• తాజా వార్తలు
  •  

జియో 3 గంటల అన్ లిమిటెడ్ ఉచిత ఇంటర్ నెట్ మతలబు ఏమిటి?

జియో.జియో..జియో... దీనిగురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే జియో గురించి సాంకేతిక సాహిత్యం లో పుంఖానుపుంఖాలుగా అనేక రకాల వ్యాసాలు వచ్చాయి. మన కంప్యూటర్ విజ్ఞానం కూడా చాలా విస్తృత మైన సమాచారం ప్రకటిoచింది. ప్రస్తుతం 5- 6 కోట్ల మంది వినియోగదారులను కలిగిఉన్న జియో ఈ సీజన్ ముగిసేలోపు దానిని 10 కోట్లకు పెంచుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగం గానే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ గురించి మీలో కొందరికి తెలిసే ఉంటుంది. ఈ ఆఫర్ కు కొన్ని పరిమితులు ఉండడంతో ఎంతో ఆశతో జియో సిమ్ ను తీసుకున్న వినియోగదారులు ఒకింత నిరాశకు గురవుతున్నారు.అయితే దీనితో పాటు మరో అదిరిపోయే ఆఫర్ ను గురించిన అధికారిక సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో ఇవ్వనున్నాం. దీనిగురించి మీకు తెలిసియుండకపోవచ్చు. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ గురించి తెలుసుకుని ఆ తర్వాత కొత్త ఆఫర్ ను చూద్దాం.

హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్:

  1. డైలీ ఫెయిర్ యూసేజ్ పాలసీ ( FUP ) లిమిట్ ప్రకారం రోజుకి 1 GB వినియోగం వరకూ హై స్పీడ్ ఇంటర్ నెట్ ఉంటుంది, అది దాటినా తర్వాత స్పీడ్ 128 kbps కు తగ్గించబడుతుంది.
  2. ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమిత వీడియో కాల్ లు మరియు వాయిస్ కాల్ లు
  3. దేశం లోని ఏ నెంబర్ కైనా అపరిమిత SMS
  4. జియో టీవీ, జియో ఆన్ డిమాండ్, జియో మ్యూజిక్ లాంటి జియో ప్రీమియం యాప్ లు ఈ ఆఫర్ లో ఉచితంగా యాక్సెస్ చేయబడతాయి.

ఇప్పుడు 3 గంటల అపరిమిత ఇంటర్ నెట్ ఆఫర్ గురించి తెలుసుకుందాం

ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తో పాటు వినియోగదారులు ప్రతీ రోజు 3 గంటల హై స్పీడ్ ఉచిత ఇంటర్ నెట్ ను పొందవచ్చని జియో ప్రకటించింది. దీనిగురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తో చాలా మంది విసుగు తో ఉన్నారనే విషయం అందరికీ తెలిసినదే. ఎందుకంటే ఇందులో జియో FUP లిమిట్ ను రోజుకి 1 GB గా ఉంచింది. అది చాలా మందికి సరిపోదు. కాబట్టి ఇంతకంటే మంచి ఆఫర్ రిలయన్స్ నుండి వస్తే బాగుంటుంది కదా అని అనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే.

       ఏ ఏ సమయాలలో దీనిని వాడవచ్చు?

      రిలయన్స్ జియో పూర్తీ ఉచిత హై స్పీడ్ ఇంటర్ నెట్ ను రోజుకి 3 గంటల పాటు అందిస్తుంది. కాకపోతే ఈ ఆఫర్ ప్రతీ రోజు ఉదయం 2 గంటల నుండీ 5 గంటల మధ్య లో అందుబాటులో ఉంటుంది. ( 2 AM- 5 AM ). ఈ మూడు గంటల పాటు మీరు ఉపయోగించిన హై స్పీడ్ డేటా మీ రోజువారీ 1 GB డేటా నుండి కట్ అవ్వదు. ఇది పూర్తి ఉచితంగా లభిస్తుంది. ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే 2 AM- 5 AM మధ్యలోనే ఈ ఆఫర్ ను ఉపయోగించాలి. ఇక్కడ వినియోగదారులకు మేము ఇచ్చే సలహా ఏమిటంటే ఈ ఆఫర్ ను ఉపయోగించేపుడు ఉదయం 2.05 AM కు మొదలు పెట్టండి మరియు 4.50 AM కు సర్ఫింగ్ ఆపివేయండి. అంటే ఒక పదినిమిషాలు ముందువెనక అన్నమాట. దీనివలన మీ డేటా సేఫ్ సైడ్ ఉన్నట్లు అవుతుంది. టైం కొంచెం అటుఇటు అయినా సరే మీరు ఉపయోగించిన డేటా మీ రోజువారీ డేటా నుండి మినహాయించే అవకాశం ఉన్నందున టైం విషయం లో జాగ్రత్త గా ఉంటేనే మంచిది.

ఈ ఆఫర్ అధికరికమేనా?

ఖచ్చితంగా. ఇది అధికారిక ఆఫరే. ఈ ఆఫర్ ను ఉపయోగించడానికి ప్రత్యెక ట్రిక్ లు ఏమీ లేవు. కేవలం సమయం గుర్తు ఉంచుకుంటే చాలు.

ఈ సమయం లో హై స్పీడ్ ఇంటర్ నెట్ లభిస్తుందా?

అవును ఖచ్చితంగా హై స్పీడ్ అన్ లిమిటెడ్ ఇంటర్ నెట్ ను 3 గంటల పాటు పూర్తీ ఉచితంగా పొందుతారు. దీనిపై ఎటువంటి పరిమితులు ఉండవు. కాకపోతే డేటా స్పీడ్ అనేది మీరు ఉంటున్న ప్రదేశం మరియు నెట్ వర్క్ లపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది.   

"

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు