• తాజా వార్తలు
  •  

8 GB RAM , ఆక్టా కోర్ ప్రాసెసర్ లతో టాప్ 5 స్మార్ట్ ఫోన్ లు

మీ స్మార్ట్ ఫోన్ లు 8 GB RAM తో లభిస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత RAM కేవలం కంప్యూటర్ లు మరియు లాప్ టాప్ లకు మాత్రమే ఉంటుంది. అయితే దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం 8 GB RAM ను కలిగిఉండే స్మార్ట్ ఫోన్ లను కూడా ఉత్పత్తి చేసింది. ఇది మాత్రమే కాదు భవిష్యత్ లో ఇంతకుమించి RAM తో ఉండే స్మార్ట్ ఫోన్ లను ఉత్పత్తి చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే అతి త్వరలోనే మనం వాటిని కూడా చూడనున్నాము. అయితే 8 GB RAM మరియు ఆక్టా కోర్ ప్రాసెసర్ లతో పనిచేసే టాప్ 5 స్మార్ట్ ఫోన్ లగురించి ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం. ఇవన్నీ ఇంకా లాంచ్ అవలేదు. అయితే మాకు అందుతున్న సమాచారం మరియు ప్రస్తుత టెక్ ప్రపంచం లో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని అతిత్వరలో రానున్న 8 GB RAM స్మార్ట్ ఫోన్ లనుఇక్కడ కేవలం ప్రస్తావించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరికొద్ది నెలలలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అతిత్వరలోనే వీటి గురించిన సమగ్ర సమాచారం మన కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్ లో ప్రచురించడం జరుగుతుంది.

ఆసుస్ జెన్ ఫోన్ AR

మిగతా తయారీదారులకంటే ముందుగాననే ఆసుస్ తన 8 GB RAM ఉన్న స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోనికి తేనుంది. జనవరి మొదటివారంలో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో లాస్ వేగాస్ లో దీనిని ప్రదర్శించారు. ఇది 8 GB RAM ను అందిస్తున్న మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. ఇది వీలైనంత సౌకర్యంగా ఈ ఫోన్ ను తీర్చిదిద్దింది. గూగుల్ డే డ్రీం, వర్చ్యువల్ రియాలిటీ లతో పాటి ప్రాజెక్ట్ టాంగో AR ను కలిగిఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇది. ఇక స్పెసిఫికేషన్ ల విషయానికొస్తే 5.7 ఇంచ్ క్వాడ్ HD AMOLED డిస్ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్ ,23 MP కెమెరా ల లాంటి అధునాతన ఫీచర్ లతో లభిస్తుంది.

వన్ ప్లస్ 4

వన్ ప్లస్ కంపెనీ దీనిని మొట్టమొదటి 8 GB స్మార్ట్ ఫోన్ గా అభివర్ణిస్తున్నప్పటికీ ఇంకా దీని పూర్తీ వివరాలు తెలియరాలేదు. విశ్లేషకులు దీని నుండి మరిన్ని విశేషాలను ఆశిస్తున్నారు.

 

Xiaomi’s 8 GB RAM Phone

ఆసుస్ యొక్క జెన్ ఫోన్ AR కు పోటీగా జియోమీ కూడా తన మొట్టమొదటి 8 GB RAm స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోనికి తేనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సంవత్సరం రెండవ లేదా మూడవ త్రైమాసికాలలో దీనిని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

 

 

సామ్సంగ్ 8 GB RAM ఫోన్

సామ్సంగ్ గాలక్సీ C9 ప్రో 6 GB RAM తో లభిస్తుంది. ఈ నేపథ్యం లో గాలక్సీ 8 8 GB RAM తో లభిచ్న్హే అవకాశాలు ఉన్నాయి. సామ్సంగ్ కూడా తదనుగుణంగా సన్నాహకాలు చేస్తుంది. అతిత్వరలోనే సామ్సంగ్ దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.

 

లీ ఎకో 8 GB RAM ఫోన్ – Le 2s

లీ ఎకో కూడా ఈ పోటీ లో ముందుకు వచ్చి తన 8 GB RAM స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఈ ఫోన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు