• తాజా వార్తలు

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9ను అన్‌లాక్ చేయ‌డం ఎలా?

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9.. ఈ ఫోన్ కోసం క‌స్ట‌మ‌ర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి ఈ ఫోన్ ఎలా ఉండ‌బోతోంది?  త్వ‌ర‌లో రాబోతున్న ఈ ఫోన్ లాంఛింగ్‌కు ముందే ఫొటోలు, వీడియోల రూపంలో లీక్ అయింది. నిజానికి చెప్పాలంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8కు గెలాక్సీ ఎస్‌9కు పెద్ద తేడా ఏమి లేదు. రీడిజైన్ కూడా కాలేదు. అలా అని శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9ను తీసేయాల్సిన ప‌ని లేదు. దీనిలో ఉన్న న్యూ ఆల్ట్రా చిప్ ఫాస్ట్ చిప్ సెట్ డివైజ్ వేగాన్ని గ‌ణ‌నీయంగా పెంచుతుంద‌ని ఈ శాంసంగ్ చెబుతోంది.  అయితే ఎస్‌9 ఫోన్‌ను అన్‌లాక్ చేయ‌డంపైనే అంద‌రి దృష్టి నిలిచింది. మ‌రి ఈ డివైజ్‌ను ఎలా అన్‌లాక్ చేయాలో  చూద్దామా...

హ్యుమ‌న్ ఐ
గెలాక్సీ ఎస్‌9లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ దాని కెమెరానే. మ‌నిషి క‌న్ను మాదిరిగానే ఈ కెమెరా అన్ని దిక్కులూ క‌వ‌ర్ చేస్తూ ఫొటోలు తీయ‌గ‌ల‌ద‌ని శాంసంగ్ చెబుతోంది. చీక‌టిలో సైతం మంచి క్లారిటీతో ఫొటోలు తీయ‌డ‌మే దీని ప్ర‌త్యేక‌త‌. అంతే కాదు దీనిలో ఇంకా చాలా మంచి ఫీచ‌ర్లు ఉన్నాయి. సాధారంణ‌గా అన్ని గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ల‌లో దాదాపు కొన్ని ఫీచ‌ర్లు కామ‌న్‌గా ఫిక్స్ అయి ఉంటాయి. అయితే ఎస్‌9 ఫోన్ మాత్రం ఇందుకు భిన్నం. కెమెరా మొద‌లుకొని డిజైన్ వ‌ర‌కు త‌న ప్ర‌త్యేక‌త చాటుతోంది. అంతేకాదు ధర విష‌యంలోనూ ఇది ముందే. అందుకే సేల్ ఆఫ‌ర్ ఉన్న‌ప్పుడు దీన్ని త‌క్కువ ధ‌ర‌కు ద‌క్కించుకోవ‌చ్చు. అంతేకాదు రెండేళ్ల కాలానికి శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9ని త‌క్కువ ధ‌ర‌కే పొందే అవ‌కాశం ఉంది. సాధార‌ణంగా కాంట్రాక్ట్ ఫోన్లు నెట్‌వ‌ర్క్‌తో లాక్డ్‌గా వ‌స్తాయి. వేరే నెట్‌వ‌ర్క్ సిమ్ కార్డులు వీటిలో ప‌ని చేయ‌వు. ప్ర‌స్తుతానికి ఇదే ఇష్యూగా ఉంది ఈ ఫోన్లో. 

అన్‌లాక్ చేయాలంటే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9ను అన్‌లాక్ చేయ‌డానికి కొన్ని ప‌ద్ధ‌తులు ఉన్నాయి. కోడ్‌ను ఉప‌యోగించ‌డం ద్వారా, ఇత‌ర నెట్‌వ‌ర్క్స్‌లో ఉపయోగించ‌డం ద్వారా, ముందుంగా మ‌నం ఒక అన్‌లాక్ కోడ్ ప్రొవైడ‌ర్‌ను వెత‌కాలి. ఆ త‌ర్వాత మీ హ్యాండ్ సెట్‌లో అన్‌లాక్ ప్రాసెస్ మొద‌లుపెట్టొచ్చు.దీని వల్ల మీ సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్‌లో ఎలాంటి మార్పులు చేయ‌క్క‌ర్లేదు. అంతేకాదు వారెంటీ కూడా కోల్పోవాల్సిన అవ‌స‌రం లేదు.

అన్‌లాక్ కోడ్ ప్రొవైడ‌ర్‌
శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ఫోన్‌ను అన్‌లాక్ చేయ‌డానికి ముందుంగా న‌మ్మ‌క‌మైన అన్‌లాక్ కోడ్ ప్రొవైడ‌ర్‌ను దొర‌క‌బుచ్చుకోవాలి. మీరు ఆన్‌లైన్‌లో లేదా లోకల్‌గా కూడా ఈ అన్‌లాక్ కోడ్ ప్రొవైడ‌ర్ దొర‌కుతుంది. ఒక‌సారి మీకు ప్రొవైడ‌ర్ దొరికిన త‌ర్వాత ఈ ప్రొవైడ‌ర్ గురించిన రివ్యూలు కూడా క్షుణ్నంగా చ‌ద‌వాలి. ఉదాహ‌ర‌ణ‌కు  అన్‌లాక్‌యూనిట్‌.కామ్ లాంటి సైట్లు లాక్డ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9కి నెట్‌వ‌ర్క్ అన్‌లాక్ కోడ్‌ను అందిస్తున్నాయి. అన్ లాక్ ప్రొవైడ‌ర్ కోడ్ దొరికిన త‌ర్వాత దాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇవ్వాలి. 

1. అన్‌లాక్ ప్రొవైడ‌ర్ కోడ్‌ను ఓపెన్ చేసిన త‌ర్వాత మీరు ఫోన్‌ను ఎక్క‌డ వాడుతున్నా ఆ దేశం పేరును ఎంట‌ర్ చేయాలి. ఆ డివైజ్‌లో ఉన్న‌ నెట్‌వ‌ర్క్‌ను కూడా మెన్ష‌న్ చేయాలి. 

2. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ఈఎంఈఐ నంబ‌ర్ కోసం స్టార్ యాష్ 06 యాష్ డ‌య‌ల్ చేసి తెలుసుకోవాలి

3. అన్‌లాక్ కోడ్‌ను సెండ్ చేయ‌డానికి ఒక వ్యాలీడ్ ఈమెయిల్ అడ్ర‌స్ ఇవ్వాలి. ఈ వివ‌రాల‌న్నీ ఇచ్చిన త‌ర్వాత అన్‌లాక్ ప్రాసెస్ మొద‌లువుతుంది. మీ ఇన్‌బాక్స్‌కు అన్‌లాక్ కోడ్‌లు వ‌స్తాయి. 

4. ఫోన్లో నాన్ యాక్సెప్టెడ్ సిమ్ కార్డులు ఇన్‌స‌ర్ట్ చేయాలి.

5. ఫోన్లో సిమ్ నెట్‌వ‌ర్క్ అన్‌లాక్ పిన్ లేదా ఎంట‌ర్ నెట్‌వ‌ర్క్ అన్‌లాక్ అనే సందేశం వ‌స్తుంది

6. ఇప్పుడు మీకు వ‌చ్చిన అన్‌లాక్ కోడ్‌ను ఎంట‌ర్ చేయాలి. అంతే మీ ఫోన్ అన్‌లాక్ అయిపోతుంది.

జన రంజకమైన వార్తలు