• తాజా వార్తలు

ఓలా, ఉబర్ డ్రైవర్ లు స్ట్రైక్ లో ఉన్నపుడు 5 ప్రత్యామ్నాయ మార్గాలు

ప్రముఖ క్యాబ్ సర్వీస్ లు అయిన ఓలా మరియు ఉబర్ ల యొక్క డ్రైవర్ లు స్ట్రైక్ చేయడం ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ఢిల్లీ మరియు నేషనల్ కాపిటల్ రీజియన్ లో ఉన్న ప్రజలకు దీనివలన చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ మధ్య హైదరాబాదు లో కూడా ఇలాంటి స్ట్రైక్ జరిగిన విషయం విదితమే. ఇలాంటి స్ట్రైక్ ల వలన ప్రతీరోజూ ఈ యాప్ లపై ఆధారపడి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే వారికీ అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ స్ట్రైక్ ఎప్పుడు పూర్తీ అవుతుందో కూడా తెలియదు. ఇలాంటి సందర్భాలలో ప్రత్యామ్నాయాల వైపు చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది వినియోగదారులు వేరే క్యాబ్ సర్వీస్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకున్నారు. కాకపొతే ఇవి ఓలా మరియు ఉబెర్ లంత పాపులర్ యాప్ లు కావు. అయినప్పటికీ తామేమిటో నిరూపించుకోవడానికి ఈ చిన్న స్థాయి సర్వీస్ లకు ఇదే సరైన సమయం. ఈ నేపథ్యం లో ఇలాంటి ప్రత్యామ్నాయ యాప్ లలో అత్యుత్తమమైన 5 యాప్ లను మా పాఠకుల కోసం ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం. ఇవి ఢిల్లీ మరియు NCR ప్రాంతానికి పరిమితం అయినప్పటికీ అతి త్వరలోనే దేశం లోని అనను ప్రధాన నగరాలకు విస్తరించనున్న నేపథ్యం లో వీటి గురించి తెలుసుకుని ఉండడం ఎంతైనా అవసరం అని మేము భావిస్తున్నాం.

జుగ్నూ ( Jugnoo )

ఈ యాప్ అందుబాటు ధరలలో ఆటో రైడ్ లనుజ్ అందిస్తుంది. సాధారణ ఆటో ధరలకంటే 32 శాతం తక్కువ ధరలకే ఇది తన సేర్వ్చీ ను అందిస్తుంది.బుకింగ్ చేసుకోవాలి అంటే మీరున్న లొకేషన్ ను సెలెక్ట్ చేసుకుంటే దగ్గరలోని డ్రైవ్ డీటెయిల్స్ మీకు SMS రూపంలో వస్తాయి. ఆ తర్వాత మీరు డబ్బులు చెల్లించాలి. ఇది మీకు 100 శాతం సంతృప్తికరమైన సర్వీస్ ను అందిస్తుంది. జుగ్నూ కాష్ అనే ఈ వాలెట్ ను కూడా ఇది కలిగి ఉంది.

Revv

ఈ స్ట్రైక్ కాలంలో వెలుగులోనికి వచ్చిన మరొక యాప్ Revv.ఇది ఒక కార్ రెంటల్ సర్వీస్. ఇది తన డిమాండ్ లో 40 శాతం పెరుగుదలను పొంది ఉంది. ప్రత్యేకించి వారాంతాల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. మీరు రెంట్ తీసుకున్న కార్ ఎంతసేపు కావాలో మీరు మెన్షన్ చేయాలి. ఇది బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, NCR, చండీగఢ్, మరియు జైపూర్ లలో కూడా అందుబాటులో ఉంది.

జూమ్ కార్ ( Zoomcar)

స్ట్రైక్ వలన లబ్ది పొందిన మరొక యాప్ ఇది. ఇది తన రోజువారీ డిమాండ్ లో 20 శాతం పెరుగుదలను పొందింది. ఇది తక్కువ దూరం మరియు లాంగ్ డిస్టెన్స్ వినియోగదారులకు అనేకరకాల రెంటల్ ప్లాన్ లను అందిస్తుంది.

ఒరాహి ( Orahi)

ఓలా షేర్ మరియు ఉబర్ పూల్ లకు లాగా ఇది కూడా ఒక కార్ పూల్ యాప్. ఇది కిలోమీటర్ కు రూ 3.5 /- లు ఛార్జ్ చేస్తుంది. ఇది తన యూజర్ లను పాసెంజర్ మరియు కార్ ఓనర్ లలాగా రిజిస్టర్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఇది NCR రీజన్ లో 27 శాతం నుండి 32శాతం పెరుగుదల ను కలిగిఉండి.అంతేగాక ఇదే ప్రాంతం లో ఇది సుమారు ఒక లక్షమంది రిజిస్టర్డ్ కస్టమర్ లను కలిగిఉంది.

రేడియో టాక్సీ

ఓలా మరియు ఉబర్ ల యొక్క రాకతో ఈజీ క్యాబ్స్మరియు మేరు లాంటి అనేక క్యాబ్ సర్వీస్ లు తమ కస్టమర్ లను కోల్పోయాయి. అయితే ఓలా మరియు ఉబర్ లు సంక్షోబం లో ఉండడం తో ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇవి ప్రయత్నాలు చేస్తున్నాయి.

"

జన రంజకమైన వార్తలు