• తాజా వార్తలు

ఇంట్లో వండిన ఆహారాన్ని ఇళ్లకు హోం డెలివరీ చేస్తున్న 5 యాప్స్

నం ఇంటికి దూరంగా ఉన్నపుడు ఇంటి భోజనాన్ని మిస్ అవుతాము. అది సర్వ సాధారణం. బయట ఎక్కడ తిన్నా ఇంట్లో వండిన భోజనం తిన్న రుచే వేరు. ఫైవ్ స్టార్ హోటల్ లో భోజనం చేసినా ఇంటి భోజనానికి సాటిరాదు అనేది అందరూ అనుకునే మాట. అయితే కొన్ని హోటల్ లు పూర్తి ఇంటి తరహా భోజనాన్ని అందిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఇంటికి దూరంగా ఉన్నపుడు అలాంటి హోటల్ లలో భోజనం చేస్తే కొంతలోకొంత ఉపశమనం గా ఉంటుంది. మరి అవి ఎక్కడ ఉన్నాయో తెలిసేదెలా? ఇకపై దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంటి తరహా భోజనం అందించే హోటల్ లు ఆ సర్వీస్ లు ఎక్కడ ఉన్నాయో తెలిపి మనకు పూర్తి ఇంటి తరహా భోజన అనుభూతిని అందించేందుకు సరికొత్త యాప్ లు వచ్చేసాయి. అయితే ఇవి ఇండియా లోని కొన్ని నగరాలకే ప్రస్తుతం పరిమితం అయి ఉన్నాయి. ఈ సారి ఆ నగరాలకు మీరు వెళ్ళినపుడు ఈ యాప్ ల ద్వారా ఒక్కసారి  భోజనం ఆర్డర్ ఇచ్చి ఆ అనుభూతిని సొంతం చేసుకోండి. ఆ యాప్ ల వివరాలు చూద్దాం.

మిలియన్ కిచెన్

ఇది ఆండ్రాయిడ్ లో లభించే ఒక ఉచిత యాప్. ఇది ఇంటితరహా వంటగాళ్ళ చే వండబడిన ఆరోగ్యకరమైన పూర్తి హోమ్ మేడ్ ఫుడ్ ను మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఇది దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరం లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రతీరోజూ ఉదయం 10 గంటలనుండీ మీ మెనూ ని మీరు ఆర్డర్ చేయవచ్చు. ఈ మెనూ లో రాజ్మా చావల్, పావ్ భాజీ లాంటి వివిధరకాల వంటకాలు కూడా ఉంటాయి. ఇక్కడ భోజన పదార్థాల ధర రూ 40- 220 స్థాయిలో ఉంటుంది. మనం తీసుకునే పదార్థాన్ని బట్టి ఒక్కోసారి ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇది స్వతంత్రం గా వ్యాపారం చేసేవారికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే సెంట్రల్ ఢిల్లీ లోని కొన్ని పిన్ కోడ్ లను గుర్తించడం లో ఈ యాప్ విఫలమైంది.

టిఫిన్ టో

ఇది కూడా ఒక ఉచిత ఆండ్రాయిడ్ యాప్. ఇది రాజస్తాన్ రాష్ట్రం లోని కోట నగరం లో కోచింగ్ సెంటర్ లలోఉంటున్నయువ విద్యార్థులకు హోమ్ మేడ్ భోజనాన్ని అందిస్తుంది. లంచ్ మరియు డిన్నర్ కి సంబంధించి వివిధ రకాల వంటకాల తో కూడిన మెనూ మీకు ఈ యాప్ లో కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది మాంసాహారాన్ని అందించడం లేదు. కానీ రైస్, మసలా రైస్, జీరా రైస్, వెజ్ పులావ్ లాంటవివిధరకాల రైస్ ఐటమ్స్ ఇక్కడ లభిస్త్గాయి. అలాగే అన్నిరకాల టిఫిన్ లు కూడా ఈ యాప్ సర్వ్ చేస్తుంది. ధర రూ 80/- నుండీ రూ 110/- లలో లభిస్తుంది. వచ్చే కొద్ది నెలల్లో ఇండోర్ మరియు జైపూర్ నగరాలలో కూడా దీనిని విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేగాక iOS యాప్ కూడా సిద్దం అవుతూ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ యాప్ కు కొన్ని మెరుగులు దిద్దవలసిన అవసరం ఉంది.

