• తాజా వార్తలు
  •  

దోమల వలన వ్యాపించే వ్యాధుల వ్యాప్తిని అరికట్టే పరికరాన్ని రూపొందించిన మైక్రో సాఫ్ట్

నేడు మానవాళికి అత్యంత ప్రమాద కరమైన వ్యాధులను అందిస్తున్న జీవులలో దోమలు మొదటి స్థానం లో ఉంటాయి. డెంగు, మలేరియా, చికెన్ గునియా, జికా మొదలైన వ్యాధికారక వైరస్ లన్నింటికీ ప్రధాన కారణం దోమలే అన్న సంగతి అందరికీ తెలిసినదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతీ రోజూ సుమారు 30 కోట్ల కు పైగా జనాభా ఈ దోమల బారిన పడుతున్నారు.టెక్ దిగ్గజం అయిన మైక్రో సాఫ్ట్ ఈ దోమల ఆధారిత వ్యాధులను గుర్తించడానికి, వాటి వ్యాప్తిని అరికట్టడానికీ ఒక ట్రాప్ ను లాంచ్ చేసింది. మైక్రోసాఫ్ట్ యొక్క ప్రతిష్టాత్మక మైన ప్రాజెక్ట్ అయిన ప్రీ మొనిషణ్ లో భాగంగా ఈ ట్రాప్ ను మైక్రోసాఫ్ట్ అభివృద్ది చేసింది. ఇన్ఫెక్షన్ ను కలిగించే ఇలాంటి వ్యాధుల ను గుర్తించడానికీ, నియంత్రించడానికీ రూపొందించిన ఈ ట్రాప్ మైక్రోసాఫ్ట్ యొక్క ఉన్నతిని మరింత ఎత్తుకు తీసుకు వెళ్లి ట్రాప్ టెక్నోలజి లలో నెం 1 గా నిలిపింది.

ఈ ట్రాప్ లో రెండు చిన్న చిన్న బాటరీ తో పనిచేసే మైక్రో ప్రాసెసర్ లు ఉంటాయి. ఇవి సంచారాన్ని సేకరించి క్లౌడ్ ద్వారా పంపిస్తాయి. వీటి ద్వారా సేకరించిన సమాచారాన్ని వైద్యులు, శాస్త్రవేత్తలు విశ్లేషించి ఆయా ప్రదేశాలలో ఉన్న దోమల రకాలనూ అవి వ్యాపింప జేసే వ్యాదులనూ విశ్లేషించి తద్వారా వాటి వ్యాప్తీని నిరోధించగలుగుతారు.ఈ  ట్రాప్ ద్వారా యా దోమ ఉన్న వాతావరణ పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత, ఆర్ద్రత తదితర విషయాలను విశ్లేషిస్తారు. సాధారణంగా వాతావరణం లో దోమల తో పాటు చిన్న పురుగులూ, బాక్టీరియా ,వైరస్ తదితర జీవులు కూడా ఉంటాయి.కానీ ఈ పరికరం లో ఉన్న అల్గోరిథం ఎలాంటిదంటే అది కేవలం దానికి కావలసిన దోమలను మాత్రమే ట్రాప్ చేసి ఆ సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందిస్తుంది.

ప్రస్తుతానికి ఈ ట్రాప్ లు పైలట్ స్థాయి లోను ఉన్నాయి. పరీక్షించడం పూర్తీ అయిన తర్వాత వీటిని ప్రవేశ పెడతారు.

 

జన రంజకమైన వార్తలు