• తాజా వార్తలు

రూ.12,999కే లావా హీలియం 12 ల్యాప్‌టాప్ 

త‌న‌దైన శైలిలో ల్యాప్‌టాప్‌ల‌ను రిలీజ్ చేయ‌డంలో ముందుండే లావా మ‌రో మోడ‌ల్‌లో తెర మీద‌కు తీసుకొచ్చింది. గ‌తంలో వ‌చ్చిన హీలియం సిరీస్‌ను కొన‌సాగిస్తూ లావా హీలియం 12 ల్యాప్‌టాప్ మార్కెట్లో విడుద‌ల అయింది. ఇటీవ‌లే   ఈ ల్యాప్‌టాప్ భార‌త మార్కెట్లో అందుబాటులోకి వ‌చ్చింది.  ఈ విండోస్ 10 ల్యాప్‌టాప్‌లో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ఎన్నో ఆప్ష‌న్లు ఉన్నాయి. అటు హెవీ యూజ‌ర్ల‌కు కాకుండా.. ఇటు త‌క్కువ యూజ్ చేసేవాళ్ల‌కు కాకుండా మీడియం రేంజ్ వాళ్ల‌ను టార్గెట్ చేస్తూ ఈ కొత్త ల్యాప్‌టాప్‌ను రంగంలోకి తీసుకొచ్చారు. మ‌రి ఈ కొత్త లావా హీలియం ల్యాప్‌టాప్ ప్ర‌త్యేక‌త‌లేంటో చూద్దామా...

రూ12,999 ధ‌ర‌తో..
మంచి ఆప్ష‌న్లు, ఆక‌ట్టుకునే రూపం.. అన్నిటిక‌న్నా మించి మంచి ధ‌ర‌తో ఆక‌ర్షిస్తోంది లావా హీలియం 12 ల్యాప్‌టాప్‌. 32 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ  ల్యాప్‌టాప్ ధ‌ర రూ.12999గా ఉంది. భార‌త్‌లోని 14 న‌గ‌రాల్లో రిటైల్ స్టోర్లు, మ‌ల్టీ   బ్రాండెడ్ ఔట్ లెట్ల‌లో ఈ ల్యాప్ టాప్ ల‌భ్య‌మ‌వుతోంది.  గోల్డ్ మ‌రియు సిల్వ‌ర్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ హీలియం బ్రాండ్ ల్యాప్‌టాప్‌లో మెమ‌రీని ఎస్‌డీ కార్డు ద్వారా కూడా ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు. 

ఇంటెల్ జెడ్‌8350 ప్రాసెస‌ర్‌
హీలియం 12 ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ జెడ్‌8350 ప్రాసెస‌ర్ వాడారు. దీనిలో 1.88  గిగా హెట్జ్ వ‌ర‌కు ట‌ర్బో బూస్ట్ ఉంది.  అన్నిటిక‌న్నా మించి దీని స్క్రీన్ సైజు కూడా ఆక‌ట్టుకుంటోంది. 12.5 అంగుళాల హెచ్‌డీ తెరతో, ఎల్ఈడీ బ్యాక్‌లిట్ డిస్‌ప్లేతో ఇది చూడ‌బుల్‌గా ఉంది. ఇంటెల్ ప్రాసెస‌ర్‌తో పాటు హెచ్‌డీ గ్రాఫిక్స్,  2జీ ర్యామ్ సామ‌ర్థ్యంతో ఇది క‌చ్చితంగా కొనే  ల్యాప్‌టాప్‌ల జాబితాలో చేరింది. ఆన్‌బోర్డు స్టోరేజ్ 32 జీబీగా ఉన్న  ఈ ల్యాప్‌టాప్‌లో మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ  వ‌ర‌కు ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు.  వీడియో కాల్స్ చేసుకునేందుకు వీజీఏ వెబ్‌కామ్ కూడా ఉంది. 

10000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
లావా హీలియం ల్యాప్‌టాప్‌లో 10000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది.  క‌నెక్టివీటి విష‌యంలోనూ ఇది ముందే.  వైఫై 802.11 , బ్లూటూత్ 4.0, యూఎస్‌బీ 2.0,  మినీ హెచ్‌డీఎంఐ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ లాంటి క‌నెక్టివిటీ ఆప్ష‌న్లు ఉన్నాయి.  ప్ర‌స్తుతం విండోస్ 10 ఓఎస్‌తో ర‌న్ అవుతున్న ఈ ల్యాప్ టాప్ మున్మందు మ‌రింత అప్‌డేట్ కానుంది.                     

జన రంజకమైన వార్తలు