• తాజా వార్తలు

రాస్కో సాంబ‌... సెల్ఫీ త‌ర్వాత మ‌న నెక్స్ట్ పిచ్చి "బోతీ" నే

సెల్ఫీ అంటే బోర్ కొట్టేసిందా? ఈ ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం ఇచ్చేవాళ్లు పెరుగుతున్నారు. ఎందుకంటే టెక్నాల‌జీ ప్రపంచంలో ఏదీ శాశ్వ‌తం కాదు.  ఓర‌కంగా చెప్పాలంటే సెల్ఫీ ఎక్కువ కాల‌మే లైమ్‌లైట్‌లో ఉన్న‌ట్లు లెక్క‌. ఇప్పుడు సెల్ఫీ పోయి దాని స్థానంలో బోతీ (Bothie)  రాబోతోంది. అంటే మన నెక్స్ట్ పిచ్చి బోతీయే కాబోతోంది. ఈ బోతీ గురించి అంద‌రికంటే ముందు తెలుసుకోవాల‌నుకుంటే ఇది చ‌దివేయండి..

బోతీ అంటే
బోతీ అంటే మిమ్మ‌ల్ని మీరు తీసుకునే సెల్ఫీ కాదు. మిమ్మ‌ల్ని వేరేవాళ్లు తీసే youie కూడా కాదు. ఈ రెండింటి క‌లయికే బోతీ. ఇందులో మొత్తం మూడు కెమెరాలు ఒకేసారి ప‌ని చేస్తాయి. మిమ్మ‌ల్ని, మీ చుట్టుప‌క్క‌లున్న వాతావ‌రణం మొత్తాన్ని ఒకేసారి క్యాప్చ‌ర్ చేస్తాయి.  అంటే ఫ్రంట్ కెమెరాతో మిమ్మ‌ల్ని, రియ‌ర్ సైడ్‌లో ఉండే డ్యూయ‌ల్ కెమెరాల‌తో అవ‌త‌ల ఉన్న వాతావ‌ర‌ణాన్ని షూట్ చేయొచ్చు.  రియ‌ర్‌, ఫ్రంట్ కెమెరాల‌ను ఉపయోగించి ఒకేసారి ఫొటో, వీడియో రెండూ క్యాప్చ‌ర్ చేయొచ్చు.  అంతేకాదు ఇమేజ్ క్యాప్చ‌ర్ చేస్త‌నూ లైవ్ వీడియో కాల్ కూడా చేసుకోవ‌చ్చు.  అందుకే  బోతీ.. సెల్ఫీని మించిపోతుంద‌ని చెబుతున్నారు.  సెల్ఫీ స్టార్ట‌యిన కొత్త‌లో అదో పెద్ద ప్యాష‌న్‌. ఇప్ప‌టికీ కాస్త పెద్ద‌వాళ్లు, సెల‌బ్రిటీలో క‌న‌ప‌డగానే ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటాం. మంచి సీన‌రీ క‌న‌ప‌డ‌గానే ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి దానిముందు ఓ సెల్ఫీ లాగించేస్తాం. ఆ స్థాయి స‌క్సెస్‌ను బోతీ కూడా అందుకుంటుంద‌ని, త్వ‌ర‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ డిక్ష‌న‌రీలో కూడా దీనికి చోటు ద‌క్కుతుంద‌ని ఎక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నా. 


ఎప్ప‌టి నుంచి వ‌స్తుంది? 
ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్‌లో గ‌ట్టిగా పాగా వేయాల‌న్న ల‌క్ష్యంతో హెచ్ఎండీ  ప్రొడ‌క్ష‌న్‌లో మ‌ళ్లీ కాంపిటీష‌న్‌కు దిగిన నోకియా ఈ కొత్త ట్రెండ్‌కు శ్రీ‌కారం చుట్టింది.  రెండురోజుల క్రితం లాంచ్ చేసిన  ఫ్లాగ్‌షిప్ ఫోన్ నోకియా 8 తో  ఈఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. అక్టోబ‌ర్ నుంచి నోకియా 8 ఇండియాలో అందుబాటులోకి వ‌స్తుంది. ప్ర‌స్తుతానికి బోతీబులిటీస్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఇదొక్క‌టే. వాస్త‌వానికి  LG V20 ,  LG G6 ఫోన్ల‌లోనూ ఈ ఫీచ‌ర్ వ‌చ్చినా ఎల్జీ దీనికి ఏ పేరూ పెట్ట‌లేదు. నోకియా 8తో ఈ ఫీచ‌ర్‌ను తెస్తూనే దానికి బోతీ అని పేరు పెట్టి ట్రెండ్ సృష్టిస్తోంది.  ఈ ఫొటోలు, వీడియోల‌ను చూడ‌డానికి 5.3 ఇంచెస్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండ‌డం నోకియా 8కు మంచి ప్ల‌స్‌పాయింట్‌.  అంతేకాదు  క్వాలిటీ సౌండ్‌తో వీడియో రికార్డింగ్ చేయ‌డానికి హై డైన‌మిక్ రేంజ్ మైక్రోఫోన్స్ కూడా ఉన్నాయి. 

జన రంజకమైన వార్తలు