• తాజా వార్తలు

డెంగీ, మలేరియాను డిటెక్ట్ చేయడానికి 10 రూపాయలకే ఈ డివైస్.. 

డెంగీ, మలేరియా.. ఈ జ్వరాలొస్తే ట్రీట్‌మెంట్  కంటే టెస్ట్‌ల‌కే  ఎక్కువ ఖర్చవుతుంది. పేద‌ల‌యితే ఈ ప‌రీక్షలకు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌లేక  మందుల షాపులో జ్వ‌రానికి అని గోళీలు అడిగి వేసుకుని నెట్టుకెళుతుంటారు.  పేద‌వారికి  ఈ ప‌రీక్ష‌ల  భారం తగ్గించాల‌ని  కోల్‌క‌తాలోని రెండు రీసెర్చ్ సెంటర్లు పరిశోధన చేపట్టాయి.  వాటి ఫ‌లితంగా ఓ పోర్టబుల్ డివైస్‌ను కనిపెట్టారు. దీంతో 10 రూపాయలకే మ‌లేరియా టెస్టు చేసుకోవచ్చు. 
డెంగీకి వాడొచ్చ‌ట‌
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసి ఈ పోర్ట‌బుల్ మ‌లేరియి డివైస్ కిట్‌ను తయారు చేశాయి.  దీన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లిచ్చు. ఈ లోకాస్ట్ మలేరియా డిటెక్ట్ సిస్టమ్‌ను కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే డెంగీని డిటెక్ట్ చేయడానికి కూడా వాడొచ్చ‌ని రీసెర్చ్ టీం చెబుతోంది. అదే జరిగితే దేశంలోని కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు చికిత్స భారం మ‌రింత త‌గ్గించిన‌వాళ్ల‌వుతారు. 
 ఈ కిట్ ఎలా పనిచేస్తుంది? 
మొబైల్ ఫోన్ కెమెరా ఎటాచ్ చేసిన పేపర్ మైక్రోస్కోప్ ఈ కిట్ లో మెయిన్ ఆపరేటస్. దీని కాస్ట్ 80 రూపాయలు అవుతుంది. పేషంట్ నుంచి ఒక్క రక్తపు బొట్టు తీసుకుని కొన్ని కెమికల్స్‌తో టెస్ట్ చేస్తారు.. ఈ డేటాను  సెంట్రల్ సర్వర్‌కు పంపి మలేరియా ఉందో లేదో ఐడెంటిఫై చేస్తారు. రిజల్ట్‌ను టెస్ట్ చేయించుకున్న వ్యక్తికి రిమోట్ సర్వర్ వెంటనే పంపిస్తుంది. దాన్ని బట్టి మలేరియా ఉంటే తగిన ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు