిస్తుంది. మీ ఇంటిలో ఉన్న టీవీ, ఫోన్‌లాంటి ఇత‌ర స్మార్ట్ డివైస్‌ల‌న్నిటినీ కంట్రోల్ చేసే అమెజాన్ అలెక్సా కూడా వృద్ధుల‌కు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

జన రంజకమైన వార్తలు