యాప్..యాప్...యాప్. యాప్ స్టోర్ ఓపెన్ చేస్తే కొన్ని వేల యాప్ లు మనకు కనిపిస్తాయి. మనకు నచ్చిన యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నపుడు మన ఫోన్ లో ఉండే మెమరీ దానికి సపోర్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ సపోర్ట్ చేసినా ఎక్కువ యాప్ లు ఫోన్ లో ఉంటే బాటరీ డ్రెయిన్ అవుతుంది కాబట్టి ఆ ఆలోచన విరమించుకుంటాము. మరి మనకు నచ్చిన యాప్ లను పొందేదేలా? అనేక రకాలైన యాప్ లను ఒకేసారి మనఫోన్ లో చూడాలంటే ఏమైనా మార్గాలు ఉన్నాయా? మీ అవసరాలను మరియు అందుబాటుని బట్టి దాదాపు అన్ని రకాల యాప్ లు అందించే సేవలను ఒకే యాప్ లో చూపించే అగ్రిగేటర్ టూల్స్ లేదా యాప్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. ఎన్నిరకాలైన యాప్ ల నైనా ఒకే చోట చూసేయవచ్చు. ఆ అగ్రిగేటర్ యాప్ ల వివరాలు మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం అందిస్తున్నాం. క్యాబ్ ల సమస్యను తీర్చే యాప్ లు. వోలా, ఉబెర్ లాంటి యాప్ లు ఎన్నో మనకు క్యాబ్ ల కోసం అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో మనకు అందుబాటులో ప్రస్తుతం ఏఏ క్యాబ్ యొక్క సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేదెలా? దీనికోసం ప్రతీ యాప్ లోనూ వెతకవలసిన అవసరం లేదు. స్కూట్ యాప్, కాప్టో, ఓయ్ టాక్సీ లాంటి వాటిలో ఏదో ఒక యాప్ ను మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. మీరు ఉన్న ఏరియా లో ఎన్ని రకాల క్యాబ్ సర్వీస్ లు ఉన్నవీ, ప్రసుతం మీకు అందుబాటులో ఎన్ని సర్వీస్ లు ఉన్నవీ వాటి ఛార్జ్ ల వివరాలతో సహా మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాయి. ఈ యాప్ లను ఉపయోగించి వివిధ రకాల క్యాబ్ సర్వీస్ లు అందించే సేవలు మరియు అవి వసూలు చేసే ఛార్జ్ లను పోల్చి చూసి మనకు నచ్చిన సర్వీస్ ను ఎంచుకోవచ్చు. ఇవి కేవలం మూడు క్లిక్ ల లోనే మీకు క్యాబ్ లను బుక్ చేస్తాయి. స్కూట్ యాప్ ప్రస్తుతం ఉబర్, ఓలా, జగ్నూ, ఈజీ క్యాబ్ సవారీ, లతో ఒప్పందం కుదుర్చుకోగా , ఓలా ,ఉబర్, మేరు, టాక్సీ ఫోర్సర్, ఈజీ క్యాబ్స్ మరియుఒవ్ టాక్సీ లతో కాప్టో అగ్రిగేటర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆల్ ఇన్ వన్ యాప్స్ వీటిని సూపర్ యాప్ లు మరియు పర్సనల్ అసిస్టంట్ యాప్ లు అనికూడా అంటారు. ఎందుకంటే బిల్ పే మెంట్ ల దగ్గరనుండీ ఫుడ్ ఆర్దరింగ్, ఫోన్ రీచార్జ్, ఫ్లైట్ బుకింగ్, మూవీ బుకింగ్ మరియు క్యాబ్ బుకింగ్ ఇలా అన్ని రకాల సేవలనూ ఒకే యాప్ పై పొందవచ్చు. కొన్ని దేశాలలో ఇలాంటి యాప్ లు అనేకం అందుబాటులో ఉండగా మన దేశం లో మాత్రం హెల్ప్ చాట్ మరియు హాప్టిక్ లాంటి కొన్ని స్టార్ట్ అప్ లు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నాయి. హెల్ప్ చాట్ అనే యాప్ స్విజ్జి, జోమాటో, క్లియర్ ట్రిప్ లాంటి సంస్థలతో భాగస్వామి యై ఉంది. హాప్టిక్ కూడా దాదాపు అన్ని రకాల సేవలను అందించే స్టార్ట్ అప్ లతో టై అప్ అయి ఉంది. ఈ యాప్ లను భవిష్యత్ ఆశాకిరణాలు గా పరిశీలకులు భావిస్తున్నారు. వార్తలను అందించే యాప్ లు మనకు అనుక్షణం అప్ డేట్ లను అందించే అనేక రకాల న్యూస్ యాప్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయిత్యే వీటన్నింటినీ ఒకేసారి చూడలేం కదా! ఫ్లిప్ బోర్డు, ఇన్ షాట్స్, న్యూస్ 360 లాంటి యాప్ లు అన్నిరకాల న్యూస్ లనూ ఒకే చోట అందిస్తాయి. ప్రముఖ స్థానిక అంతర్జాతీయ న్యూస్ పేపర్లు మరియు న్యూస్ వెబ్ సైట్ లనుండి ఇవి సమాచారాన్ని సేకరిస్తాయి. వాటిని ఒక ఆసక్తికరమైన ఫార్మాట్ లో మీకు అందిస్తాయి. వీటిలో దాదాపు అన్ని యాప్ లు ఆండ్రాయిడ్, iOS, మరియు విండోస్ లలో లభిస్తున్నాయి. వీటిలో కొన్ని ఆఫ్ లైన్ రీడింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. షాపింగ్ అసిస్టంట్ యాప్ లు ప్రస్తుతం అత్యంత జనాదరణ ఉన్న యాప్ లలో ప్రముఖమైనవి షాపింగ్ యాప్ లు. ఈ కామర్సు రంగం తన విస్తృతిని పెంచుకున్నాక ఈ యాప్ ల సంఖ్య ఇంకా పెరిగి పోయింది. ఈ షాపింగ్ యాప్ లన్నింటినీ ఒకే చోట చూపించే యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. జంగ్లీ, మై స్మార్ట్ ప్రైస్ లాంటి యాప్ లు అమజాన్, ఈ బే, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, జబంగ్, మింత్రా, హోమ్ షాపీ లాంటి సుమారు 100 కి పైగా ఉన్న ఈ కామర్స్ వెబ్ సైట్ లలో లభించే సర్వీస్లన్నింటినీ తమ యాప్ ల ద్వారా ఇవి అందిస్తున్నాయి. వీటి ఇంటర్ పేస్ కూడా చాలా సులువుగా ఉంటుంది. సేవల యొక్క అగ్రిగేటర్ లు ఎలక్ట్రీషియన్, ప్లంబర్, తాపీ పని, కార్పెంటర్ లాంటి చేతివృత్తుల సర్వీస్ లకు సంబందించిన సంచారం ఆర్కిటెక్, డిజైనర్, CA, అడ్వొకేట్, ఫోటో గ్రాఫర్ లాంటి ప్రొఫెషనల్ సర్వీస్ లకు సంబందించిన సమాచారం ఇలా అన్నిరకాల సేవలకు సంబందించిన సంచారం అంతా అర్బన్ క్లాప్, లోకల్ ఓయ్, టాస్క్ బాబ్ లాంటి యాప్ లలో నిక్షిప్తమై ఉంటుంది. వీటిద్వారా మీ ఇంటికి లేదా ఆఫీస్ కి సంబందించిన అనేక రకాల సేవలను పొందవచ్చు. |