ఇన్ఫోకస్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. ఇందులో ఇన్ఫోకస్ స్నాప్ 4 (Infocus Snap 4) ఏకంగా నాలుగు కెమెరాలతో రానుంది. సెప్టెంబర్ 26 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. మరోవైపు ఇన్ఫోకస్ టర్బో 5 ప్లస్ (Infocus Turbo 5 Plus) 8,999 రూపాయల ధరతో ఈ నెల 21 నుంచి మార్కెట్లో లభించబోతోంది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతాయి.
ఇన్ఫోకస్ స్నాప్ 4
నాలుగు కెమెరాలతో వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఇందులో రెండు రియర్ ఫేసింగ్ కెమెరాలు, మరో రెండు ఫ్రంట్ కెమెరాలు. రియర్ సైడ్‌లో 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 120 డిగ్రీల వైడ్ యాంగిల్లో స్నాప్స్ తీసుకోవడానికి వీలుగా 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇక ఫ్రంట్ కెమెరాలు రెండూ 8 మెగాపిక్సెల్స్‌తో వచ్చాయి.
స్పెసిఫికేషన్స్
* 5.2 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
* ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 6759ఎన్ చిప్సెట్
* 4జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్
* 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ
టర్బో బ్యాటరీతో టర్బో 5 ప్లస్
ఇన్ఫోకస్ నెల క్రితం రిలీజ్ చేసిన ఇన్ఫోకస్ టర్బో 5కు కొనసాగింపుగా ఇన్ఫోకస్ టర్బో 5 ప్లస్‌ను కూడా లేటెస్ట్గా లాంచ్ చేసింది. 4,850 ఎంఏహెచ్ బ్యాటరీ దీనికి పెద్ద ప్లస్‌పాయింట్. మోడరేట్ యూసేజ్ చేసేవారికి ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జి చేస్తే రెండు రోజులు నడుస్తుంది. 34 గంటల స్టాండ్‌బై టైం ఇచ్చారు.
స్పెసిఫికేషన్స్
* 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
* ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 6750 ఎన్ చిప్సెట్
* 3జీబీ ర్యామ్
* 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 13 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలతో రియర్ సైడ్‌లో డ్యూయల్ కెమెరా సెటప్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్