• తాజా వార్తలు

రిఫర్ చేయండి సంపాదించుకోండి...

మొబైల్ స్టోర్ కి వెళ్లి మీ ఫోన్ ను రీఛార్జి చేసుకోవడం అనేది ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపొయింది. అసలు రీఛార్జి కార్డు లు అయితే చాలా తక్కువమంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడంతా ఆన్ లైన్ హవా నడుస్తుంది. రీఛార్జి అవుట్ లెట్ లలో దాదాపు అంతా ఈ రీఛార్జి పద్దతే నడుస్తుంది. దీనికి సమాంతరంగా మరొక రీఛార్జి పద్దతి ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటుంది. అదే రీఛార్జి యాప్స్. అవును మొబైల్ వినియోగదారులలో దాదాపు 70 శాతం మంది స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. అనేకరకాల ఫ్రీ రీఛార్జి యాప్ లు నేడు గూగుల్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచం లోనే అతిపెద్ద యాప్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ అనే విషయం మనకు తెలిసినదే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈ యాప్ లలో అత్యుత్తమ మైనవి ఏవి? వీటిలో వేటిని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి? ఏం పర్వాలేదు, మీ సందేహాలకు ఈ ఆర్టికల్ లో సమాధానం ఇవ్వనున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే  ఈ యాప్ లను ఉపయోగించి కేవలం రీఛార్జి మాత్రమే గాక అదనంగా డబ్బు కూడా సంపాదించవచ్చు. అసలు ఈ యాప్ లు ఏమిటి? వీటిలో టాప్ యాప్ లు ఏవి? వీటిని ఉపయోగించి డబ్బు ఎలా సంపాదిస్తారు? తదితర విషయాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.

టాప్ 10 ఫ్రీ రీఛార్జి ఆండ్రాయిడ్ యాప్ లు

  1. ఫ్రీచార్జ్ ( freecharge )
  2. మొబిక్విక్ ( mobikwik )
  3.  ఫ్రీ రీఛార్జి  ( free recharge )
  4. ట్రూ బాలన్స్ ( true Balance )
  5. ఫోకట్ మనీ యాప్ ( Fokat money app )
  6. ఫ్రీ ATM యాప్ ( free ATM app )
  7. ఎర్న్ టాక్ టైం యాప్ ( earn talktime app )
  8. నోడీ క్యాష్ యాప్ ( Noddy కాష్ app )
  9. జెనీ రివార్డ్స్ యాప్ ( genie rewards app )
  10. ఫ్రీ మొబైల్ రీఛార్జి యాప్ ( free mobile recharge app )

ఈ యాప్ ల ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?

సాధారణంగా పైన పేర్కొన్న యాప్ లన్నీ రీఛార్జి యాప్ లు. అంటే వీటిని ఉపయోగించి మన ఫోన్ కు రీఛార్జి చేసుకోవచ్చు. అయితే అదనంగా వీటిని ఉపయోగించి మనం డబ్బు కూడా సంపాదించవచ్చు. మీ రీఛార్జి కూడా ఉచితంగానే చేసుకోవచ్చు. దాదాపుగా వీటన్నింటి ప్రక్రియ ఒకే రకంగా ఉంటుంది.అదెలాగో చూద్దాం.

  1. ముందుగా ఈ యాప్ లను ప్లే స్టోర్ నుండి మీ ఫోన్ లోనికి డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  2. ఆ తర్వాత మీ ఎకౌంటు ను క్రియేట్ చేసుకోవడం ద్వారా లాగ్ ఇన్/ సైన్ అప్ అవ్వాలి.
  3. మీరు లాగ్ ఇన్ అయ్యిన ప్రతీసారీ హోం పేజి లో మీకు ఒక రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది.
  4. ఆ రిఫరల్ లింక్ ను మీరు మీ ఫ్రెండ్స్  తో కానీ ఇతరుల తో కానీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయాలి.
  5. మీ ఫ్రెండ్స్ మీరు షేర్ చేసిన లింక్ ను ఓపెన్ చేసి సైన్ అప్ అయిన వెంటనే మీ ఎకౌంటు కు డబ్బు యాడ్ అవుతుంది. ఎంతడబ్బు యాడ్ అవుతుంది అనేది ఒక్కో యాప్ కూ ఒక్కో రకంగా ఉంటుంది.
  6. కనిష్టం గా రూ 10/- ల నుండీ రూ 100/- ల వరకూ మీరు డబ్బు పొందవచ్చు.
  7. కేవలం మీకు మాత్రమే గాక మీ స్నేహితులకు కూడా ఇది డబ్బును సంపాదించిపెడుతుంది. ఉదాహరణకు మీరు మీ స్నేహితునికి మొబిక్విక్ లింక్ ను రిఫర్ చేశారు అనుకోండి, అతను అ లింక్ ను ఓపెన్ చేసి దానిద్వారా రీఛార్జి చేస్తే మీ ఎకౌంటు కు రూ 100/- లు జమ అవుతాయి, అతని అకౌంట్ కు రూ 50/- లు లభిస్తాయి.
  8. ఇవి పరిమిత కాల ఆఫర్ లను కలిగిఉంటాయి. కాబట్టి వాటిని గమనించి ఉపయోగించాలి.
  9. క్యాష్ బ్యాక్ అనేది 48 గంటలలో మీ ఎకౌంటు కు చేరుతుంది.
  10. మీరు గట్టిగా కష్టపడితే ఒక్క రోజులో రూ 5000/- ల దాకా సంపాదించుకునే అవకాశం ఉంది.
  11. కొన్ని యాప్ లు ఆన్ లైన్ షాపింగ్ స్టోర్ లతో కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఆన్ లైన్ లో ఉచిత షాపింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి.

ఈ ఫ్రీ రీఛార్జి యాప్ ల వలన ఉపయోగాలు ఏమిటి?

  1. ఈ ఫ్రీ రీఛార్జి ఆండ్రాయిడ్  యాప్ లను ఉపయోగించి రూ 20,000/- ల వరకూ సంపాదించవచ్చు.
  2. మీరు ఇలా సంపాదించిన డబ్బును DTH, మొబైల్ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జి, బిల్ పేమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ లాంటి పేమెంట్లకు ఉపయోగించవచ్చు.
  3. మీరు ఆన్ లైన్ మనీ ని ఉపయోగిస్తున్నట్లయితే మీ ఎకౌంటు కు అదనపు క్యాష్ బ్యాక్ లు మరియు డిస్కౌంట్ లు పొందవచ్చు.
  4. కొన్ని ప్రమోషనల్ కోడ్ లు మరియు ఆఫర్ లను పొందవచ్చు.
  5. ఫుడ్ ఆర్డర్, క్యాబ్ బుకింగ్, మొబైల్ రీఛార్జి, ట్రైన్ మరియు ఫ్లైట్ టికెట్ బుకింగ్, హోటల్ బుకింగ్ లాంటి బుకింగ్ ల్పి అదనపు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.

రిఫరల్ ప్రోగ్రాం లలో పాల్గొనడం ద్వారా అదనపు బోనస్ పాయింట్ లను పొందవచ్చు.

"

జన రంజకమైన వార్తలు