• తాజా వార్తలు
  •  

ఈ 2017 వ సంవత్సరం ను టెక్నాలజీ ఎలా నిర్దేశించనుంది?

సైన్సు యొక్క పురోగమనం మానవజీవితాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం మానవ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మనిషి జీవిస్తున్న జీవన విధానం లో స్మార్ట్ ఫోన్ లు, ట్యాబు లు మరియు కంప్యూటర్ ల పాత్ర మరువలేనిది. ఈ టెక్నాలజీ గురించి ఎక్కడో పుస్తకాల్లోనో లేక విద్యలయాల్లోనో చదువుకునే పరిస్థితి నుండి సామాన్యుడు కూడా టెక్నాలజీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవలసిన పరిస్థితి కి సాంకేతిక పరిజ్ఞానం మనిషిని తీసుకువచ్చింది. ప్రత్యేకించి ఈ స్మార్ట్ పరికరాల రాకతో ప్రపంచం మన చేతిలో ఉందా అన్న భావన కలుగుతుంది. కమ్యునికేషన్, ఇన్ఫర్మేషన్, గేమింగ్, ఎంటర్ టెయిన్మెంట్  ఇలా ఏ రకంగా చూసుకున్నా మన జీవితానికి అతి దగ్గరగా ఉంటూ ఈ టెక్నాలజీ మనలను నిర్దేశిస్తుంది. ప్రతీ సంవత్సరం ఏవో  కొత్త ఆవిష్కరణలు మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితo చేస్తున్నాయి. మరి ఈ మధ్యనే నూతన సంవత్సరం మన జీవితలలోనికి ప్రవేశించింది కదా! ఈ నేపథ్యం లో ఈ 2017 సంవత్సరాన్ని టెక్నాలజీ ఏ రకంగా నిర్దేశించనుంది? ఈ సంవత్సరం ప్రవేశించనున్న వినూత్న ఆవిష్కరణ లు ఏవి? తదితర విషయాల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

టెస్లా మోడల్ 3 మరియు అందుబాటులో ధరలో గ్రీన్ కార్ లు

పర్యావరణ హితం కోసం గ్రీన్ టెక్నాలజీ అంటే కేవలం బ్యాటరీ సహయం తో మాత్రమే నడిచే గ్రీన్ కార్ లు ఈ సంవత్సరం ఆవిష్కరింపబడనున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన ఎలోన్ మస్క్ తన టెస్లా మోడల్ 3 ను లాంచ్ చేయడం ద్వారా ఈ రంగం లో తన ఆధిపత్యను చాటుకునే ప్రయత్నాల్లో ఉంది. దీని ధర సుమారుగా రూ 37 లక్షలు ఉండవచ్చు. బ్యాటరీ సహాయం తో నడిచే ఈ కార్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దానితో సుమారుగా 350 కిలోమీటర్ లు ప్రయాణం చేయవచ్చు. ఈ సంవత్సరం మధ్య లో దీనియొక్క తయారీ ప్రారంభం కావచ్చు.

మరొక వైపు ఇండియా లో కూడా ఈ పర్యావరణ స్నేహిత వాహనాల తయారీ ఈ సంవత్సరం ఊపందుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ లో భాగంగా గ్రీన్ కార్ లపై పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించనుంది. మారుతీ, టొయోట లాంటి పలు కంపెనీలు ఇప్పటికే హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా ఏ తరహా కార్ లను ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. హ్యుండై లాంటి కంపెనీలు కూడా ఈ సంవత్సరమే ఈ హైబ్రిడ్ టెక్నాలజీ కార్ లను లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఆపిల్ ఐ పాడ్ vs విండోస్ కన్వర్టబుల్స్

ఆపిల్ యొక్క ఐ పాడ్ తన మూడవ ఐ పాడ్ ప్రో ను లాంచ్ చేయనుంది. అంటే ఇప్పుడు మనకు ఐ పాడ్ లో మూడు రకాల ఆప్షన్లు ఉంటాయన్నమాట. అవి 9.7 అంగుళాలు, 12.9 అంగుళాలు, మరియు సరికొత్త 10.9 అంగుళాలు. ఇందులో మరింత పవర్ ఫుల్ హార్డ్ వేర్ సరికొత్త సాఫ్ట్ వేర్ సహాయం తో రానుంది. దీని ప్రత్యర్ధులైన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ తో పోల్చుకుంటే ఇది దీనిని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. అయితే మైక్రోసాఫ్ట్ కూడా దీనికి ధీటుగానే బదులిస్తుంది. ఇందులో భాగంగా విండోస్ 10 కన్వర్టబుల్స్ ను లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యం లో ఈ రెండింటి మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉండనుంది.

