• తాజా వార్తలు

ఉచిత అండ్రాయిడ్ యాప్స్ లో అత్యుత్తమమైనవి వాటి ఉపయోగాలు - మొదటి భాగం

నేటి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ అనేది బహుళ ప్రజాదరణ పొందింది. అంతేగాక ఆపిల్ యొక్క i ఫోన్ కు ఇది ప్రధాన పోటీ దారుగా మారింది. ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న స్మార్ట్ ఫోన్ లలో సగానికి పైగా ఆండ్రాయిడ్ OS తోనే లభిస్తున్నాయంటే దీని యొక్క విస్తృతి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆపిల్ కు యాప్ స్టోర్ లాగే గూగుల్ కు కూడా గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్ అనే ఒక స్వంత యాప్ స్టోర్ ఉన్నది. ఈ నేపథ్యం లో మనం ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే అందులో ఏ ఏ యాప్ లు వేయాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఉచిత యాప్ లు ఎక్కడ లభిస్తాయి, వాటిలో ఏవి బాగుంటాయి? ఇలా ఉత్సుకత తో కూడిన ప్రశ్నలు మదిని తొలిచి వేయడం సహజం. ఎందుకంటే కొత్త ఫోన్ కదా! కొత్త ఫోన్ అని కాకపోయినా సరికొత్త అత్యుత్తమ యాప్ ల గురించి వెతికే వారు కొంత మంది ఉంటారు. అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్. గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ మార్కెట్ లో లభించే అత్యుత్తమ ఉచిత యాప్ ల గురించి వినియోగదారులకు వివరించాలనే కంప్యూటర్ విజ్ఞానం ఈ ఆర్టికల్ ను అందిస్తుంది. ఆలస్యం ఎందుకు మరి ఇక చదివేయండి.

1.ఫోన్ బుక్

ఫోన్ బుక్ యాప్ అనేది మామూలు ఫోన్ బుక్ ల మాదిరిగా కాకుండా ఒక ఆకర్షణీయమైన ఇంటర్ పేస్ తోనూ మరెన్నో అద్భుతమైన ఫీచర్ ల తోనూ లభిస్తుంది.

2. లొకేల్

ప్రొఫైల్ లను ఆటోమాటిక్ గా హేండిల్ చేయడానికి ఈ యాప్ ను ఉపయోగిస్తారు. ఇందులోని ఆప్షన్ లు చాలా బాగుంటాయి.

3. పేస్ బుక్ ఫర్ ఆండ్రాయిడ్

ఇది చాలా అప్ డేటెడ్ గా ఉంటుంది. మీ స్టేటస్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకునే విధంగా ఒక చక్కని ఇంటర్ పేస్ ను కలిగి ఉంటుంది.

4. ఓపెరా మినీ

ఈ ఓపెరా మినీ ఆండ్రాయిడ్ యాప్ లలో వెబ్ బ్రౌజర్ కు ఒక చక్కని ప్రత్యామ్నాయం. ఇది చాలా సులువుగా ఉండడమే గాక ఫుల్ HTML ను లోడ్ చేసుకుంటుంది, చాలా వేగంగా బ్రౌజ్ చేస్తుంది.

5. పిక్ సే

మీ ఫోన్ లో ఫోటో లను ఎడిట్ చేసుకోవడానికీ, మోడిఫై చేసుకోవడానికి ఇది ఒక చక్కని సాధనం.

6. లైవ్ చాట్

ఈ లైవ్ చాట్ యాప్ ద్వారా ఒక సరికొత్త చాటింగ్ అనుభూతిని పొందవచ్చు. మీరు చాట్ చేయడం తో పాటు గ్రూప్ లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.

7. ట్విడ్ రాయిడ్

ఈ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ట్విట్టర్ యొక్క ఉచిత మరియు ప్రో వెర్షన్ మీకు లభిస్తుంది.ట్వీట్ లు పంపడం,చూడడం లాంటి ట్విట్టర్ కార్యకలాపాలన్నీ ఇక్కడ మీరు చేయవచ్చు.

8. ఇస్కూట్

మీ మొబైల్ లో స్కైప్ ను ఉంచుకోవాలి అనుకుంటే ఇది ఒక మంచి యాప్.ఇది కూడా ఒక ఉచిత యాపే.

9. షాప్ సేవీ

ఇది షాపింగ్ కు సంబందించిన యాప్.మీకు ఏదైనా వస్తువు కావాలి అనుకుంటే దాని పేరు ఇక్కడ టైపు చేస్తే చాలు దానిపై ఉన్న బెస్ట్ డీల్స్ అన్నీ క్షణాల్లో మీ కళ్ళముందు ఉంటాయి.

10. రింగ్ డ్రాయిడ్

   మీ ఫేవరిట్ సాంగ్ ల నుండి ఫ్రీ రింగ్ టోన్ లను క్రియేట్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి యాప్. మీ రింగ్ టోన్ లను ఈ యాప్ ను ఉపయోగించి మీరు రికార్డు కూడా చేయవచ్చు.