వాట్స్ కుకింగ్

ఇది కూడా ఒక ఉచిత ఆండ్రాయిడ్ యాప్. ఇది బెంగళూరు, భోపాల్, ముంబై, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా లాంటి దేశంలోని 14 ప్రధాన నగరాలలో తన సేవలను అందిస్తుంది. మీ సమీపం లోని హోమ్ మేడ్ ఫుడ్ యొక్క వివరాలను మీకు అందిస్తుంది.ఇందులో ఉండే ఆప్షన్ లు ఆ విధంగా ఉంటాయి. ఇందులో మీరు మీ లొకేషన్ ఎంటర్ చేయాలి లేదా GPS ను ఆన్ చేస్తే ఆటోమాటిక్ గా మీ లొకేషన్ ను ఐడెంటిఫై చేస్తుంది. ఆ తర్వాత మీ సమీపంలో ఉన్న హోమ్ మేడ్ హోటల్ లు మరియు అందులో లభించే భోజన పదార్థాల వివరాలు మీకు కనిపిస్తాయి. అక్కడ మీకు కావలసిన దానిని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇస్తే చాలు, మీకు ఆ పదార్థాలను పంపిస్తారు. ఈ యాప్ కు మరొక ప్రధాన ఆకర్షణ హోమ్ షాపీ. మన ఇంట్లోకి అవసరమైన పరికరాలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కు సంబందించిన గృహోపకరణాలు కూడా షాపింగ్ చేయవచ్చు. దీని ఇంటర్ పేస్ చాలా సులువుగా ఉండడమే గాకా దేశం లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇది అందుబాటులో ఉంది. ఇందులో వివిధ రకాల భోజనాలు అందుబాటులో ఉన్నప్పటికీ లంచ్ కు మాత్రం థాలి ని అందిస్తుంది. ఇందులో రైస్, పప్పు, చపాతీ మరియు ఒక వెజ్ కర్రీ ఉంటాయి. దీని ధర హైదరాబాద్ లో రూ 40/-, భోపాల్ లో రూ 80/- బెంగళూర్ లో రూ 160/- లు ఉంటుంది.

గ్రబ్ ఎట్

ఈ యాప్ కూడా ఆండ్రాయిడ్ లో ఉచితం గానే లభిస్తుంది. ఇది భోజనాన్ని, భోజన పదార్థాలను చాట్ ద్వారా అందిస్తుంది.  సాధారణంగా అన్ని యాప్ లలో ఆర్డర్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ ఇందులో అలా కాకుండా డైరెక్ట్ యాప్ నుండే కొనే అవకాశం కల్పిస్తుంది. మీకు కావలసిన 10 రకాల ఫుడ్ ఐటమ్స్ ను చాట్ ద్వారా ఆర్డర్ చేసే షౌట్ 2 కుక్ అనే ఆప్షన్ ఇది అందిస్తుంది.

ఆర్గానిక్ టిఫిన్ సర్వీసెస్

ఈ యాప్ కూడా ఆండ్రాయిడ్ లో ఉచితం గానే లభిస్తుంది. ఇది ఫైవ్ స్టార్ హోటల్ లో భోజనం చేసిన అనుభూతిని అందిస్తుంది. విషపూరిత రసాయనాలు, క్రిమిసంహారక మందులు వాడని కూరగాయల ద్వారా వండిన ఆహారాన్ని ఇది అందిస్తుంది. ఇది కేవలమ శాఖాహార భోజనాన్ని మాత్రమే అందిస్తుంది. దీని యూజర్ లు నెలవారీ టిఫిన్ డెలివరీ ఆప్షన్ ను ఎంచుకోవాలి. సింపుల్ మీల్ యొక్క నెలవారీ ధర రూ 1,320/- లు ఉంటుంది. సోమవారం నుండి శుక్రవారం వరకూ లంచ్ సౌకర్యాన్ని ఇది అందిస్తుంది. దీని ఇంటర్ పేస్ ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటుంది. ప్రస్తుతం ఇది ముంబై లో మాత్రమే అందుబాటులో ఉంది. 

 

జన రంజకమైన వార్తలు