• తాజా వార్తలు
  •  

రోజుకు 2 రూపాయిల‌కే ఇంట‌ర్నెట్ ఇచ్చే వైఫై డ‌బ్బా!

కాయిన్ బాక్స్‌లు! వీటి గురించి తెలియ‌నివాళ్లు ఉండ‌రు. భార‌త్‌లో టెలిఫోన్ విప్ల‌వం వ‌చ్చిన త‌ర్వాత కాయిన్ బాక్స్‌లు రాజ్య‌మేలాయి. ఎక్క‌డ చూసినా ఏ ఊరిలో చూసినా కాయిన్‌బాక్స్‌ల‌తో మాట్లాడేవాళ్లే క‌నిపించేవాళ్లు. సెల్‌ఫోన్ అనూహ్యంగా తెర‌మీద‌కు రావ‌డంతో కాయిన్‌బాక్స్‌లు నెమ్మ‌దిగా క‌నుమ‌రుగ‌య్యాయి. ఇప్పుడు అంద‌రి చేతుల్లోనూ స్మార్టుఫోన్లే. అంతేకాదు వైఫై రావ‌డంతో భార‌త్ వైఫై దేశంగా అయిపోయింది. కానీ ఇప్పుడు వైఫై కూడా కాయిన్ బాక్స్‌ల మాదిరిగానే అంద‌రికి అందుబాటులోకి రానుంది. అదే వైఫై డ‌బ్బా. రూ.2 కే  వైఫై అందించే వైఫై డ‌బ్బాలు అందుబాటులోకి వ‌చ్చాయి. అవేంటో చూద్దాం...

రూ.20కే 1 జీబీ డేటా! 

వైఫై డ‌బ్బా.. విన‌డానికి విచిత్రంగా ఉన్నా.. ఇప్పుడు బెంగ‌ళూరులో చాలా ప్రాంతాల్లో దీని సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. రిల‌య‌న్స్ జియో త‌న ఉచిత ఇంట‌ర్నెట్‌తో అంద‌ర్ని ఆకట్టుకున్న నేప‌థ్యంలో వైఫై డ‌బ్బా సేవ‌ల‌ను మ‌రింత మందిని ఆక‌ర్షిస్తున్నాయి. కేవ‌లం రూ.20 చెల్లిస్తే చాలు రోజుకు 1 జీబీ డేటాను వాడుకునే అవ‌కాశం ఉంటుంది. నిజానికి సెల్‌ఫోన్ నెట్‌వ‌ర్క్స్‌కి వైఫై డబ్బాల‌కు పోలిక పెట్ట‌డం స‌రికాదు. నిజానికి వైఫై డ‌బ్బాలు కూడా బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడ‌ర్ల లాంటివే. కాక‌పోతే వాటికి వైఫై డ‌బ్బాకు ఉన్న తేడా ఏంటంటే త‌క్కువ ఖ‌ర్చుతో మ‌నం ఇంట‌ర్నెట్‌ను వాడుకోవ‌డం.

ఎలా ప‌ని చేస్తుందంటే..
వైఫై డ‌బ్బా ప‌ని తీరు చాలా సింపుల్‌గా ఉంటుంది. రూ.2 పే చేస్తే చాలు. మీ నంబ‌ర్ ద్వారా మీ ఫోన్‌కు వైఫై క‌నెక్ట్ అయిపోతుంది. సిటీలో ఎక్క‌డైనా ఈ ఇంట‌ర్నెట్‌ను మీరు వాడుకునే అవ‌కాశం ఉంది. ఇది ఒక ర‌కంగా మార్కెట్ సూత్రం ప్ర‌కారం వ‌చ్చిన ఐడియానే. 1990ల్లో ఒక కంపెనీ త‌న ప్రాడ‌క్టుల‌ను 100 ఎంఎల్ బాటిల్స్‌లో విడుద‌ల చేసింది. అయితే వాటిని కొనేందుకు ఎవ‌రూ అంత‌గా ఇష్ట‌ప‌డ‌లేదు. ఇలా లాభం లేద‌ని చెప్పి సాచెట్స్ రూపంలో మార్కెట్లోకి వ‌దిలింది. ఒక్కో సాచెట్ ధ‌ర కేవ‌లం రూ.1 మాత్ర‌మే అని పెట్టింది. ఇంకేముందు జ‌నం విర‌గ‌బ‌డ్డారు. వైఫై డ‌బ్బాలు కూడా అదే కోవ‌కు చెందుతాయి. త‌క్కువ ధ‌ర‌లో అందరికి అందుబాటులో ఇంట‌ర్నెట్‌ను అందించ‌డ‌మే ఈ డబ్బాల ప్ర‌త్యేక‌త‌. 

జన రంజకమైన వార్తలు