స్మార్ట్ ఆండ్రాయిడ్ వాచ్

ధారణ పరికరాల గురించి ఇంతకుముందే మనం అనేక రకాల ఆర్టికల్ లలో చదువుకున్నాము. గూగుల్ తన ధారణ పరికరాల ఫ్లాట్ ఫాం ను అప్ డేట్ చేయనుంది. ఏ పరికరాలలో ఉండే యాప్ లు , ఐకాన్ లు, ఆప్షన్ లను ఈ అప్ డేట్ పూర్తిగా మార్చనుంది. వీటిని మరింత ఆకర్షణీయంగా ఇది మార్చనుంది. ఫాసిల్ Q మార్షల్ మరియు ఆసుస్ జెన్ వాచ్ 2 లాంటి అనేక స్మార్ట్ వాచ్ లు అంత నాణ్యంగా లేని సాఫ్ట్ వేర్ తో ఉన్న నేపథ్యం లో గూగుల్ యొక్క ఈ సరికొత్త అప్ డేట్ వీటికి సరికొత్త ఊపునూ, రూపునూ తెచ్చే అవకాశం ఉంది.

రియల్ న్యూస్ ను ప్రకటించనున్న ఫేస్ బుక్

ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 1.8 బిలియన్ ల మంది వినియోగదారులతో ఉన్న ఫేస్ బుక్ కూడా సరికొత్త గా అప్ డేట్ అవనుంది. 2016 వ సంవత్సరం లో పక్షపాతం మరియు ఫేక్ వార్తలు లాంటి అపవాదులను ఎదుర్కొన్న ఫేస్ బుక్ యధార్థమైన వార్తలకు కు కేంద్రం అయి ఆ అపవాదును తొలగించుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం ఇది థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ లతో కలిసిపనిచేస్తున్నట్లు ఇది ప్రకటించింది. ఇవి పాయింటర్ ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ కోడ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కు లోబడి పనిచేస్తాయి.

కేబుల్/ dth లు అవసరం లేని టీవీ లు

నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, వూట్, అమజాన్ ప్రైమ్ వీడియో ...... 2017లో మనం టీవీ చూసే విధానం ఎలా మారనుందో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. వేగవంతంగా వృద్ది చెందుతున్న 3 జి మరియు 4 జి కనెక్టివిటీ మరియు వృద్ది చెందుతున్న బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ లు ఇండియా లో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురానున్నాయి. వీటి ప్రభావంతో ఇండియా లో గృహలు కేబుల్ కనెక్షన్ మరియు DTH లు అవసరం లేని ఇల్లుగా మారనున్నాయి. మీకు ఏది కావాలంటే అది ఆన్ లైన్ లోనే చూసుకునే టెక్నాలజీ ఈ సంవత్సరమే ఆవిర్భవించనుంది.

మీ సర్వీస్ కోసం పర్సనల్ అసిస్టంట్ లు

మీకు ఏం కావలన్నా మీ మొబైల్ ఫోన్ లో ఉండే ఒక్క యాప్ ద్వారానే చేసుకునే సౌలభ్యాన్ని కల్పించే Haptik లాంటి యాప్ లు ఈ సంవత్సరం మరిన్ని రానున్నాయి. వీటిద్వారా మీరు రిజర్వేషన్, రిమైండర్ సెట్టింగ్, ఫోన్ రీఛార్జి, క్యాబ్ బుకింగ్, రిపేర్ సర్వీస్ లలాంటి వాటిని కూడా చేసుకోవచ్చు. ఇలాంటి యాప్ లకు మరొక ఉదాహరణ wishup. ఈ యాప్ లన్నీ ఆండ్రాయిడ్ మరియు iOS లలోనూ లభించనున్నాయి. ఒక సర్వే ప్రకారం 2019 కల్లా స్మార్ట్ ఫోన్ లతో చేసే ఇంటరాక్షన్ లలో 20 శాతం ఈ పర్సనల్ అసిస్టంట్ లద్వారానే జరగనున్నాయి.

మన ఫోన్ లలో డిజిటల్ ఎకానమీ

దీనిగురించి ఇప్పటికే ఎన్నో రకాల ఆర్టికల్ లు, విశ్లేషణలు సాంకేతిక సాహిత్యం లో వచ్చాయి. మన వెబ్ సైట్ లో కూడా దీనిపై ఒక శ్రీస్ ను కూడా ప్రచురించడం జరిగింది. కాబట్టి ఇకపై నగడు రహితంగా జరిగే లావాదేవీలన్నీ సుమారుగా 90 శాతం వరకూ కేవలం మొబైల్ ఫోన్ ద్వారానే జరగనున్నాయి. వీటికి సంబంధించి డిజిటల్ వాలెట్ లతో పాటు వివిధ రకాల బ్యాంకు లు కూడా తమ తమ వాలెట్ లను లాంచ్ చేశాయి. అంటే ఇకపై మీ ఫోన్ మీ వ్యాలెట్ అన్నమాట.

జన రంజకమైన వార్తలు