• తాజా వార్తలు
  •  

ప్ర‌పంచ‌పు తొలి స్మార్ట్ క‌నెక్టెడ్ వుయ‌ర‌బుల్ గుండీ బీమ్‌!

సాధార‌ణంగా ఎవ‌రైనా ప‌క్క‌వాళ్ల‌కు ఒక సందేశం గురించి చెప్పాలంటే ఏం చేస్తారు! ఏముంది ప్లే కార్డులు ప‌ట్టుకుంటారు. లేదా త‌మ ఉద్దేశాన్ని తెలిపేలా గ‌ట్టిగా నినాదాలు చేస్తారు. పెద్ద పెద్ద మాల్స్ అయితే అంద‌రికి తెలిసేలా సైన్ బోర్డులు, డిజిట‌ల్ తెర‌లు ఏర్పాటు చేస్తాయి. కానీ ఇప్పుడు న‌డుస్తోంది డిజిట‌ల్ యుగం. దానికి త‌గ్గ‌ట్టుగానే సాంకేతిక‌త‌లోనూ పెను మార్పులు వ‌స్తున్నాయి. అలా వ‌చ్చిందే బీమ్‌!! ఇది ప్ర‌పంచపు తొలి వుయ‌ర‌బుల్ గుండీగా (బ‌ట‌న్)గా పేరు సంపాదించింది.

దుస్తుల‌కు ధ‌రిస్తే చాలు...
ఏంటీ బీమ్‌! చాలామందికి క‌లిగే సందేహం ఇది. ఇదో ఎల‌క్ట్రానిక్ డివైజ్‌. కాక‌పోతే గుండీ (కాస్త పెద్ద‌ది) సైజులో ఉంటుంది. ఈ డివైజ్‌ను మ‌న ఛాతీ భాగంలోనో లేదా అంద‌రికి క‌నిపించేలా డిస్‌ప్లే చేస్తే చాలు.  మ‌న మ‌న‌సులోని ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌వారితో ఎలాంటి మాట‌ల్లేకుండానే పంచుకోవ‌డానికి ఈ  డిజిట‌ల్ గుండీ ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న నినాదాన్నో లేదా మ‌న కాన్సెప్ట్‌నో కంప్యూట‌ర్ ద్వారా దీనిలో అప్‌లోడ్ అయ్యేలా చేస్తే చాలు! ఇది జీఐఎఫ్ లేదా మెసేజ్‌ల రూపంలో అంద‌రికి అర్ధ‌మ‌య్యేలా చెబుతుంది. మ‌నం  ఏ నినాదం కావాల‌నుకుంటే దాన్ని మార్చుకోవ‌చ్చు. మ‌న భావాల‌ను ఎలాంటి మాటల్లేకుండానే అంద‌రికి అర్ధ‌మ‌య్యేలా చెప్పొచ్చు.

ఒక్క గుండీలో ఎన్ని చిత్రాలో..
చిన్న బ్యాట‌రీ... ఏఎంవో ఎల్ఈడీ స్క్రీన్ దీని ప్రత్యేక‌త‌. ప్ర‌పంచంలోనే తొలి స్మార్ట్ వుయ‌ర‌బుల్ డివైజ్‌గా పేరొందిన బీమ్‌లో  మంచి డిస్‌ప్లేతో పాటు యాంబియాంట్ సెన్సార్స్‌, మాగ్నిటిక్ క్లిప్‌, 24 గంట‌లు జీవంతో ఉండే బ్యాట‌రీ ఉన్నాయి. ఎక్కువ‌మంది జ‌నం గుమికూడే చోట సందేశాన్ని బ‌లంగా , స్ప‌ష్టంగా, సుల‌భంగా వెల్ల‌డించ‌డానికి బీమ్‌కు మించిన సాధ‌నం లేదు. ప్ర‌స్తుతం 99 డాలర్ల‌కు ఇది మార్కెట్లో ల‌భ్యం అవుతోంది. దీనిలో 3 డాల‌ర్ల‌ను ఛారిటీకి డొనేష‌న్ చేస్తోంది ఆ సంస్థ. బీమ్ అథెంటిక్ రాబోయే రోజుల్లో విప్ల‌వం సృష్టిస్తుంద‌ని, డిజిట‌ల్ టెక్నాల‌జీలో ఇదో కొత్త ఒర‌వ‌డికి  శ్రీ‌కారం చుడుతుంద‌ని ఆ సంస్థ న‌మ్ముతోంది.

జన రంజకమైన వార్తలు