11. గూగుల్ వాయిస్

వెబ్ నుండి కాల్ లను చేసుకోవడానికీ, స్వీకరించడానికీ ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ లో మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకుని వెబ్ ద్వారా మీ నంబర్ నుండే మీ ఫోన్ కాల్ లను మీరు మేనేజ్ చేయవచ్చు. అంతేగాక మెసేజ్ లను కూడా పంపవచ్చు. అంతేగాక మీ కాల్ మరియు SMS సమాచారం అంతటినీ ఇది ఆన్ లైన్ లో స్టోర్ చేస్తుంది.

12. యాక్షన్ కంప్లీట్

ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక ఆర్గనైజర్ లాగా పనిచేస్తుంది.మీ టాస్క్ లనూ,అపాయింట్ మెంట్ లనూ చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది.ఇది మీకు ఎప్పటికప్పుడు రిమైండర్ లను కూడా ఇస్తుంది.

13. ఆస్ట్రిడ్

ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో  ఒక టాస్క్ మేనేజర్ లాగా పనిచేస్తుంది.

14. టూడూ

ఇది కూడా ఒక టాస్క్ మేనేజ్ మెంట్ యాప్, కాకపోతే కొంచెం మెరుగైన ఫీచర్ లను కలిగి ఉంటుంది.

15. మీబో IM

ఇది ఒక ఉచిత ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్. ఈ యాప్ AIM,MSN, యాహూ,మై స్పేస్ IM గూగుల్ టాక్,జాబర్,మరియు ICQ లను సపోర్ట్ చేస్తుంది.

16. ట్యూన్ వికి

ఆండ్రాయిడ్ యొక్క బిల్ట్ ఇన్ మీడియా ప్లేయర్ కు ఈ యాప్ ఒక ప్రత్యామ్నాయం. ఇది లిరిక్ స్క్రోల్ లాంటి అద్భుతమైన ఫీచర్ లను కలిగి ఉంటుంది.ఇందులో FM రేడియో మరియు యూ ట్యూబ్ వీడియో సెర్చ్ లను కూడా పొందవచ్చు

17. మెరిడియన్

ఇది మరొక మీడియా ప్లేయర్ యాప్. MP3, OGG,MP4, మరియు 3GPP ఫైల్ లను ఇది చక్కగా ప్లే చేస్తుంది.

18. ఫ్లిక్ స్టర్

సరికొత్త మూవీ లకు సంబందించిన సమగ్ర సమాచారం ఈ యాప్ లో ఉంటుంది. అంటే ఆయా మూవీ ల విడుదల తేదీ రివ్యూ లతో పాటు టికెట్ లు బుక్ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంటుంది.ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధియేటర్ లను GPS ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది.

19. పోస్ట్ బాట్

వర్డ్ ప్రెస్ బ్లాగ్ లలో టెక్స్ట్ మరియు ఇమేజ్ లను పోస్ట్ చేయడానికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది.

20. PF వాయిస్ మెయిల్

ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక విజువల్ వాయిస్ మెయిల్ ను అందిస్తుంది.మీరు ముందుగా ఒక ఫ్రీ ఎకౌంటు ను క్రియేట్ చేసుకుని దానిని మీ వాయిస్ మెయిల్ కు ఫార్వర్డ్ చేయాలి. ఆ తర్వాత నుండీ మీకు వచ్చే వాయిస్ మెయిల్ లన్నింటినీ ఈ యాప్ ద్వారా వినవచ్చు.

21. వీడియో ప్లేయర్

ఇది మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో వీడియో లను చూపిస్తుంది.అంతే. ఇంతకూ మించి ఏమీ ఉండదు. మామూలు వీడియో ప్లేయర్ లానే ఉంటుంది.

22. షేర్పా

ఇది కొత్త కొత్త ప్రదేశాలను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మీ దగ్గర లోని దర్శనీయ ప్రదేశాలు, రెస్టారెంట్ లూ, స్టోర్ లూ మొదలైనవి ఈ యాప్ ద్వారా కనుగొనవచ్చు.

23. GDocs

డాక్యుమెంట్ లను చూడడానికీ, ఎడిట్ చేయడానికీ ఈ GDoc అనే యాప్ ఉపయోగపడుతుంది.కేవలం టెక్స్ట్ లను మాత్రమే ఎడిట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

24. ఐ మీమ్ మొబైల్

ఐ మీమ్ మొబైల్ ప్లేయర్ ను ఉపయోగించి మీ ఫోన్ లో ఉన్న పాటలను వినవచ్చు.అంటే ఇది కూడా ఒక మల్టిమీడియా ప్లేయర్ లాంటిదే

25. పార్ లింగో

పార్ లింగో కూడా మనం ఇంతకూ ముందు చెప్పుకున్న మీబో యాప్ లాగే ఉంటుంది. దీనిద్వారా కూడా యాహూ మెసెంజర్,AIM,విండోస్ లైవ్ మెసెంజర్,పేస్ బుక్,మరియు ఇతర IM నెట్ వర్క్ లను యాక్సెస్ చేయవచ్చు.మీరు గ్రూప్ లను కూడా క్రియేట్ చేయవచ్చు.

 

జన రంజకమైన వార్తలు