ఆండ్రాయిడ్ ఓ ఓరియో వచ్చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో సరికొత్త మార్పులు తేవడానికి ఈ కొత్త వెర్షన్ ఎంతో ఉపయోగపడనుంది. గూగుల్ తాజాగా లాంఛ్ చేసిన ఈ నెక్ట్ జనరేషన్ టెక్నాలజీతో ఆండ్రాయిడ్ ఫోన్లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఆండ్రాయిడ్ 8.0 వెర్షన్‌నే గూగుల్ ఓరియోగా మార్చి విడుదల చేసింది. 1912 నుంచి యుఎస్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే ఓరియో కుకీ పేరునే ఈ కొత్త వెర్షన్‌కు పెట్టింది గూగుల్. మూడు ముక్కల్లో చెప్పాలంటే ఓరియో స్మార్టర్, ఫాస్టర్, పవర్ఫుల్. మరి ఇది అందిస్తున్న ప్రత్యేకమైన ఫీచర్లు ఏంటంటే..
పిక్చర్ ఇన్ పిక్చర్
ఓరియో ఓఎస్‌ను వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లు వీడియో, కెమెరాకు సంబంధించి ఒకేసారి రెండు పనులు చేయచ్చు. ప్రస్తుతం యూట్యూబ్ చూడటాలంటే ఒకసారి, వీడియో కాల్ చేయాలంటే ఒకసారి మనం ఫోన్‌ను వాడతాం. కానీ ఓరియోతో రెండూ ఒకేసారి చేసే అవకాశం ఉంది. అయితే యూజర్లు చేయాల్సిందల్లా హోమ్ బటన్‌ను ప్రెస్ చేసి యాక్టివ్ వీడియో షింక్స్ను సెలక్ట్ చేయాలి. శాంసంగ్ గెలాక్సీలో కూడా ఈ ఫీచర్ ఉంది.
పవర్ఫుల్ కాపీ పేస్ట్
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో బెటర్ కాపీ, పేస్ట్ ఫీచర్‌ను ఓరియో అందిస్తుంది. ఓరియో ఓఎస్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లో మనం ఏదైనా సెలక్ట్ చేయాలంటే కొంచెం ఎక్కువసేపు టాప్ చేసి పట్టుకుంటే చాలా కాపీ అయిపోతుంది. దాన్ని మనకు అవసరమైన చోట పేస్ట్ చేసుకోవచ్చు. సెంట్రల్ డేటాబేస్‌లో ఇది సేవ్ అవుతుంది.
ఫాస్టర్ స్పీడ్
ఓరియో వల్ల ఉన్న ప్రత్యేకమైన ఉపయోగం స్పీడ్. సాధారణంగా చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు ఒక దశకు వచ్చేసరికే నెమ్మదిస్తాయి. అయితే ఓరియో ఓఎస్‌తో ఈ ఇబ్బంది ఉండదు. డివైజ్ వేగంలో ఎలాంటి మార్పులు రావు. కన్సిస్టెంట్గా ఒకే స్పీడ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ నౌగట్ కంటే ఇది రెండురెట్లు స్పీడ్‌గా ఉంటుందట.
న్యూ యాప్ నోటిఫికేషన్స్
ఓరియోలో కొత్త రకం యాప్ నోటిఫికేషన్లను చూడొచ్చు. ప్రతి యాప్ ఐకాన్ మీద ఇది ఒక డాట్ లాగా కనిపిస్తుంది. ఆ డాట్‌ను ప్రెస్ చేస్తే చాలు రీసెంట్ యాక్టివిటీ మనకు తెలుస్తుంది. ఆండ్రాయిడ్‌లో ఇదో పెద్ద అప్డేట్.
ఆటోఫిల్
క్రోమ్ తరహాలోనే టెక్ట్ బాక్స్‌లు, ఫామ్స్ కోసం ఆటో ఫిల్ ఆప్షన్‌ను తెచ్చింది ఓరియో. దీని వల్ల యూజర్లకు సమయం ఆదా అవుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ నుంచి కూడా ఈ ఆటోఫిల్ ఫీచర్ సపోర్ట్ లభిస్తుంది.
బెటర్ బ్యాటరీ
ఓరియో ఓఎస్‌లో అన్నిటికంటే మించి మంచి బ్యాటరీ యుటిలైజేషన్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీస్ మీద రిస్ట్రిక్షన్లు పెడతాయి. ఒక వేళ మీకు తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో టాస్క్‌లు రన్ అవుతుంటే.. యూజర్లకు అలెర్ట్స్ వస్తాయి.
యాప్ సెక్యూరిటీ పెరుగుతుంది
గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనే ఆప్షన్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ అయ్యే యాప్‌లను ఎప్పటికప్పుడు స్కాన్ చేయడం కోసం ఈ ఆప్షన్ ఉపయోగడపడుతుంది.