సాధారణంగా మనం ఏదైనా సమయానికి నిద్ర లేవాలంటే ఏం చేస్తాం వెంటనే స్మార్ట్‌ఫోన్‌లో అలారం పెట్టుకుంటాం. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ పక్కనే ఉంటది కాబట్టి మనం వెంటనే లేవొచ్చన్న ఆలోచనతో. అయితే ఇప్పుడు ఇలా నిద్ర లేవడం కోసం అలారం అవసరం లేదు. దీనికో కొత్త యాప్ వచ్చేసింది దాని పేరు గలారం. ఇదో గ్రూప్ అలారం. ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాదు గ్రూప్ ద్వారా కూడ పని చేస్తుంది. మీరు అలారం ఆఫ్ చేసినా..మీ స్నేహితులు ఈ అలారం సెట్ చేయచ్చు.
ఎలా పని చేస్తుంది..
గలారం పని తీరు చాలా భిన్నంగా ఉంటుంది. దీనిలో అలారం, గ్రూప్స్, కాంటాక్ట్స్ అనే యాప్‌లు ఉంటాయి. దీనిలో మీరు ఎప్పుడు అలారం సెట్ చేసుకోవాలి. ఏ కాంటాక్ట్స్‌కు గలారం సెట్ చేయాలి. ఏ కాంటాక్ట్‌లకు యూజ్ చేయాలి. గ్రూప్ అలారమ్స్ ఎలా సెట్ చేయాలి లాంటి ఆప్షన్లన్నీ గలారంలో ఉటాయి. ఈ గలారం యాప్‌ను ఉపయోగించుకోవాలంటే మీరు ముందుగా మీ పోన్ నంబర్, కాంటాక్ట్స్ ఈ యాప్‌కు షేర్ చేయాలి. అయితే కాంటాక్ట్స్ షేర్ చేయడం అనే ఆప్షన్ ఒక్కటే వినియోగదారులకు కాస్త ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే తమ ప్రైవసీకి ఎక్కడ భంగం కలుగుతుందనేది వారి భయం.
ఎందుకంటే..
గలారం వల్ల ప్రధాన ఉపయోగం ఏంటంటే మీ తల్లిదండ్రులు సరైన సమయానికి మందులు వేసుకుంటున్నారా లేదా అని చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సరైన సమయంలో మందులు వేసుకోవడానికి మనం రిమైండర్‌గా పెట్టుకోవాలి. ఎవరైనా మీకు కాల్ చేసినప్పుడు ట్రస్ట్డ్ కాంటాక్ట్స్ ఎవరైనా కాల్ చేసినప్పడు మీరు మిస్ అయితే మిమ్మల్ని అలెర్ట్ చేయడం కోసం ఈ గలారం ఒక రిమైండర్‌గా ఉపయోగపడుతుంది. మీరు మీటింగ్‌లో ఉన్నప్పడో లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడో ఏదైనా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయడం కోసం ఈ గలారంను ఉపయోగించుకోవచ్చు. ఇదో ఫ్రీ యాప్. ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ గలారం ద్వారా మీరు యాడ్ చేసుకున్న కాంటాక్ట్‌లతో చాట్ చేసుకోవచ్చు.