• తాజా వార్తలు

డ్రైవర్ లేని రైళ్లకు సిద్దమవుతున్న ఢిల్లీ మెట్రో

డ్రైవరు రహిత రైళ్ల దిశగా ప్రయత్నాలు చేస్తున్న ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ అందులో వినియోగించే సాంకేతికతపైనా మంచి కసర్తే చేస్తోంది. వీటిని రూపొందించినా తొలి దశలో మాన్యువల్ గానే కొంతకాలం నడిపిస్తారు. ఆ తరువాత ఆలోపైలట్ మోడ్ లోకి పూర్తిస్థాయిలో్ మార్చిన తరువాత డ్రైవర్ లెస్ సర్వీసులు అందిస్తారు. అయితే... అలాంటప్పుడు పట్టాలు తప్పడం వంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఇందులో అడ్డంకులు తొలగించే పరికరాన్ని(అబ్ స్టకిల్ డిఫ్లెక్షన్ డివైస్-ఓడీడీ) ఉపయోగిస్తారు. దీన్నిట్రైను ముందుభాగంలో అమరిస్తే అది పట్టాలపై ఉన్న చిన్నచిన్న రాళ్లు, ఇతర అడ్డంకులు ఏమైనా ఉంటే వాటని తొలగించి ప్రమాదాలను నివారిస్తుంది.  అయితే... ఈ రైళ్లు పట్టాలకెక్కడానికి ఇంకా మరింత సమయం పట్టే సూచనలున్నాయి. ఇవి అదునాతన రైళ్లు కావడంతో వీటిలో సౌకర్యాలూ అదునాతనంగానే ఉండనున్నాయి. వైఫై, ఎల్ ఈడీ తెరలు ఉంటాయి. టెక్నికల్ గా బాగా అడ్వాన్సుగా ఉంటాయి.

కాగా జపాన్‌కు చెందిన తోషిబా కార్పొరేషన్‌ హైదరాబాద్‌లో రైల్వేల కోసం ఎలక్ట్రికల్‌ పరికరాలను తయారు చేయడానికి ఒక కొత్త ప్లాంట్‌ ను ఏర్పాటు చేస్తోంది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఒక కొత్త,  ప్రత్యేక రైల్వే వ్యవస్థ డివిజన్‌ను స్థాపించనున్నామని తొషిబా ట్రాన్స్మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ చెబుతోంది. రానున్న సంవత్సరాల్లో విద్యుత్తు పంపిణీ విపణిలో 20శాతం వాటాను దక్కించుకోవడమే ధ్యేయంగా విస్తరణ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఏప్రిల్‌ 2017 లో ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి ప్రారంభం కానుందని, డిమాండ్‌ ను బట్టి దీన్ని మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు.

కాగా రైల్వేల్లో టెక్నాలజీ విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక సంస్థలు భారతీయ రైల్వేలతో టై అఫ్ అవుతున్నాయి. మున్ముందు ప్రయాణికులకు ఇది వరం కానుంది.

 

జన రంజకమైన వార్తలు