రిలయన్స్ జియో పై అందరికీ ఉన్న సందేహాలూ వాటికి సమాధానాలు – పార్ట్ 2 సాంకేతిక మీడియా అంతా జియో నామ స్మరణ చేస్తున్న ఈ రోజుల్లో అసలు సగటు పాఠకునికి లేదా సగటు వినియోగదారునికి ఈ జియో పై ఉన్న అనేక సందేహాలను తీర్చడానికి రెండు రోజుల క్రితం కంప్యూటర్ విజ్ఞానం ఒక ఆర్టికల్ ను ప్రచురించడం జరిగింది. ఈ రోజు జియో అధికారికంగా లాంచ్ అవుతున్న సందర్భంగా పాఠకులకు ఉండే మరిన్ని సందేహాలకు ఇక్కడ సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. 1. జియో యొక్క మొబైల్ నంబర్ పోర్టబిలిటి ఎప్పుడు మొదలు అవుతుంది? రిలయన్స్ జియో ఈ నెల 5 వ తేదీన అంటే ఈ రోజు అధికారికం గా లాంచ్ అవుతుంది కావున మొబైల్ నంబర్ పోర్టబిలిటి కూడా ఇదే రోజు ప్రారంభం అవుతుంది. 2. మీ మొబైల్ నెట్ వర్క్ నుండి జియో కి స్విచ్ అవ్వడం ఎలా? మీ మొబైల్ నెట్ వర్క్ నుండి జియో కి స్విచ్ అవడం చాలా సులువు. ఈ క్రింది ప్రక్రియ ను ఫాలో అవ్వండి. మీ మొబైల్ నంబర్ నుండి మీ ప్రస్తుత ఆపరేటర్ కు ఒక పోర్ట్ అవుట్ రిక్వెస్ట్ ను పంపించండి. అది ఇలా పంపాలి. ”< Port > < space> < mobile number >” to 1900. ఆ వెంటనే మీకు ఒక యూనిక్ కోడ్ పంపబడుతుంది. ఈ కోడ్ ను మీ దగ్గరలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో చూపించి సరైన డాక్యుమెంట్లు సమర్పిస్తే చాలు వెంటనే మీరు జియో కి మారి పోవచ్చు. 3. ఎంటర్ ప్రైజ్ ప్లాన్ లు ఏమిటి? కార్పోరేట్ లకూ మరియు మీడియా హౌసెస్ కూ ఎంటర్ ప్రైజ్ ప్లాన్ల కింద కొన్ని ప్లాన్ లను రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ ప్లాన్ ల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లాంటి సేవలను అతి తక్కువ ఇంటర్నేషనల్ రేట్ లకే అందించనుంది. 4. ఈ ఎంటర్ ప్రైజ్ ప్లాన్ లకు టారిఫ్ ఎలా ఉండనుంది? ఇంకా ఈ సేవలను మొదలు పెట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి వీటికి సంబందించిన సమాచారాన్ని కంపెనీ ఇంకా ప్రకటించ లేదు. 5. అసలు ఈ రూ. 50/GB ప్లాన్ ఎలా ఉండనుంది? రూ 50/- లకే హై స్పీడ్ ఇంటర్ నెట్ అందుబాటులో ఉండనుంది. ఒకవేళ డేటా ప్లాన్ ఎక్స్ పైర్ అవ్వడం గానీ డేటా బాలన్స్ అయిపోవడం గానీ జరిగితే 5 పైసా/MB చొప్పున ఛార్జ్ చేయబడుతుంది. ఇది కూడా రూ 50/GB కి సమానం కదా! 6. జియో ఫై కూడా LYF ఫోన్ ల లాగే ఒక సంవత్సరం ఉచిత 4G ని అందిస్తుందా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం జియో LYF ఫోన్ లకు గానీ లేదా జియో ఫై పరికరాలకు గానీ ఒక సంవత్సరం ఉచిత ఇంటర్ నెట్ ను అందించడం లేదు. ఈ ఉచిత సర్వీస్‌లు కేవలం ఈ సంవత్సరం డిసెంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఆ తర్వాత అంటే జనవరి నుండి ప్రతీ వినియోగాదారునికీ టారిఫ్ వర్తిస్తుంది. 7. ఎయిర్ టెల్ ఓపెన్ నెట్ వర్క్ లో ఏదైనా నెట్ వర్క్ సంబందిత హెల్ప్ లైన్ ఉందా? ప్రస్తుతానికి ఇలాంటి సదుపాయం ఏదీ రిలయన్స్ జియో కల్పించలేదు. అయితే అతి త్వరలోనే ఒక నెట్ వర్క్ సంబందిత హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 8. దేశం లో ఈ జియో సర్వీస్ లు ఎక్కడ అందుబాటులో ఉండనున్నాయి? ఇప్పటికే దేశం లోని అన్ని నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాలలో కూడా ఈ రిలయన్స్ తన డిజిటల్ స్టోర్లనూ, మినీ స్టోర్లనూ ప్రారంభించింది. ఇవి కాక కొన్ని థర్డ్ పార్టీ అధీకృత స్టోర్ లను కూడా ఇది అనుమతించనుంది. కాబట్టి దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ఇది అందుబాటులో ఉండనుంది. 9. టారిఫ్‌లో ప్రస్తావించిన హాట్ స్పాట్ డేటా క్యాప్ అంటే ఏమిటి? దేశ వ్యాప్తంగా పది లక్షల హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనుంది. మీకు టారిఫ్‌లలో కనిపించే హాట్ స్పాట్ డేటా క్యాప్‌ను ఉపయోగించి ఈ హాట్ స్పాట్ ను ఉపయోగించవచ్చు. ఇవి కళాశాలలు, పాఠశాలలూ మరియు పాపులర్ పబ్లిక్ ప్రదేశాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 10. జియో ఫై VoLTE కాల్ లకు డేటా ఉపయోగపడుతుందా? అవును. ఉపయోగపడుతుంది. 11. బ్లాక్ అవుట్ డేస్ ఏమైనా ఉంటాయా? లేదు. ఎటువంటి బ్లాక్ అవుట్ డేస్ ఉండవని రిలయన్స్ ప్రకటించింది. అన్ని పండగలకూ, ప్రత్యేక రోజులకూ SMS లకు అదనపు ఛార్జ్ లు వసూలు చేయబడవు. 12. SMS లకు ఏమైనా ఛార్జ్ లు ఉంటాయా? లేదు. అన్ని SMS మరియు వాయిస్ కాల్ లూ పూర్తి ఉచితం. 13. మీరు మీ జియో సిమ్ నుండి ఎయిర్ టెల్ కు కాల్స్ చేయలేకపోతున్నారా? మిగతా టెలికాం ఆపరేటర్లను ఈ విషయమై సహకరించవలసిందిగా రిలయన్స్ కోరింది. ఎయిర్ టెల్ ఒక ప్రెస్ రిలీజ్లో దీనిపై సానుకూలంగా స్పందించింది, కాబట్టి ఇకపై ఈ సమస్య ఉండకపోవచ్చు. 14. రిలయన్స్ జియో యొక్క కస్టమర్ కేర్ నంబర్ ఎంత? మీ కస్టమర్ కేర్ తో మాట్లాడాలంటే మీ జియో నంబర్ నుండి 199 కు డయల్ చేయండి.
|