స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే ఏం చేయాలి? ఈ కాంక్రీట్ జంగిల్లో ఈ మాట ఎప్పుడూ అడగకూడదు. ఎందుకంటే స్వచ్ఛమైన అనే మాటకు సిటీలు దూరమైపోయి చాలా కాలం అయిపోయింది. మనం ఉండే ఇళ్లు, చుట్టు పక్కల పరిసర ప్రాంతాలు అన్నీ కలుషితమే. ఈ పరిస్థితుల్లో టెక్నాలజీ మనకు కాస్త ఉపయోగపడి పొల్యుషన్ నుంచి కొంచమైనా కాపాడితే బాగుంటుంది కదా! అలా అనుకునే వారి కోసమే ఈ ఎయిర్ఫ్యూరిఫయర్. గదిలో గాలిని స్వచ్ఛంగా మార్చి మనకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చే సాంకేతిక పరికరం. మరి ఇదెలా పని చేస్తుంది. ఎయిర్ఫ్యూయర్ కొనాలంటే ఏది మంచిది?
పని చేస్తుందిలా..
గది వాతావరణం అంటేనే తలుపులు, కిటికీలు క్లోజ్డ్గా ఉండే ఏరియా. ఇలాంటి వాతావరణంలో సాధారణంగా పొల్యుషన్ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో ఉంటే మనకు వెంటనే తమ్ములు రావడమో లేక ముక్కు పట్టేయడమే లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. శ్వాస సంబంధించి ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఇలాంటి ఇబ్బందులను దూరం చేయడానికి మంచి ఫ్యూరిఫయర్ అవసరం. గాలిలో ఉన్న దుమ్మ ధూళి కణాలను, హానికరమైన వాయువులను, అలర్జీలను కలిగించే డస్ట్‌ను తొలగించడమే ఈ ఫ్యూరిఫయర్ పని. దీనిలో వాడే ఫిల్టర్ సాంకేతికత ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. దుమ్ము, ధూళిని గ్రహించి స్వచ్ఛమైన మంచి వాయువులను విడుదల చేయడం దీని ఎయిర్ ఫ్యూరిఫయర్ ప్రత్యేకత. అందుకే ఇంట్లో మాత్రమే కాదు ఆఫీసులో, కారులోనూ ఈ ఎయిర్ ఫ్యూరిఫయర్‌ను వాడొచ్చు.
ఏది ఉత్తమం?
ఫీచర్లను బట్టి, క్వాలిటీని బట్టి ఎన్నో రకాల ఎయిర్ ఫ్యూరిఫయర్లు మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే సమర్థవంతంగా పని చేసేవి ఉన్నాయి. ఫిల్టర్ క్వాలిటీ, రకాలను బట్టి ఇవి పని చేస్తాయి. ప్రి ఫిల్టర్, అలెర్జీ హెచ్ఈపీఏ ఫిల్టర్, డియోడరైజింగ్ ఫిల్టర్ లాంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. సైజు, బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని ఎయిర్ ఫ్యూరిఫయర్లను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఫిలిఫ్స్ ఎయిర్ ఫ్యూరిఫయర్ సిరీస్ 1000 అందులో మొదటిది. రూ.11,995 ధర ఉన్న ఈ డివైజ్‌లో నైట్ సీన్ ఆటో మోడ్, స్మార్ట్‌లైట్ కంట్రోల్, ఆటో మోడ్, మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్, చైల్డ్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హనీ వెల్ మూవ్ అనే డివైజ్ ధర రూ.7999గా ఉంది. పెద్ద డస్ట్ పార్టికల్స్‌ను ఇది రిమూవ్ చేస్తుంది. ఫిల్టర్ రీప్లేస్మెంట్ రిమైండ్ ఉంది. అట్లాంటా హెల్త్ కేర్ కూడా ఇదే కోవకు చెందింది. దీని ధర రూ.11,960 గా ఉంది. 7 అంచెల ఫిల్టరింగ్, పొల్యుషన్ సెన్సార్, టైమర్ ఆటో స్టార్ట్ దీనిలో కీలక ఫీచర్లు.