• తాజా వార్తలు

త్వ‌ర‌లో రానున్న శాంసంగ్ ఎస్‌9 బెట‌రా... గూగుల్ పిక్స‌ల్ 2 బెట‌రా?

స్మార్ట్‌ఫోన్ ప్రియుల‌కు ఒక సందేహం. ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న గూగుల్ పిక్స‌ల్ 2 ఉత్త‌మ‌మైన‌దా... లేదా శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ఉత్త‌మ‌మైన‌దా?  పిక్స‌ల్ ఫోన్ మంచి కెమెరా, అంత‌కుమించిన బిల్డ్‌ క్వాలిటీతో ఆక‌ర్షిస్తుంటే..  శాంసంగ్ కూడా అంత‌కుమించిన ఫీచ‌ర్ల‌తో పిక్స‌ల్ ఫోన్‌కు స‌వాల్ విసురుతోంది. ఈ ఫిబ్ర‌వ‌రి 25న విడుదుల కాబోతున్న ఈ శాంసంగ్ ఫోన్ క‌చ్చితంగా వినియోగ‌దారుల అంచ‌నాల‌ను అందుకుంటుంద‌ని ఈ కొరియా కంపెనీ విశ్వాసంతో ఉంది. మ‌రి పోటాపోటీ ఫీచ‌ర్ల‌తో ఉన్న శాంసంగ్, పిక్స‌ల్ ఫోన్లలో ఏది ఉత్తమ‌మైంది?

డిజైన్‌లో రెండూ రెండే
ఇప్ప‌టికే మార్కెట్లో ఉన్నగూగుల్ పిక్స‌ల్‌కు గెలాక్సీ ఎస్‌9 డిజైన్ విష‌యంలో స‌వాల్ విసురుతోంది. టాప్‌లో ఎక్కువ బెజెల్స్‌తో శాంసంగ్ ముచ్చ‌ట‌గా ఉంది. ఫ్రంట్ కెమెరా,  సెన్సార్ల‌కు స‌రిపోయేంత స్పేస్ దీనిలో ఉంది. అయితే పిక్స‌ల్ 2 ఫోన్లో మాత్రం మంద‌మైన బెజెల్స్ ఉన్నాయి. అయితే ఎస్‌9 డిస్‌ప్లేతో పోలిస్తే పిక్స‌ల్ 2 డిస్‌ప్లే మ్యాచ్ కాదు. పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్‌లో  6.0 క్వాడ్ హెచ్‌డీ ఓఎల్ఈడీ డిప్‌స్లే ఉంటే.. పిక్స‌ల్ 2లో 5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటే.. శాంసంగ్ ఫోన్లో మాత్రం సూప‌ర్ అమోలెడ్ టెక్నాల‌జీ ఉప‌యోగించారు. దీని వ‌ల్ల మ‌న క‌ళ్లు చూడ‌గ‌లిగే రంగుల‌ను మాత్ర‌మే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. పిక్స‌ల్ 2 ఫోన్లో 4 జీబీ ర్యామ్ సామ‌ర్థ్యం, స్నాప్‌డ్రాగ‌న్  835 ప్రాసెస‌ర్ వాడితే... శాంసంగ్‌లో 6 జీబీ ర్యామ్‌... స్నాప్‌డ్రాగ‌న్ 845 ఎస్ఓసీ ప్రాసెస‌ర్ ఉప‌యోగించారు,

కెమెరాల్లో శాంసంగే
కెమెరా విష‌యంలో పిక్స‌ల్‌పై శాంసంగ్‌దే పైచేయి. ఇది కెమెరా స్పెష‌లిస్ట్ అని ముందునుంచి ఆ సంస్థ చెబుతోంది. 12 ఎంపీ సింగిల్ లెన్స్ కెమెరాతో పాటు... 12 ఎంపీ సెన్సార్స్ ఉన్నాయి. వీటికి ఆప్టిక‌ల్ జూమ్ కూడా ఉంది. రెండో లెన్స్ ద్వారా లైవ్ ఫోస‌స్ మోడ్ ఆప‌రేట్ చేసుకోవ‌చ్చు. అంటే బ్యాక్ గ్రౌండ్‌ను బ్ల‌ర్ చేసుకుని ఆబ్జెక్ట్‌పైనే దృష్టి పెట్టొచ్చు. దీనిలో అడ్జెస్ట‌బుల్ ఫీచ‌ర్ కూడా ఉంది. మ‌రోవైపు పిక్స‌ల్‌లో 12 ఎంపీ సింగిల్ లెన్స్ కెమెరా ఉంది. అయితే పోర్ట‌బుల్ మోడ్ కోసం గూగుల్ వేరే సాఫ్ట్‌వేర్ మీద ఆధార‌ప‌డుతోంది. ఏదేమైనా రెండు ఫోన్ల‌ను పోల్చి చూసుకుంటే గెలాక్సీ ఎస్‌9 ఫోనే పిక్స‌ల్ 2 మీద కాస్త ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. అయితే పిక్స‌ల్ అప్‌డెటెడ్ వెర్ష‌న్‌ను బ‌ట్టి ఈ రెండింట్లో ఏది ఉత్త‌మ‌మైన‌దో ఒక నిర్ణ‌యానికి రావొచ్చు.

జన రంజకమైన వార్తలు