• తాజా వార్తలు

ల్యాప్‌టాప్ ఛార్జింగ్ క‌ష్టాల‌కు పుల్‌స్టాప్ పెట్టనున్న సేబ‌ర్‌

ప‌వ‌ర్ బ్యాంక్‌లు వ‌చ్చాక స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు  ఛార్జింగ్ క‌ష్టాలు త‌ప్పాయి.  ఛార్జ‌ర్లు మోసుకెళ్లే ప‌ని లేకుండా ఒక్క‌సారి ప‌వ‌ర్ బ్యాంక్‌ను ఫుల్ చార్జి చేస్తే సెల్‌ఫోన్‌ను రెండు, మూడు సార్లు ఛార్జి చేసుకునేంత బ్యాక‌ప్‌తో రావ‌డం యూజ‌ర్ల‌కు రిలీఫ్ ఇచ్చింది. గ‌డ్డాలు, మీసాలు గీసుకునే గ్రూమింగ్ కిట్‌లు, ట్రిమ్మ‌ర్లు కూడా ఇప్పుడు ప‌వ‌ర్ బ్యాంక్‌ల‌తో రీఛార్జి అయిపోతున్నాయి. కానీ ల్యాప్‌టాప్‌ల విష‌యానికి వ‌చ్చేసరికి ప‌వ‌ర్ బ్యాంక్‌లు హ్యాండ్సప్ అంటున్నాయి. ఇక‌పై ఆ బాధా ఉండ‌దు. మీ ల్యాప్టాప్‌ను ఒక్క‌సారి కాదు రెండు సార్లు ఛార్జి చేయ‌గ‌లిగేంత ప‌వ‌ర్ బ్యాక‌ప్‌తో సేబ‌ర్ ప‌వ‌ర్ బ్యాంక్ వ‌చ్చేసింది.

రెండుసార్లు ఛార్జింగ్
టెక్నాలజీ జెయింట్స్ టెస్లా, అమెజాన్ వంటి కంపెనీల్లో పనిచేసిన ఎగ్జిక్యూటివ్‌లు కొంద‌రు క‌లిసి ఈ ల్యాప్టాప్‌కు ప‌నికొచ్చే ప‌వ‌ర్ బ్యాంక్‌ను డిజైన్ చేశారు. ఈ ప‌వ‌ర్ బ్యాంక్ పేరు సేబ‌ర్‌. దీనిలో ఉండే 2.2 పౌండ్ల అల్ట్రా పోర్ట‌బుల్ లిథియం అయాన్ బ్యాట‌రీ 86 వాట్‌-హ‌వ‌ర్స్ ప‌వ‌ర్‌ను ఇస్తుంది. అంటే మ‌న సెల్‌ఫోన్ భాష‌లో చెప్పాలంటే ఇది 23,000 ఎంఏహెచ్ ప‌వ‌ర్‌కు స‌మానం. అంటే ఈ సేబ‌ర్ ప‌వ‌ర్ బ్యాంక్‌తో మీ రెగ్యుల‌ర్ ల్యాప్‌టాప్‌ను రెండు సార్లు ఛార్జి చేయొచ్చు. అదే స్మార్ట్‌ఫోన్‌ను అయితే 10సార్ల వ‌ర‌కు రీఛార్జి చేసుకోవ‌చ్చు.

డ్రోన్లు, డీఎస్ఎల్ ఆర్‌ల‌కూ యూజ్‌ఫుల్
అంతేకాదు డీఎస్ఎల్ ఆర్ కెమెరాలు, డ్రోన్ల‌ను కూడా దీనితో ప‌వ‌ర్ అప్ చేసుకోవ‌చ్చు.  దీనికి బ్లూ టూత్ కూడా ఉంది.  కంపేనియ‌న్ యాప్‌తో ఈ ప‌వ‌ర్ బ్యాంక్‌లో ఎంత ప‌వ‌ర్ మిగిలి ఉంది అని మీ స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవ‌చ్చు. ఓవ‌ర్‌హీటింగ్ స‌మ‌స్య వ‌స్తే ఇబ్బంది ప‌డ‌కుండా రెండు హార్డ్‌వేర్ గేట్లు ఇచ్చారు. సేబ‌ర్ ప‌వ‌ర్ బ్రిక్‌గా పిలిచే ఈ ప‌వ‌ర్ బ్యాంక్ ప్రీ ఆర్డ‌ర్ చేస్తే 199 డాల‌ర్ల‌కు (దాదాపు 13వేల రూపాయ‌ల‌కు) దొరుకుతుంది. ఇప్ప‌డు ఆర్డ‌ర్ చేస్తే న‌వంబ‌ర్ నుంచి డెలివ‌రీస్ ప్రారంభిస్తారు. ప్రీ ఆర్డ‌ర్ పిరియ‌డ్ ముగిసిన త‌ర్వాత అయితే దీని ఖ‌రీదు 299 డాల‌ర్లు (19వేల పైగా) .

జన రంజకమైన వార్తలు