• తాజా వార్తలు

జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ భార‌త టెలికాం రంగంపై చాలా ఎక్కువ‌గా ఉంది. ఒక‌ప్పుడు డేటా అంటే తెలియ‌ని జ‌నాలు.. ఇప్పుడు ఉచిత డేటాకు అల‌వాటు ప‌డిపోయారు. త‌క్కువ రేటుతో డేటా వ‌స్తేనే కొనేందుకు ఇష్టప‌డుతున్నారు. అంతేకాదు జియో ప్ర‌వేశ‌పెట్టిన ఆఫ‌ర్ల‌తో ఇన్నాళ్లు తాము ఏం కోల్పోయామో... ఎంత న‌ష్ట‌పోయామో వినియోగ‌దారులు ఇప్ప‌టికే గ్ర‌హించారు. ఈ నేప‌థ్యంలో జియో ఇటీవ‌ల ఎంజీఎంలో అనౌన్స్ చేసిన 4జీ వీవోఎల్‌టీఈ ఫీచ‌ర్ ఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి వ‌స్తుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జియో ప్ర‌భావంతో మ‌రిన్ని 4జీ ఫీచ‌ర్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. అవేంటో చూద్దాం..
అన్ని రంగంలోకి దిగాయి
జియో ఫీచ‌ర్ ఫోన్‌కు పోటీగా లావా, మైక్రోమాక్స్‌, ఇంటెక్స్ లాంటి దేశీయ కంపెనీలు 4జీ ఫీచ‌ర్ ఫోన్ల తయారీకి సిద్ధం అయ్యాయి. జియో ఫీచ‌ర్ ఫోన్ ప్రి బుకింగ్స్ ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. బేటా ట్ర‌య‌ల్ వెర్ష‌న్ ఆగ‌స్టు 15న మొద‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఐడియా కూడా కొత్త 4జీ చావ‌క ఫోన్‌ను తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించింది. ఈ ఫోన్లో వాట్స‌ప్‌, ఫేస్‌బుక్ ఇత‌ర యాప్‌ల‌కు కూడా అవ‌కాశం ఉంటుంద‌ట‌. 4జీ వీవోఎల్‌టీఈ నెట్‌వ‌ర్క్‌కి స‌పోర్ట్ చేసేలా ఈ ఫోన్‌ను రూపొందించాల‌నేది జియో ప్ర‌య‌త్నం. నాలుగుదైదు కంపెనీలు ఈ 4జీ ఫీచ‌ర్ ఫోన్ల కోసం ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స్ర్పెడ్‌ట్ర‌మ్ క‌మ్యునికేష‌న్ తెలిపింది. భార‌త్‌లో ఇంకా చాలామంది స్మార్ట్‌ఫోన్లు ఉప‌యోగించ‌డం లేద‌ని.. వారిని త‌మ ఫీచ‌ర్ ఫోన్ వైపు మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వివిధ ఫోన్ల కంపెనీలు చెబుతున్నాయి.
జియో ఫీచ‌ర్ ఫోన్‌
జియో ఫీచ‌ర్ ఫోన్‌ను 4జీ ఫీచ‌ర్ల‌తో త‌యారు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇది మార్కెట్లోకి రానుంది. ఈనెల 24 నుంచి ప్రి బుకింగ్ మొద‌లు కానుంది. మై జియో.కామ్ ద్వారా ఈ బుకింగ్ ఉంటుంది. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, సింగిల్ సిమ్ స్లాట్తో వీవోఎల్‌టీఈ నెట్‌వ‌ర్క్‌ను స‌పోర్ట్ చేసేలా ఈ ఫోన్‌ను త‌యారు చేస్తున్నారు. దీనిలో మైక్రో ఎస్‌డీ కార్డు స‌పోర్ట్ కూడా ఉంది. పానిక్ బ‌ట‌న్, డిజిట‌ల్ అసిస్టెంట్ కూడా ఉంది. క్వాల్‌కామ్ టెక్నాల‌జీని ప్రాసెస‌ర్‌గా వాడుతున్నారు. ముందుగా రూ.1500 కాష‌న్ డిపాజిట్ చేయాలి.
ఐడియా 4జీ ఫోన్‌
జియో ఫీచ‌ర్ ఫోన్‌ను పోలిన ఫోన్ ఇది. దీని ధ‌ర రూ.2500 మ‌ధ్య ఉండొచ్చు. వాట్స‌ప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్ ఇలా అన్నింటిని ఇది స‌పోర్ట్ చేస్తుంది. అయితే కేవ‌లం దీనిలో ఐడియా నెట్‌వ‌ర్క్‌ను మాత్ర‌మే వాడ‌న‌వ‌స‌రం లేదు. ఈ ఫోన్ ధ‌ర‌ను మ‌రింత త‌క్కువ చేసేందుకు ఆ కంపెనీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.
లావా 4జీ క‌నెక్ట్ ఎం1
లావా ఇటీవేల తొలి 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను అనౌన్స్ చేసింది. ఇది రిల‌య‌న్స్ జియో 4జీ వీవోఎల్‌టీ నెట్‌వ‌ర్క్‌ను స‌పోర్ట్ చేస్తుంది. లావా 4జీ క‌నెక్ట్ ఎం1లో 2.4 అంగుళాల తెర‌తో పాటు 1.2 గిగా హెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్ ఉంది. దీని ర్యామ్ సామ‌ర్థ్యం 512 ఎంబీ. 4జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో పాటు 32 జీబీ వ‌ర‌కు మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఎక్స‌పాండ్ చేసుకోవ‌చ్చు. 1750 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యంలో దీనిలో ఉంది. దీని ధ‌ర రూ.2899గా నిర్ణ‌యించారు.
మైక్రోమాక్స్ భార‌త్ 1
మైక్రోమాక్ భార‌త్ 1 పేరిట ఒక కొత్త ఫీచ‌ర్ ఫోన్‌ను త‌యారు చేస్తుంది. 2.4 అంగుళాల క‌ల‌ర్ స్క్రీన్‌తో పాటు 1.25 గిగా హెట్జ్ డ్యుయ‌ల్ కోర్ ప్రాసెస‌ర్‌, 1జ‌బీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ దీని ఉంది. దీన్ని ఎస్‌డీ కార్డు ద్వారా 32జీబీ వ‌ర‌కు ఎక్స్‌టెండ్ చేసుకోవ‌చ్చు. 2 మెగా పిక్స‌ల్ కెమెరాతో పాటు 1500 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం దీనికుంది. డ్యుయ‌ల్ స్లిమ్ స్లాట్ మ‌రో ఆప్ష‌న్‌.

జన రంజకమైన వార్తలు