• తాజా వార్తలు
  •  

కూర్చున్న‌చోట నుంచి క‌ద‌ల‌కుండానే మీతో వ‌ర్క‌వుట్ చేయించే మూవ‌బుల్ ఫుట్ రెస్ట్‌

మీది రోజూ గంటల తరబడి కూర్చునే ఉద్యోగమా? ఐతే మీరు రిస్క్ జోన్‌లో ఉన్నారు.  ఎందుకంటే ఏళ్ల తరబడి కూర్చుని జాబ్ చేసేవాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని రీసెర్చ్‌లుచెబుతున్నాయి. షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ రీసెర్చర్లు దీని మీద పరిశోధన చేశారు.  ఇలా ఏళ్లపాటు కూర్చొని పనిచేసేవారికి డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముంది అని తేల్చారు. తగినంత శారీరక శ్రమ,  ఎక్సర్సైజ్ చేయకపోతే ఇలాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముందని  హెచ్చరించారు. ఐతే పని ఒత్తిడి లో ఇవేవీ చేయడానికి వీలు పడని వారి కోసం కూర్చున్న చోటే  మెటబోలిక్ రేట్ పెంచే ఓ డివైస్‌ను  తయారు చేశారు. ఆ డివైస్ ఎలా ప‌నిచేస్తుందో చూడండి.
ట్విస్ట్‌, స్వింగ్‌, వ‌ర్క‌వుట్‌
హోవ‌ర్ (Hovr) అనే పేరు పెట్టిన ఈ డివైస్‌ ఒక మూవబల్ ఫుట్ రెస్ట్. దీని మీద కాళ్ళు పెట్టుకుని మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. ఈ ఫుట్ రెస్ట్ మీ పాదాలను ట్విస్ట్ చేస్తుంది. స్వింగ్ చేస్తుంది. దీని వల్ల మీ బాడీ అంతా యాక్ట్ వేట్ అవుతుంది. మెటబోలిక్ రేట్ పెరిగి ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది. 
రిస్క్ త‌గ్గుతుంది!
నిల్చుని  పని చేసేవాళ్లని,  కూర్చుని పని చేసేవాళ్ళని, కూర్చుని ఈ డివైస్ పెట్టుకుని పని చేసేవాళ్ళని మూడు గ్రూపులుగా చేసి పరిశీలించారు. కూర్చుని పనిచేసేవాళ్ళ కంటే ఈ డివైస్ పెట్టుకుని కూర్చుని వర్క్ చేసేవాళ్ళకు మెటబోలిక్ రేట్ ఎక్కువగా వచ్చింది. అంటే శ‌రీరంలో క‌ద‌లిక‌లు బాగా పెరిగి ఒకేచోట గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేయ‌డం వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దీంతో చాలా వ‌ర‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని భావిస్తున్నారు.

జన రంజకమైన వార్తలు