• తాజా వార్తలు

ఎంఎస్ పెయింట్ పోలేదు.. ఆప్షనల్ డౌన్లోడ్ గా స్టోర్ లో ఉంటుంది: మైక్రోసాఫ్ట్

    ‘‘ఎంఎస్ పెయింట్ ఇక ఉండదు.. మైక్రోసాఫ్ట్ ఎంఎస్ పెయింట్ ను ఆపేస్తోంది..’’ అంటూ బ్లాగులు, కొన్ని టెక్ వెబ్ సైట్లలో వార్తలు దర్శనమిస్తున్నాయి. కానీ.. ఇది నిజమేనా? అంటే పూర్తిగా కాదనే చెప్పాలి. విండోస్ 10 ఫాల్ క్రియేటర్స్ అప్ డేట్లో ఎంఎస్ పెయింట్ ఉండదని తెలియడం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో మైక్రో సాఫ్టు దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఎంస్ పెయింట్ కు ముగింపు పలకడం లేదని వెల్లడించింది. 
    విండోస్ స్టోర్లో ఎంఎస్ పెయింట్ ను ఆప్షనల్ గా  డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే... విండోస్ 10 ఫాల్ క్రియేటర్స్ లో ఎంఎస్ పెయింట్ స్థానంలో పెయింట్ 3డీ ఉంటుంది. ఈ పెయింట్ 3డీ లోనూ పెయింట్ లో ఉన్న ప్రధాన ఆప్షన్లన్నీ ఉంటాయి. ఫొటో ఎడిటింగ్, 2డీ క్రియేటర్స్ కూడా ఉంటాయి.
    విండోస్ 1.0 ఆపరేటింగ్ సిస్టమ్‌లో 1985లో మొట్ట మొదటి సారిగా పెయింట్ సాఫ్ట్‌వేర్‌ను అందించారు. 32 ఏళ్లుగా పెయింట్ వినియోగించనివారు లేరు. పెయింట్ ఇక ఉండదని తెలియగానే ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఇచ్చింది.
 

జన రంజకమైన వార్తలు