• తాజా వార్తలు

ఫుల్ విజన్ డిస్‌ప్లేతో వ‌స్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వ‌స్తుందంటే దానిలో ఏదో ఒక ప్ర‌త్యేకత ఉండాలి. లేక‌పోతే దాని వైపు ఎవ‌రూ చూడ‌రు. అందుకే మాన్యుఫ్యాక్చ‌ర్లు త‌మ ఫోన్లో ఏదో ఒక ప్ర‌త్యేక‌మైన ఫీచర్‌తో త‌యారు చేస్తున్నారు.  అలాంటి కోవ‌కు చెందిన‌వే ఫుల్ విజన్ డిస్‌ప్లే.  కొత్త‌గా వ‌స్తున్న కొన్ని ఫోన్ల‌లో ఈ టెక్నాల‌జీ వాడుతున్నారు. ఇప్ప‌డు అలాంటి టెక్నాల‌జీతో వ‌చ్చిన కొన్ని ఫోన్లేమిటో చూద్దామా..

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ
మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ధ‌ర రూ.9999. అమెజాన్ ఇండియాలో అమ్ముతున్న ఈ ఫోన్ మెట‌ల్ బాడీ డిజైన్‌తో తయారు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 425 క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్ విత్ అడ్రినొ 308 గ్రాఫిక్స్ దీనిలో ఉన్నాయి. అదే కాక 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్నెల్ మెమ‌రీ దీనిలో మ‌రో ప్ర‌త్యేక‌త‌. దీన్ని ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పెండ్ చేసుకోవ‌చ్చు. 5.7 అంగుళాల హెచ్‌డీ క్వాలిటీ డిస్‌ప్లే దీనిలో ఉంది. 2900 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో పాటు 13 ఎంపీ రేర్  ఫేసింగ్ కెమ‌రా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా దీనిలో ఫీచ‌ర్లు. కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉంది.  

ఎల్‌జీ క్యూ 6
ఫుల్ విజ‌న్ డిస్‌ప్లేతో వ‌చ్చిన మ‌రో కెమెరా ఎల్‌జీ క్యూ 6.  స్నాప్‌డ్రాగ‌న్ 435 ఆక్టా కోర్ ప్రాసెస‌ర్, 505 ఆడ్రెనొ గ్రాఫిక్స్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ దీనిలో ఉన్నాయి. అంతేకాక 3 జీబీ ర్యామ్ సామ‌ర్థ్యం కూడా ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌. అన్నిటికంటే ముఖ్యంగా లేటెస్ట్ 7.1 నౌగ‌ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ఫోన్ ప‌రుగులెత్తుంది. 4జీ ఎల్‌టీఈ నెట్‌వ‌ర్క్ ఇది స‌పోర్ట్ చేస్తుంది. 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ కెపాసిటీ దీనిలో ఉంది. దీని ధ‌ర రూ.14,990

షార్ప్ ఆక్వోస్ ఎస్‌2
ప్ర‌స్తుతానికి ఇది చైనాలో ల‌భ్యం అవుతోంది. దీని ధ‌ర దాదాపు 23,715. 64 జీబీ సామ‌ర్థ్యం, 5.5 అంగుళాల డిస్‌ప్లేతో ప‌టు 2.5 డి క‌ర్వ్‌డ్ స్క్రీన్ దీనిలో ఉంది. 4జీబీ ర్యామ్‌, 660 ఆక్టా కోర్ ప్రాసెస‌ర్, 6 జీజీ ర్యామ్ దీనిలో ఉంది. 128 జీబీ స్టోరేజ్ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగ‌ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను దీనిలో ఉప‌యోగించారు. 2930 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఉంది. 


 

జన రంజకమైన వార్తలు